Latest Updates
-
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి!
స్త్రీ ముఖం అందంగా ఆకర్షణీయంగా కనబడాలంటే....

1. శరీరం రంగు, ధరించే దుస్తులను బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే నుదురు ఆకృతిని బట్టి కూడా ఏ బొట్టు నప్పుతుందో చూసుకోవాలి. నుదురు చిన్నగా వుంటే కొంచెం పొడవుగా వుండే బొట్టు, ఆటీన్ ఆకారంలో వుంటే బొట్టు పెట్టుకోవాలి. నుదురు వెడల్పుగా వుంటే గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది. నుదురు పెద్దగా వుండేవారు బొట్టును కనుబొమల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే అందంగా వుంటుంది.
2. అలాగే శరీరా ఆకృతిని, శరీర ఛాయను బట్టి కూడా బొట్టును సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడే ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెల్లని శరీరఛాయ గలిగిన వారికి ముదురురంగు బొట్టు ఆకర్షణీయంగా వుంటుంది. చామనఛాయ లేదా అంతకన్న కాస్త రంగు తక్కువగా వున్నవారైతే పింక్, ఆరంజ్, గంధపురంగు, లేత గులాబి రంగు, ఎరుపు రంగు బొట్టు కళగా వుంటాయి.
3. కళ్ళు పెద్దవిగా వుంటే పెద్ద బొట్టు, చిన్నగా వుంటే కొంచెం చిన్నసైజు బొట్టు శోభాయమానంగా వుంటుంది. నుదురు పెద్దగా వున్నవారు పెద్ద బొట్టు పెట్టుకుంటే నుదురు పెద్దగా వున్న విషయం అంతగా తెలీదు. కళ్ళు చిన్నగా ఉన్నవాళ్ళకి రకరకాల ఆకృతులు, మ్యాచింగ్ రంగుల బొట్టు పెట్టుకున్నా బావుంటుంది. కానీ మధ్యవయసు వారికి ఎరుపు, పింక్ వంటి రంగులు, గుండ్రటి బొట్టు నిండుదనాన్నిస్తుంది.
4. పొట్టిగా వున్నవాళ్ళు పొడుగు బొట్టు పెట్టుకొంటే అందంగా, హుందాగా కనిపిస్తారు.



Click it and Unblock the Notifications
