Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ హెయిర్ ప్యాక్ తో జుట్టుకి అమేజింగ్ బెన్ఫిట్స్..!!
మీ జుట్టు సంరక్షణ కోసం రకరకాల షాంపూలు, ఆయిల్స్, కండిషనర్స్ ఉపయోగించారా ? జుట్టు ఒత్తుగా కనిపించడానికి రకరకాలుగా ప్రయత్నించారా ? కానీ ఫలితం లేకపోవడంతో.. చాలా నిరాశ చెందారా ? ఒకవేళ నిజమైతే.. న్యాచురల్ హెయిర్ మాస్క్ లతో మీకు కావాల్సిన కురుల సౌందర్యం పొందవచ్చు.
మీ జుట్టు అందంగా, న్యాచురల్ షైనీగా మెరవాలంటే.. ఖచ్చితంగా న్యాచురల్ పదార్థాలను మీ జుట్టుకి ఉపయోగిస్తే.. కెమికల్స్ వల్ల.. హానికలుగకుండా.. ఉంటుంది. సాధారణంగా మార్కెట్ లో జుట్టు సంరక్షణకు అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.
షాంపూలు, కండిషనర్స్, సెరమ్స్ వంటివి దొరుకుతాయి. కానీ.. ఈ ప్రొడక్ట్స్ అన్నింటిలో.. ఎక్కువ మోతాదులో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి.. మీ జుట్టుని హెల్తీగా మార్చుకోవాలంటే.. వంటింట్లో దొరికే పదార్థాలను ఉపయోగించాలి. మీకు తెలుసా.. ఆలివ్ ఆయిల్, గుడ్డులోని తెల్లసొన జుట్టుకి అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది.
1టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక గుడ్డులోని తెల్లసొన రెండింటినీ.. బాగా మిక్స్ చేసి.. మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని జుట్టుకి పట్టించి.. 15 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. మరి ఈ ప్యాక్ అప్లై చేస్తే పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

జుట్టు రాలడం
ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కుదుళ్లను స్ట్రాంగ్ గా మార్చి.. జుట్టు రాలడాన్ని అరికడతాయి.

చిట్లిపోవడాన్ని
ఈ హోంమేడ్ హెయిర్ ప్యాక్ జుట్టుకి పోషణ అందిస్తుంది. జుట్టు హెల్తీగా పెరగడానికి సహాయపడి.. చివర్లు చిట్లిపోకుండా.. అడ్డుకుంటుంది.

పొడిబారడాన్ని
ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ రెండింటినీ..కలిపి ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు సాఫ్ట్ గా మారుతుంది. డ్రైగా మారకుండా అడ్డుకుంటుంది.

హైడ్రేట్
ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్.. జుట్టుని హైడ్రేట్ చేస్తుంది. మాయిశ్చరైజర్ అందిస్తుంది. దీనివల్ల జుట్టు సాఫ్ట్ గా, సిల్కీగా ఉంటుంది.

జుట్టు బ్రేక్ అవకుండా
ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ లో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల.. జుట్టుని స్ట్రాంగ్ గా మారుస్తాయి. దీనివల్ల జుట్టు బ్రేక్ అవకుండా.. హెల్తీగా ఉంటుంది.

షైనీగా
ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ కాంబినేషన్ లో జుట్టుని షైనీగా మార్చే సత్తా ఉంటుంది. అలాగే.. ఇది అద్భుతమైన పోషకాలను అందిస్తుంది.

అందంగా
ఈ హోంమేడ్ మాస్క్ జుట్టుని ఒత్తుగా కనిపించేలా చేస్తుంది. జుట్టుకి ఎప్పటికప్పుడు పోషణ అందించి.. అందంగా మారుస్తుంది.

చుండ్రు
ఈ హైడ్రేటింగ్ మాస్క్.. స్కాల్ప్ లో డ్రైనెస్ ని తగ్గించి.. చుండ్రుని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

హెయిర్ గ్రోత్
ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ లో పోషకాలు.. జుట్టు తంతువులకు పోషణ అందించి.. కొత్త జుట్టు ఏర్పడటానికి శక్తిని ఇస్తుంది. దీనివల్ల.. మీ జుట్టు మరింత అందంగా కనిపిస్తుంది. వేగంగా పెరుగుతుంది.

స్మూత్ గా
మీ జుట్టు స్మూత్ గా మారాలంటే.. న్యాచురల్ ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్ మాస్క్ అప్లై చేస్తే.. చాలా ఎఫెక్టివ్ గా ఫలితాలను అందిస్తుంది.

స్కాల్ప్ కి క్లెన్స్
ఈ హోంమేడ్ హెయిర్ ప్యాక్ స్కాల్ప్ ని క్లెన్స్ చేసి.. తలలో పేరుకున్న దుమ్ము, చెమట తొలగిస్తుంది.

ఆయిలీ స్కాల్ప్
ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్ మాస్క్ సెబమ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసి.. ఆయిలీ స్కాల్ప్ ని.. అద్భుతంగా అరికడుతుంది.



Click it and Unblock the Notifications