Latest Updates
-
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే!
డ్రై హెయిర్ ను స్మూత్ అండ్ షైనీగా మార్చే సింపుల్ హెయిర్ మాస్క్ లు
ఆయిల్ హెయిర్ , డ్రై హెయిర్ చాలా ఇరిటేషన్ కలిగిస్తాయి. పొడి జట్టు నీర్జీవంగా మొండిగా ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాత కూడా ముందు ఎలా ఉన్నదో అలాగే కనబడుతుంది. పొడి జుట్టు కొన్ని సందర్భల్లో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ గా కూడా కొంత మందిలో హెయిర్ ఇలా డ్రైగా మారుతుంటుంది. వింటర్ లో ఆయిల్ హెయిర్ ఎక్కువ, సమ్మర్ లో రఫ్ హెయిర్ సమస్య ఎక్కువ. కానీ పొడి జుట్టు వల్ల చుండ్రు సమస్యను ఎదుర్కోవల్సి ఉంటుంది. కేశాలు జిడ్డుతత్వం కలిగి ఉన్నాకూడా చుండ్రు సమస్య ఏర్పడుతుంది. సాధారణ చుండ్రు కేవలం తల మాడు మీద, చర్మ మీద ఏర్పడుతుంది. చుండ్రు వల్ల కేశాలు నిర్జీవంగా కనబడుతాయి
పొడి జుట్టు ఏర్పడటానికి కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం లేదా ఇంటర్నల్ గా ఏదై అనారోగ్యసమస్యలు కారణం కావచ్చు. ఎక్స్ టర్నల్ గా చాలా కారణాల వల్ల జుట్టు పొడిబారడం జగుతుంది. ఉదాహరణకు: కెమికల్ బేస్డ్ షాంపులు, ఎప్పుడో ఒక సారి మార్థమే తలకు మర్ధన, హెయిర్ డై, హెయిర్ పెర్మ్స్, స్విమ్మింగ్ ఫూల్ లోని క్లోరిన్ మరియు హాట్ టబ్ లో స్నానం, బ్లో డ్రయ్యర్ మరియు కర్లింగ్ ఐరన్, ఎక్కవుగా సూర్యని తాపం లేదా గాలి, ఎక్కువ ఖనిజాలున్న స్థానిక నీటి సరఫరా.
బహిర్గితం కారణాల వల్ల జుట్టు డ్రైగా మారితే అందుకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. హోం రెమెడీస్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డ్రైహెయిర్ ను నివారించుకోవచ్చు . కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. తర్వాత స్విమ్ చేసేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి. ఇంటి నుండి బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా క్యాప్ ధరించాలి. అయితే అంతర్గత కారణాలకు అంత త్వరగా పరిష్కారం లేదు. పొడి జుట్టుకు కారణం అయ్యే అంతర్గత కారణాలు: క్యాన్సర్ ట్రీట్మెంట్, కొన్ని మందులు, పోషకాహార లోపం, దీర్ఘకాలిక అనారోగ్యం. కాబట్టి ఈ సమస్యలన్ని అధిగమించి, ఆరోగ్యవంతమైన జుట్టు పొందడానికి, డ్రైగా మారిన జుట్టును సాప్ట్ అండ్ షైనీగా మార్చడానికి కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ లు గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో..ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

అరటితో హెయిర్ మాస్క్:
అరటిపండును రెండుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో అరకప్పు పాలు పోసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్నిహెయిర్ మాస్క్ ల తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే డ్రై హెయిర్ సమస్య తగ్గుతుంది.

పెరుగు మాస్క్ :
చిక్కటి పెరుగును జుట్టుకు, తలకు పట్టించి మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఎగ్ మాస్క్ :
డ్రై హెయిర్ నివారించడానికి ఎగ్ హెయిర్ మాస్క్ మరో చక్కటి హోం రెమెడీ. గుడ్డులోని తెల్లని పదార్థంను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నాం చేస్తే జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు అందడంతో పాటు, డ్రై హెయిర్ నివారించబడుతుంది.

హెర్బల్ టీ :
డ్రై హెయిర్ నివారించుకోవడం కోసం హేర్బల్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. హేర్బల్ టీలో ఉండే ఔషధగుణాలు డల్ గా నిర్జీవంగా ఉన్న జుట్టును బలోపేతం చేస్తుంది . మరియు జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది. తలస్నానం చేసిన తర్వాత గ్రీన్ టీ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. అదే విధంగా చమోమెలీ టీ జుట్టు పెరుగుదలను మరియు నేచురల్ షైన్ ను అందిస్తుంది

ఫ్రూట్ మాస్క్ :
తలకు ఫ్రూట్ జ్యూస్ లతో మాస్క్. ఒక చెంచా ఫ్రెష్ ఆపిల్ జ్యూస్ అందులో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్నితలకు పట్టించాలి. 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

డ్రైహెయిర్ కు బీర్:
బీర్ ను తలకు ఉపయోగించడం వల్ల చుండ్రును నివారించడం మాత్రమే కాదు, ఇది డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ను కూడా నివారిస్తుంది. నెలలో రెండు సార్లు బీర్ తో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కీరదోసకాయ మాస్క్:
కీరదోసకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, ఆ నీటితో హెయిర్ వాష్ కు ఉపయోగించుకోవచ్చు . తర్వాత రోజ్ వాటర్ తో వాష్ చేసుకోవాలి . ఈ సింపుల్ హోం రెమెడీ ద్వారా మీ జుట్టును నేచురల్ గానే సాఫ్ట్ గా మార్చుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్
మాస్క్ డ్యామేజ్ అయిన జుట్టు మరియు లిప్స్ ను ఒక బెస్ట్ హోం రెమెడీ ఇది. ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మరియు 3 గుడ్లను మిక్స్ చేసి తలకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత అరగంట వరకూ ఒక ప్లాస్టిక్ కవర్ తో తలను చుట్టి, తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి

అలోవెర:
కలబంద అనేక విధాలుగా మీ జుట్టుకు ఒక గొప్ప నివారణ మార్గంగా చెప్పవచ్చు. అంతేకాక అనేక మీ జుట్టు సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది మీ పొడి జుట్టుకు మాయశ్చరైజర్ గా పనిచేసి మీ జుట్టును ప్రకాశవంతంగా మరియు మృదువుగా తయారుచేస్తుంది. కలబంద మీ జుట్టుకు మెరుపును పెంచటానికి ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications