Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మగవారిలో మొటిమలు.. వాటి తాలుకు మచ్చలు పోగొట్టే చిట్కాలు...

యుక్తవయసు వచ్చిన యువతీయువకుల్లో కొవ్వు పదార్థం చేరి చిన్న చిన్న మొటిమలు ముఖంపై ఎక్కువగానూ, ఛాతీ, వీపుపై తక్కువగా వస్తాయి. ఇలా యుక్తవయసులో మొటిమలు రావడం సహజమే అయినప్పటికీ, మొటిమలు ఏర్పడగానే తాము అందవిహీనులవుతున్నామని వారు భావిస్తారు. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను రాసుకోవడం, మొటిమలను గిల్లడం మొదలైనవి చేయడం వల్ల మొటిమలు తగ్గకపోగా ఇన్‌ఫెక్షన్‌కు గురై చీము కారడం, మచ్చలు, గుంటలు ఏర్పడతాయి.
మగవాళ్ళలో ఈ హార్నోను ఎక్కవగా వాడితే, వాళ్ళకి ఈ లక్షణాలువచ్చే ప్రమాదం వుంది. ముఖంమీద వున్న మొటిమలు అసహ్యంగా ఉన్నాయని గోళ్ళతో గిల్లడంకాని, వేళ్ళతో నొక్కి పిండడం కాని చేయకూడదు. అందవికారంగా ఉండటం ఎలా వున్నా ఇలా చేయడంవల్ల సెప్టిక్ కావడానికి అవకాశం వుంది. అన్ని సందర్భాలలోనూ సెప్టిక్ కాకపోయినా మొటిమలు గిల్లినచోట మోఖంమీద గుంటలు ఏర్పడి జీవితాంతం వుండిపోతాయి. కొందరికి మొటిమలు చీముపట్టి పెద్దవిగా అవుతాయి. అటువంతప్ప్పుడు డాక్టరుకు చూపించినట్లయితే డాక్టరు తగిన జాగ్రత్తలతో వాటినుండి చీముతీసివేసి తేలికగా మానిపోయేటట్లు చేస్తారు.
టీనేజ్‌లో మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌తో సమస్య అధికమై యాక్నెకు దారి తీస్తుంది. దీని వలన టీనేజ్ అమ్మాయిలు లేక అబ్బాయిలు బయటకు వెళ్లుటకు చాలా ఇబ్బంది పడుచుంటారు. కావున చర్మం తిరిగి క్లియర్‌గా అందంగా, ఆకర్షణీయంగా రావాలంటే ఇంట్లోనే చేసుకోదగిన సింపుల్ సూచనలు...
1. వేరుశనగ నూనె ఒక చెంచా తీసుకొని అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రపరచుకొంటే మొటిమలు, దాని ద్వారా ఏర్పడ్డ నల్ల మచ్చలు తొలగిపోతాయి.
2. ఆరెంజ్ పొట్టును తురిమి లేదా మెత్తని పేస్ట్ లా తయారు చేసి ముఖం మీద, ముఖ్యంగా మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్ర పరచుకోవాలి.
3. లేత మునగకాయ కాడలు, ముగ ఆకులు బాగా మొత్తని పేస్ట్ లా తయారు చేసుకొని దానికి నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి మొటిమలు మీద అప్లై చేసి అరగంట తర్వాత శుభ్ర పరచుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. మొటిమలకు సంబంధించిన చికిత్సకు ఇది ఉత్తమమైన పద్దతి.
4. ముఖం మీద మొటిమలు ఉన్న చోట ఐస్ ముక్కలను రబ్ చేసి మంచి ఉపశమనమిస్తుంది.
5. ఒక చెంచా తేనెలో ఒక చెంచా టమోటో జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్ర చేసుకోవాలి. ఇది ఎప్పటి నుండో ఉన్న మొటిమల మచ్చలు తొలగిపోవడానికి బాగా సహకరిస్తుంది.
6. వెనిగర్ లో ఉప్పు వేసి బాగా రంగరించి తర్వాత ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్ర పరచుకోవాలి.



Click it and Unblock the Notifications