Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..అమేజింగ్
ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ చూపరులకు ఒక బొనాంజా. ఫ్యాషన్ వీక్ రెండవ రోజున యాంబే వాలీ ఫ్యాషన్ వీక్ 2013న జోష్నా తివారీ కలెక్షన్స్ ను ప్రదర్శించారు. జోష్నా తివారి రూపొందించిన బ్రైడల్ దుస్తులు లెహంగా చోలీ లేదా శారీలు ఎవైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండవు. ఏదో ఒక కొత్త పద్దతిలో డిజైన్ చేస్తూ చూపలరులను ఆకట్టుకొంటుంటారు. గత సంవత్సరం కూడా ఫ్యాషన్ వీక్ కు హాజరైనప్పుడు ఒక ‘మిస్టికల్ రొమాన్స్' థీమ్ తో ఆమె ప్రదర్శన ఇచ్చింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆమె మోడ్రన్ గా, తనదైన శైలిలో డిజైన్ చేసింది.
ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో చాలా అందమైన లహెంగా మరియు అవుట్ ఫిట్స్ లో ర్యాప్ వాక్ చేసారు . ఈ ఫ్యాషన్ షోలో బ్లూ మరియు పింక్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ గా నిలిచాయి. ఈ సంవత్సరలో ఆంబే వ్యాలీ ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ కు పోటీగా ఈ రెండు కలర్స్ డామినేట్ చేసేలా జోష్నా తివారీ డిజైన్ చేశారు . ఈమె రూపొందించి గౌన్స్ అన్నీ కూడా పూర్తి ఫ్రిల్స్ తో అద్భుతంగా పొడవాటా ఫ్లోర్ గౌన్స్ గా రూపొందించారు.
జోష్న తివారీ డిజైన్ చేసిన దుస్తులను జాక్విలైన్ ఫెర్నేడేజ్ ధరించి ర్యాంప్ పై ప్రదర్శించారు. ఈ సంవత్సరం ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013గాన్ జోష్నతివారీ డిజైన్ దుస్తులను ధరించిన జాక్విలైన్ ఫెర్నాండేజ్ షో స్టాపర్ గా నిలిచారు. పింక్ కలయిక కలిగిన గౌన్ ముందు చీలిక కలిగిన డ్రెస్ ను, బ్లాక్ లెగ్గింగ్స్ ను ధరించి ర్యాంప్ మీద ప్రదర్శన ఇచ్చింది.
మరీ మీరు ర్యాంప్ అందచందాలను..మోడల్స్ సొగసులను చూడాలనుకుంటున్నారా? ఐతే Aamby Valley ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 ఫ్యాషన్ కలెక్షన్స్ మీద ఒక లుక్కేయండి..

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
స్కై బ్లూ మెర్మైడ్ గౌన్: ఈ స్కైబ్లూ మెర్మైడ్ గౌన్ చాలా అందంగా టైట్ ఫిట్టింగ్ తో తొడల వరకు శరీర ఆకారాన్ని స్పష్టంగా తెలిసేలా తర్వాత ష్కర్ట్ టైప్ లో చాలా అద్భుతంగా రూపొందించబడింది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
ఎంబ్రాయిడరీ కోల్ బర్ట్ బ్లూ డ్రెస్: బ్లూ కలర్ సిల్క్ డ్రెస్ మీద పూర్తి ఎల్లో థ్రెడ్ వర్క్ చాలా రిచ్ గా కనబడుతోంది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
స్కూప్డ్ నెక్ రాయల్ బ్లూ డ్రెస్: ఈ స్లీవ్ లెస్ రాయల్ బ్లూ డ్రెస్ చాలా ఆకర్షణీయంగా ఉంది. మోకాళ్ళ వరకూ ఈ డ్రెస్ శరీరా ఆకారానికి ఫిట్ గా సరిపోయింది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
వంగపువ్వు రంగు ఫూట్ వేర్: రాయల్ బ్లూ కలర్ డ్రెస్ మీదకు ముదురు రంగులో ఉన్న వంగపువ్వు కలర్ ఫూట్ వేర్ బాగా సూట్ అయ్యాయి.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
సిల్క్ టాప్ అండ్ క్రాప్డ్ ట్రోషర్స్: ఈ కోల్బట్ బ్లూ సిల్క్ టైట్ ఫిట్టింగ్ లో మరియు క్రింది బాగంలో ఫ్రిల్ వర్క్ చాలా అందంగా ఉంది. ఈ టాప్ లోనికి బ్లూ బాడర్, బ్లాక్ కలర్ టోషర్స్ ధరించి ర్యాంప్ మీద ప్రదర్శించారు.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
ఆరెంజ్ మెర్మైడ్ గౌన్: లైట్ పింక్, ఆరెంజ్ మిక్స్డ్ గౌన్ దాని మీద అద్భుతమై వైట్ కలర్ థ్రెడ్ వర్క్, ఫుల్ గా ఫ్రిల్స్ తో కూడిన ప్లోర్ ష్కర్ట్ మెస్మరైజింగ్ ఉంది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
పింక్ అండ్ మ్యాట్ గోల్డ్ లహెంగా: పింక్ కలర్ ఫ్రిల్ టాప్, దీని మీదకు గోల్డ్ కలర్ లహెంగా, పింక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో దూప్పట ఆకర్షణీయంగా ఉంది. డ్రెస్ కు తగ్గట్టుంగా సింపుల్ గా నెక్ లెస్ కూడా ఆకర్షణీయంగా కనబడుతోంది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
పూర్తి పింక్ కలర్ లో ఉన్న లెహంగా: మాన్ సూన్ ట్రెండ్ ను అలరించే విధంగా ఈ పింక్ కలర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. పూర్తి పింక్ కలర్ లెహంగా చివర బార్డర్ గోల్డ్ కలర్ లో, మ్యాచ్ అయ్యేలా పింక్ గోల్డ్ జాకెట్ ర్యాంప్ ప్రదర్శనకు ఫర్ ఫెక్ట్ సూట్.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
కప్తానా టాప్ -లెహంగా: ఆరెంజ్ లెహంగా మీదకు చాలా చూడముచ్చటగా అందమైన గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ, చాలా సన్నగా బ్లూకలర్ బార్డర్, ఒక్క షోల్డర్ కోఫ్తానా బంగారు వర్ణంలో చాలా ఆకర్షనీయంగా చూపరులను ఆకట్టుకొనే విధంగా ఉంది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
పెంప్లమ్ చోలీ: ఆరెంజ్ మరయు మ్యాట్ గోల్డ్ కలర్ లెహంగా దీన్ని చూస్తుంటే పేప్లమ్ గౌన్ లాగానే అనిపిస్తోంది. ఆరెంజ్ లెహంగా మీదకు స్లీవ్ లెస్ గోల్డ్ జాకెట్ విత్ ఫ్రిల్స్ తో అద్భుతంగా డిజైన్ చేశారు.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
పింక్ కలర్ ఔట్ ఫిట్: దీన్ని మనం పింక్ మరియు సిల్వర్ లెహంగా చోలీ అని పిలవొచ్చు. నడుము వరకూ సిల్వర్ గోల్డ్ కాబినేషన్ తర్వాత ఒక్క పింక్ కలర్ లెహంగా, బార్డర్ సిల్వర్ కలర్ తో ర్యాంప్ మీద ప్రదర్శన చాలా మంది చూపును ఆకట్టుకొన్నది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
బేబీ పింక్ ఫ్యూషన్ గౌన్: జోష్న తివారి కలెక్షన్స్ లో ఇది ఒక బెస్ట్ అవుట్ ఫిట్ గా ప్రదర్శనలో నిల్చుంది బేబి పింక్ గౌన్ మరియు ముందు కొంత ఓపెన్ కోబాల్ట్ బ్లూ కలర్ కవర్ చేస్తు ఆకర్షించింది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
బ్రౌట్ పింక్ గౌన్: జాక్వైలైన్ ఫెర్నాండేజ్ మరో అద్భుతమైన కాంబినేషన్ లో ర్యాంప్ మీద ప్రదర్శ చేశారు. బ్రౌట్ పింక్ గౌన్, స్ట్రాప్ లెస్ మరియు బ్లాక్ కలర్ లెహంగా అదీ టైట్ ఫిట్టింగ్ తో కలర్ ఫుల్ గా కనిపించారు.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
పింక్ ఫుషన్ గౌన్: చాలా తక్కువ డీప్ కలిగిన బాక్ నెక్, పింక్ కలర్ గౌన్ చాలా అద్భుతంగా ఉంది. గౌన్ క్రింది సగ భాగం సిల్వర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ చేయబడింది.

జోస్నా తివారీ డిజైన్ చేసిన బ్రైడల్ డ్రెస్..
షో స్టాపర్: జాక్వలైన్ ఫెర్నాండేజ్ షో స్టాపర్ గా నిలిచింది. ఆమెతో పాటు చివరగా జోస్నా తివారీ కూడా ర్యాంప్ మీద తోడుగా నిలిచారు. ఆమె డిజైన్ చేసి దుస్తులను జాక్వలైన్ ఫెర్నాండేజ్ ను అభినంధించారు.



Click it and Unblock the Notifications











