Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మండే ఎండలు..నలుపు..తెలుపు..చర్మ సంరక్షణ...

ఎందలోకి వెళ్లినప్పుడు చర్మం నల్లబడుతుందనడంలో నిజం లేకపోలేదు. మన చర్మం నల్లగా లేదా తెల్లగా ఉండడానికి కారణం చర్మంలో ఉత్పత్తయ్యే మెలనిన్ అనే వర్ణకపదార్థం. చర్మానికి నలుపు రంగు రావడానికి కారణం ఇదే. మన శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు మెలనిన్ ఉత్పత్తని నియంత్రిస్తాయి. ఎండలోకి వెళ్లినప్పుడు అతినీలలోహిత కాంతి ఈ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా అధిక మోతాదులో మెలనిన్ ఉత్పత్తయి చర్మం అంతటా విస్తరిస్తుంది. తద్వారా చర్మం నలుపుదేలుతుంది. అందుకే ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు చర్మం నల్లగా వడలిపోతుంది. కాబట్టి వేసవికాలంలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో చూద్దాం...
1. మామిడి పండ్లు: వీటిలో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని పెంచుతుంది. పైగా ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో వచ్చే పలు రకాల సమస్యకు ఇవి విరుగుడుగా పినచేస్తాయి.
2. కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు, మొలకెత్తిన ధాన్యాలతోపాటు, టొమాటో, క్యారెట్ రసం, మజ్జిగ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటమే మేలు.
3. వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. తెలుపు రంగు సూర్య రశ్మిని నిరోధిస్తుంది. అందుకే తెలుపు రంగు దుస్తులు, తెలుపు రంగు గొడుగునే వాడాలి. లోదుస్తులు కూడా కాటన్ వే ధరించడం మేలు.
4. చాలామంది ఎక్కువసార్లు సబ్బుతో రుద్ది, ముఖానికి రకరకాల క్రీములు పట్టిస్తుంటారు. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. ఎండకాలంలో ముఖానికి క్రీములు ఏవీ వాడకపోవడమే సరైన పద్దతి.
5. ప్రతి రోజూ సన్ స్ర్కీన్ లోసన్ రాసుకోవడం ద్వారా ఎండ తగిలినా అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మం లోపలికి చేరకుండా ఈ సన్ స్క్రీన్ అడ్డుకుంటుంది. అయితే ఒకసారి వేసుకున్న సన్ స్క్రీన్ రెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇది రాసుకోవాలి. ముఖానికే కాకుండా మెడ, చేతులకు కూడా రాసుకోవడం మంచిది. అయితే ఎస్ పి ఎఫ్ విలువ 30ఉన్న సన్ స్ర్కీన్ లు వాడడం ఉత్తమం.



Click it and Unblock the Notifications
