Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
ప్రేమికుల రోజు కానుకగా అందాన్ని అర్పించండి....

యుక్తవయసులో ఉన్నవారైనా, మధ్య వయస్కులైనా మహిళలంతా కోరుకునేది అందం. అందులోనే వారికి ఆనందం.. ఆత్మవిశ్వాసం. ఏడాది పొడుగునా ప్రతి రోజూ అందంగా కన్పించాలని కోరుకోవడం సహజం. వాలంటైన్స్ డేలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రత్యేక అవసరం మరింత అధికమవుతుంది. ప్రేమికులు ఈ అవసరాన్ని గుర్తించారు. ప్రేమికురాలికి ఆనందాన్ని కలిగించే అందాన్ని బహుమతిగా అందిస్తున్నారు. లోపాలను సవరిస్తూ సౌందర్యాన్ని పెంచే ఫిల్లర్స్, బొటాక్స్ లాంటి సౌందర్య చికిత్సను బహుమతిగా ఇవ్వడం ఈ వాలంటైన్స్ డే పోకడగా ఉంది. 'వ్యక్తిగత సౌందర్య పోషణ, ఆసక్తి పెరుగుతోంది. నాన్ సర్జికల్ కాస్మొటిక్ ప్రొసీజర్లపై మక్కువ అధికమవుతోంది. కొనుగోలు శక్తి, అదాయం అధికం కావడంతో ట్రీట్ మెంట్‌లను బహుమతిగా అందించడం మొదలైంది.
బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు ఏమైనా తీసుకెళ్లడం మర్చిపోతారేమో కానీ ప్రేమికుల రోజు మాత్రం గిఫ్ట్‌లు తీసుకెళ్లడం మర్చిపోరు ప్రేమికులు. ఎర్రగులాబీ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పి, వెంటనే ఈ మధురమైన క్షణాలను తీపిజ్ఞాపకాలుగా దాచుకుందాం అని చాకోలెట్ లను ఇచ్చిపుచ్చుకుంటారు. తరువాత బై చెప్పి వెళ్లిపోతారు... అనుకోకండి. లవర్స్ కలిసాకా కొన్ని రోమాంటిక్ కబుర్లు చెప్పుకోకుండా ఉండలేరు. కళ్లలోకి కళ్లు పెట్టి ప్రపంచాన్ని మర్చిపోవడం ప్రేమికులకు అలవాటే. ప్రేమికుల రోజున ఇచ్చే చిన్న కానుకలైనా ఈ ప్రేమబంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. వాలెంటైన్ డే రోజున ప్రేమికులు ఒకరికొరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని తమలోని ప్రేమ బంధాన్ని తెలియజెప్పుకుంటారు. తమ భావాలను వ్యక్తీకరించే విధానాన్ని జీవితంలో ఎన్నడూ మరిచిపోలేరు.



Click it and Unblock the Notifications
