Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
పెళ్లికి ముందు జుట్టు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పెళ్లి కూతరుగా.. చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాయిశ్చరైజర్ కోల్పోకుండా.., ఎస్ పీఎఫ్ ఉండేలా జాగ్రత్త పడాలి. పెళ్లికి ముందు ఎట్టిపరిస్థితుల్లో కొత్త ప్రొడక్ట్స్ ఉపయోగించరాదు. అలాగే.. జుట్టు విషయంలో చాలా కేర్ తీసుకోవడం వల్ల.. హెల్తీగా, షైనీగా ఉంటాయి.
కర్లీ హెయిర్, డ్రై హెయిర్ ఏదైనా.. పెళ్లి రోజు అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైగా ఉండే జుట్టు.. చిట్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి.. పెళ్లి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ జుట్టు చాలా హెల్తీగా, షైనీగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
మరి పెళ్లికి ముందు ఎలాంటి న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవ్వాలి. ఎలాంటి టిప్స్ వల్ల కుదుళ్లు బలంగా, పోషణ పొంది.. అందంగా కనిపిస్తాయో చూద్దాం..

కొన్ని జాగ్రత్తలు
6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల చిట్లిపోవడాన్ని అడ్డుకోవచ్చు. అలాగే 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. జుట్టుకి కూడా ఎండ తగలకుండా.. స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.

ఆవనూనె
మీ జుట్టు డ్యామేజ్ అయి ఉంటే.. పెళ్లి రోజూ మీ జుట్టు అందంగా కనిపించడానికి సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. 4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, అదే మోతాదులో ఆవనూనె మిక్స్ చేసి.. స్కాల్ప్ కి పట్టించాలి. ఉదయాన్నే మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.

పీహెచ్ బ్యాలెన్స్ షాంపూ
పీహెచ్ బ్యాలెన్స్ చేసే న్యాచురల్ షాంపూ ఉపయోగించడం వల్ల స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. 1 క్యాన్ ఆర్గానిక్ కొకొనట్ షాంపూ, మూడో వంతు కప్పు లోవెరా షాంపూ, ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. అన్నింటినీ ఒక గిన్నెలో మిక్స్ చేయాలి. ఐస్ ట్రేలో వేసి.. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఒక ఐస్ క్యూబ్ తీసి.. రెగ్యులర్ షాంపూలా తయారు చేయాలి.

హెయిర్ మాస్క్
చర్మంలాగే జుట్టుకి కూడా.. ఉపశమనం కావాలి. కండిషనింగ్ అవసరం. ఒక ఎగ్ వైట్, అర టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. అన్నింటినీ ఒక గిన్నెలో మిక్స్ చేసి.. బాగా కలపాలి. కాటన్ బాల్ సహాయంతో.. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి. చూపుడువేలుతో మసాజ్ చేసుకోవాలి. తర్వాత హాట్ టవల్ చుట్టుకోవాలి. గంట తర్వాత హెర్బల్ షాంపూతో స్నానం చేయాలి.

కొత్త ప్రయత్నాలు వద్దు
కొత్త హెయిర్ స్టైల్, హెయిర్ కలర్, హెయిర్ ప్రొడక్ట్ వాడటానికి పెళ్లికి ముందు ఏమాత్రం సరైన సమయం కాదు. కాబట్టి.. మామూలుగా వాడే వాటినే.. వాడటం మంచిది. లేదంటే.. సైడ్ ఎఫెక్ట్స్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఇబ్బందిపెడతాయి.

పోషకాలు
జుట్టు, చర్మం ఆరోగ్యానికి తగ్గట్టు ఉంటాయి. కొన్ని తాజా కూరగాయలు, ఫ్రూట్ జ్యూస్, కొన్ని నట్స్, ప్రొటీన్ రిచ్ మాంసం తీసుకోవాలి. ఎంత వీలైతే అంత మొత్తంలో తినడం వల్ల.. మెరుగైన ఫలితాలు పొందుతారు. అలాగే టెన్షన్ పడకుండా.. చాలా రిలాక్స్ ఉండాలి.



Click it and Unblock the Notifications
