Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హాట్ హాట్ గా మదిని దోచేసే నెయిల్ పాలిష్ కలర్స్
సౌందర్యానికి... అందానికి మహిళలు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకే కేశాల నుండి కాలి గోళ్ల వరకూ అలంకరణకు నోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎదుటి వారిని ఆకట్టుకొనేందుకు గోళ్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్రస్సులకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకోవడం నిన్నటి ఫ్యాషన్ అయితే గోళ్లపై పెయింటింగ్ అనేది నేటి ఫ్యాషన్ లో సర్వసాధారణం అయిపోయింది..
ముఖ్యంగా పార్టీలకు, ఫంక్షన్లకు నెయిల్ ఆర్ట్ ను నగరాలలో ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు ఈ కళపై ఆసక్తి చూయిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా సరే అంటూ చేతి గోళ్లపైనే కాకుండా కాలి గోళ్లపై కూడా అందమైన చిత్రాలు వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే క్రమంగా ఈ అలవా టు మధ్య తరగతి మహిళల అలవడటంతో నెయిల్ ఆర్ట్ కు విపరీతమైన ఆదరణ పెరిగింది. గోళ్లపై అంద మైన చిత్రాలు వేయించుకునే సమయం లేని వారు అందమైన రంగు, రంగుల బొమ్మలను కూడా గోళ్ళకు అంకరించుకుని అందరినీ అలరించవచ్చు. గోళ్ళపై ఆర్ట్ శోభాయమానంగా కనిపిస్తుంది. గోళ్ళపై ఆర్ట్ గోరింటాకు వేసుకోవడం లాంటిదే.

రెడ్ నెయిల్ పాలిష్: బ్రైట్ రెడ్ నెయిల్ పాలిష్ అద్భుతమైన లుక్ ను అందిస్తోంది . ఎటువంటి చర్మం ఛాయ కైనా అద్భుతంగా నప్పుతుంది.

మెరూన్ నెయిల్ పాలిష్: అన్ని రకాల ఎరుపు రంగుల చాలా అద్భుతంగా కనబడుతాయి. ఎరుపులోనే మరికొంత డార్క్ మెరూన్ నెయిల్ పాలిష్ చూడండి, ఎక్సట్రాడినరీగా కనబడుతున్నాయి.

నియాన్ పింక్ నెయిల్ పాలిష్: గతంలో లైట్ పింక్ నెయిల్ పాలిష్ ఓ సందర్భాలో వాడుతున్నారు. అయితే ఇప్పుడు అదే పింక్ మరింత షేడ్స్ ను అందించే నియోన్ కలర్స్ కళ్ళ మిరిమిట్లు గొలిపేల గోళ్ళు మెరిసిపోతున్నాయి. బబుల్ గమ్ పింక్ నెయిల్ పాలిష్ ట్రెండీ లుక్ ను అందిస్తున్నాయి.

నియాన్ ఆరెంజ్ నెయిల్ పాలిష్: ప్రస్తుత ఫ్యాషన్ మార్కెట్లో పింక్ తర్వాత ఆరెంజ్ ఎక్కువగా అమ్ముడు పోతోంది. ఇక్కడ కనిపిస్తున్న కరీనా కపూర్ నియాన్ ఆరెంజ్ కలర్ నెయిల్ పాలిష్ తో రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతోంది.

బ్రౌన్ నెయిల్ పాలిష్: కరిష్మా కపూర్ వయస్సుకు తగ్గట్టుగా స్టైల్, శరీర పోషణ మెయింటైన్ చేస్తోందనిపిస్తోంది. ఆమె ధరించిన డ్రెస్ మరియు యాక్ససరీస్, నెయిల్ పాలీష్ అన్నీ బ్రైట్ అండ్ బోల్డ్ గా కనిపిస్తున్నాయి.

నియాన్ బ్లూ నెయిల్ పాలిష్: నియాన్ నెయిల్ పాలిష్ లలో వివిధ రంగులో ఉండే బ్లూ కలర్ నెయిల్ పాలిష్ చాలా పాపులర్ అయ్యింది. ఈ నియాన్ బ్లూ కలర్ ప్రస్తుతానికి ట్రెండీ నెయిల్ పాలిష్.

అక్వా బ్లూ నెయిల్ పాలిష్: నెయిల్ పాలిష్ ల్లో అమితంగా ఆకట్టుకోగలిగే మెరిసేటటువంటి థిక్ అక్వాల నెయిల్ పాలిష్ మాంట్ కలర్ డ్రెస్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

బ్లాక్ బ్యూటీ నెయిల్ పాలిష్: స్టైలిష్ గా మారడం ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ఘట్టం. బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ ప్రస్తుత సెలబ్రెటీలతో పాటు, కాలేజీ స్టూడెంట్, మహిళా ఉద్యోగినులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

సిల్వర్ టచ్: ధరించే దుస్తులను బట్టీ కూడా నెయిల్ పాలిష్ కలర్ ఆధారపడి ఉంటుంది. అతి పలుచని ముదురు వర్ణాలు ధరించేటప్పుడు నెయిల్ కలర్స్ బాగా నప్పుతాయి. ఇక్కడ సన్నీలియోన్ బ్రైట్ కలర్ ట్రాన్పరెంట్ శారీలో చాలా సింపుల్ గా ఉన్నా సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకొన్నది.

గో గ్రీన్: ప్రస్తుత ట్రెండ్ ను అకట్టుకొంటున్న నియాన్ గ్రీన్ ప్రస్తుత రోజుల్లో చాలా పాపులర్ అయింది. మీకు నచ్చిన కలర్ దుస్తులకు మీకు నచ్చిన నియాన్ గ్రీన్ బాగా నప్పుతాయి. కాబట్టి గో ఫర్ గో గ్రీన్.
అయితే ఒకే రంగులో కాకుండా వివిధరంగుల్లో ముఖ్యంగా ఆకర్షణీయంగా కనిపించే పింక్, పర్సుల్ రంగులతో వివిధ పుష్పాలను గోళ్ళపై అలంకరిం చుకోవచ్చు. అంతే కాదు వారివారి ఆసక్తులను బట్టి కార్టూన్స్ వేసుకోవచ్చు. ఈ బోమ్మలను, అలంకరణలను సందర్భానుసారం మార్చు కోవచ్చు. బర్త్‌డే, వేడింగ్ డే, పెళ్ళి, పార్టీ ఇలా పలురకాల సందర్భలను బట్టి నెయిల్ ఆర్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్ ను ఎంపిక చేసుకొన్నాక ఎలాంటి రంగు అయితే హాట్ హాట్ గా కనిపిస్తాయి అలాంటి రంగులను ఎంపిక చేసుకోవాలి.
నెయిల్ పాలిష్ కొత్త దుస్తులు, ట్రెండ్ కు దస్తులు ఎప్పుడూ మారూతూనె ఉంటాయి. అలాగే ఈ ఫాషన్ ప్రపంచలో నెయిల్ పాలిష్ పరిస్థితి కూడా అలా మారిపోయింది. ఎందుకంటే గతంలో ఎక్కువగా లైట్ కలర్స్, ట్రాన్సపరెంట్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడే వారు. అయితే ప్రస్తుత కాలంలో అలావారిని చూడాలంటే అరుదైపోయింది. మరి రెడ్ కలర్ అయితే బోల్డ్ గా కనబడుతుంది. ఈ రెడ్ కలర్ ను ఉపయోగించడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది. మరో చేతికేమో నియోన్ నెయిల్ పాలిష్ కలర్ ఇప్పటి ఫ్యాషన్ అధిరిపోయోల కానబడుతున్నాయి. నియాన్ తో పాటు ప్రస్తుత ట్రెండును ఆకట్టుకో గలిగే ఫ్రెంచ్ మేనిక్యూర్ మరియు ఎనామిల్ కలర్స్ ప్రస్తుతం మార్కెట్లో విహారం చేస్తున్నాయి . కాబట్టి మీకు నచ్చే ఈ హాట్ కలర్స్ ను ఎంపికచేసుకొనే ఎంజాయ్ చేయండి..
ప్రస్తుత ట్రెండ్ కు నచ్చే హాట్ నెయిల్ పాలిష్ కలర్స్:



Click it and Unblock the Notifications