Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
ఫేస్ మాస్క్ వేసుకొనే ముందు మీకోసం కొన్ని చిట్కాలు...!
మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి, మిమ్మల్ని మీరు విలాసవంతంగా చూసుకోవడానికి ఫేస్ మాస్క్ లు, పేస్ పాక్ లు తేలికైన, చవకైన మార్గం. మీ మాస్క్ నుంచి బోలెడు ప్రయోజనం పొందడానికి ఇదిగో కొన్ని చిట్కాలు :
చర్యలు :
1. మీరు ఇంట్లో తయారైన మాస్క్ వాడుతుంటే, ప్రతీ సారీ దాన్ని తాజాగా అప్పటికప్పుడే తయారు చేసుకోండి.
2. మార్కెట్ లో దొరికే ఉత్పత్తి వాడుతుంటే, ఫేస్ మాస్క్ అప్లికేటర్, వెడల్పాటి బ్రష్ లాంటి పరికరాలన్నీ సిద్ధంగా ఉంచుకోండి. కొన్ని దూది ఉండలు, తుడుచుకునే గుడ్డా కూడా తయారుగా ఉంచుకోండి.
3.మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి దోసకాయ లేదా బంగాళా దుంప రెండు ముక్కలు కోసి పెట్టుకోండి. ఇవన్నీ చలాగా అవడానికి ఫ్రిజ్ లో పెట్టి మీరు వాటిని వాడడానికి సిద్ధం కాగానే బయటకు తీయండి. ఈ లోగా మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.

4. అవసరమైతే ఎక్స్ ఫోలియేట్ చేయండి. దీని వల్ల మృత కణాలను తొలగించబడి మీ చర్మం మాస్క్ లను మరింత మెరుగ్గా గ్రహిస్తుంది. రెండు నిమిషాల పాటు ఆవిరి పడితే మీ చర్మం లోని రంధ్రాలు తెరుచుకుంటాయి. ప్రత్యామ్నాయంగా ఒక పొడి గుడ్డ తీసుకుని వేడి నీటి లో ముంచి (మీ ముఖం భరించ గలిగినంత) అది చల్లబడే వరకూ మీ ముఖం మీద వుంచండి. ఫేస్ మాస్క్ అప్లికేటర్ లేదా వెడల్పాటి బ్రష్ తీసుకుని దాంతో మాస్క్ వేసుకోండి. అలాంటివి లేకపోతె మాస్క్ వేసుకునే ముందు మీ చేతులు శుభ్రంగా వున్నాయని నిర్ధారించుకోండి. చేతులను కడుక్కున్నాక మాస్క్ వేసుకునే ముందు వాటిని పూర్తిగా తడారనివ్వండి.
5. మాస్క్ వేసుకున్నాక, దోస లేక ఆలూ ముక్కల్ని మీ కళ్ళ మీద వుంచి ఆ ప్రోడక్ట్ మీద సూచించినంత సేపు గానీ లేదా మీ మాస్క్ ఎండిపోయే వరకు గానీ విశ్రాంతి తీసుకోండి. గదిలో దీపం ఆర్పివేయండి, దానివల్ల మరింత విశ్రాంతి అనిపిస్తుంది. వేచి ఉండాల్సిన సమయం అయిపోయాక మాస్క్ ను తడి గుడ్డ తో గానీ లేదా దూది పాడ్ తో గానీ తుడిచి వేయండి. మట్టి వుండే మాస్క్ లైతే అవి గట్టిపడడం మొదలవగానే కడిగి వేయడం మంచిది. అది ముఖం మీదే పూర్తిగా ఎండిపోకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. దాని తర్వాత ఒక టోనర్, ఒక మాయిశ్చరైజర్ వాడండి.
చిట్కాలు
1. మరింత పోషణ కోసం సుగంధ తైలాలు వాడండి.
2. ఫేస్ మాస్క్ వేసుకున్నాక మేనిక్యూర్ చేయించుకుంటే, మీ గోళ్ళు కూడా శుభ్రపడతాయి.
3. మాస్క్ తీసివేసాక మొహం మీద చల్లటి నీళ్ళు చల్లుకోంది (మరీ చల్లగా వుండకూడదు). దీనివల్ల రంధ్రాలు మూసుకు పోయి రక్త ప్రసరణ మెరుగౌతుంది, ముఖానికి గులాబి కాంతి వస్తుంది.
హెచ్చరికలు
1. మట్టి మాస్క్ లు అయితే ముఖం మీద ఎండిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే వాటి వల్ల ముడతలు, సన్నటి గీతాలు కూడా ఏర్పడతాయి. అంతే కాక మట్టి ఎండిపోయే కొద్దీ చర్మం లోని తేమను ఓస్మోసిస్ ద్వారా లాగేస్తుంది.



Click it and Unblock the Notifications