హెయిర్ ఫాల్ తగ్గించి.. హెయిర్ గ్రోత్ కి సహాయపడే టాప్ ఫ్రూట్ జ్యూస్ లు..

By Swathi

హెయిర్ లాస్..!! ఇది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరినీ ఇబ్బందికి గురి చేసే సమస్య. ఒకరకంగా చెప్పాలంటే.. జుట్టు రాలుతోంది అంటే.. తీవ్ర ఒత్తిడికి కూడా లోనయ్యే ఛాన్స్ ఉంది. కానీ.. ఇంతగా చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే.. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి అనేక పరిష్కారాలున్నాయి. కాస్త ఓపిక చేసుకుని కేర్ తీసుకుంటే.. జుట్టు రాలడం ఆపడం తేలికే.

జుట్టు రాలడానికి మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్, కాలుష్యం, కెమికల్స్, ఆందోళన, హార్మోనల్ డిజార్డర్, మందులు. ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అంతేకాదు.. నిద్రపోయే విధానం కూడా జుట్టు రాలడానికి కారణమవుతోంది. కారణమేదైనా.. జుట్టు రాలకుండా వెంటనే కేర్ తీసుకోకపోతే.. మొత్తానికే మోసం వచ్చే అవకాశముంది. కాబట్టి.. ఇక్కడ ఉన్న ఫ్రూట్ జ్యూస్ లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా మీ జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫాలో అయిపోండి..

క్యారెట్

క్యారెట్

జుట్టు పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్, మినిరల్స్ క్యారెట్ లో పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ , మినిరల్స్ జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు, జుట్టు మందగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మీకు అవసరం అయ్యే బీటాకెరోటిన్ అందుతుంది.

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్

నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి.. జుట్టు వేగంగా పెరగడానికి ఈ ఆరెంజ్ జ్యూస్ మంచిది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. హెయిర్ ఫోలిసెల్స్ మీద ప్రభావం చూపే ఫ్రీరాడికల్స్ మీద పోరడే గుణం ఈ ఆరెంజ్ లోని యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉన్నాయి.

కివి

కివి

కివి పండ్లలో విటమిన్లు, పొటాషియం అధికం. ఈ పండు సిట్రస్ జాతికి చెందినది.. కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ గా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

మామిడి రసం

మామిడి రసం

పండ్లలో రారాజు మామిడి. ఎందుకంటే ఏ పండ్లలో లేని విధంగా మామిడిలో విటమిన్స్, మినిరల్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే హై విటమిన్ కంటెంట్ జుట్టు పెరుగుదలకు, హెయిర్ ఫాల్ తగ్గించడానికి సహాయపడతాయి. మ్యాంగో జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

ద్రాక్ష

ద్రాక్ష

ద్రాక్ష రసంలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తంలోనికి ఆక్సిజన్ తీసుకుపోయే హీమోగ్లోబిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. ఇది తలకు అవసరం అయ్యే బ్లడ్ ఫ్లో నిపెంచుతుంది.

కీరదోస జ్యూస్

కీరదోస జ్యూస్

కీరదోసకాయ సరైన హెయిర్ గ్రోత్ కు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులోని ఎంజైమ్స్, హీమోగ్లోబిన్, ఫోలీసెల్స్ ను పెంచుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు కీరదోస జ్యూస్ ను త్రాగడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు.

జామ జ్యూస్

జామ జ్యూస్

జామకా జ్యూస్ లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతే కాదు ఇంకా క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మొదలగునవి ఉంటాయి. జుట్టు పెరుగుదలో అద్భుతంగా సహాయపడుతాయి. దీన్ని పచ్చిగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ లా తీసుకోవచ్చు.

పాలకూర జ్యూస్

పాలకూర జ్యూస్

పాలకూరలో అనేక విటమిన్స్, ఖనిజాలు, ఇనుము, యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ప్రతి రోజు పాలకూర జ్యూస్ తీసుకుంటే జుట్టు పలుచన అవటం, తల చర్మం మీద దురద వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.

స్ట్రాబెర్రీ జ్యూస్

స్ట్రాబెర్రీ జ్యూస్

స్ట్రాబెర్రీ జ్యూస్ లో విటమిన్ సి పుష్కంగా ఉండి ఇది శరీరంలో ప్రోటీనులను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి స్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకుంటూ ఉండాలి.

కొత్తిమీర జ్యూస్

కొత్తిమీర జ్యూస్

కొత్తిమీర జ్యూస్ జుట్టు రాలడంతో పోరాడుతుంది మరియు ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఇది చాలా సమతుల్యమైన జ్యూస్. ఇది ఇతర పానీయాలతో జోడించి తీసుకోవచ్చు. అలాగే కొత్తిమీర ఆకులను మెత్త్గా పేస్ట్ చేసి, తలకు పట్టించి, ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Story first published: Sunday, April 24, 2016, 14:00 [IST]
Desktop Bottom Promotion