Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
పసుపు ఫేస్ ఫ్యాక్ తో ఏడే ఏడు రోజుల్లో ఫెయిర్ స్కిన్.!
సౌందర్య సాధణాలలో పసుపుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆ ప్రధాన్యత ఇప్పుడు వచ్చింది కాదు. పురాతన కాలం నుండి పసుపును అందం, ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు.
బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన భారతీయ సాంప్రదాయంలో పూజలు, వ్రతాలు లాంటి శుభ కార్యాల్లో పసుపుకుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళ లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటారు.
పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్ ఫాస్ఫరస్ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్, కాన్సర్ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్ నిరోధించేవి, ట్యూమర్ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్ అనే పదార్థం వల్లననే పసుపు సహజమైన పసుపురంగులో ఉంటుంది.
పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతిలో పోషిస్తుంది. సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుంది. వంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలావరకు సంబంధిత భాధలు తగ్గుతాయి. అంటికి మించి మొటిమలను తగ్గించడంలో మరియు నేచురల్ యాంటీసెప్టిక్ గా బాగా సహాయపడుతుంది. చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది.
పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది చర్మానికి సహజత్వాన్ని ఇవ్వడంతో పాటు, సురక్షితంగా ఉంటుంది. ఇంకా పసుపును ఇతర వస్తువులతో కలిపి వివిధ రకాల ఫేస్ మాస్క్ లను తయారు చేసుకుంటారు. ఇది చాలా ప్రభావవంతమైన చర్మ సౌందర్య పదార్థంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో శుభకార్యలు జరగభోతున్నాయనుకుంటే ఒక వారం ముందు నుండి పసుపును మీ బ్యూటీ వస్తువుగా ఉపయోగించడం మొదలు పెట్టండి. 7రోజుల్లో ఫెయిర్ స్కిన్ పొందడానికి ఈ నేచురల్ టర్మరిక్ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. ఈ ఫేస్ మాస్క్ మీరు నిర్ధేశించుకొన్న కాలంలోనే మంచి ఫలితాలను అంధిస్తుంది.
ఫెయిర్ స్కిన్ పొందడానికి టర్మెరిక్ ఫేస్ ప్యాక్స్ మీకోసం...

పసుపు మరియు మస్టర్డ్ ఆయిల్: పచ్చిగా ఉన్న పసుపు అల్లంలా అగుపిస్తుంది. ఈ పచ్చి పసుపుకొమ్మ మీద మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె)పోయాలి. తర్వాత దీన్ని పేస్ట్ లా గ్రైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నుండి వచ్చే రసానికి కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసుకొని, ముఖానికి పట్టించాలి. ఇది తడి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో కాంతి నిండుతుంది.

పసుపు-పాల క్రీమ్: అతి త్వరగా ఫెయిర్ స్కిన్ పొందడానికి పాలు, పసుపు క్రీమ్ బాగా సహాయపడుతుంది. తాజా మిల్క్ క్రీమ్ మీ చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

పసుపు-తేనె: కొద్దిగా పసుపు, కొద్దిగా మైదాను ఒక టేబుల్ స్పూన్ తేనెలో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో రేడియంట్ లుక్ అంధిస్తుంది.

పసుపు-గంధం: పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగిన ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది.

పసుపు-రోజ్ వాటర్: పసుపులో , ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే అర టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ టర్మరిక్ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి రిలాక్స్ ఇస్తుంది మరియు డీస్ట్రెస్ గా పనిచేస్తుంది.

పసుపు-కుంకుమపువ్వు: కుంకుమ పువ్వు యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు తెలిసినదే, చందనం తర్వాత కుంకుమ పువ్వు అందాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి కుంకుమపువ్వు, పసుపు రెండింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా పాలు మిక్స్ చేసి, ముఖానికి పట్టించడం వల్ల, ఇది తక్షణ మెరుపు అందిస్తుంది. ముఖం ప్రకాశవంతంగా కనబడుతుంది.

పసుపుతో ఫేస్ స్ర్కబ్: కొన్ని సందర్భాల్లో మీ చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి స్ర్కబ్బింగ్ చాలా అవసరం. ఒక చెంచా పసుపు, ఒక చెంచా మిల్క్ పౌడర్ మిక్స్ చేయాలి. ఇందులోనే ఓట్ మీల్ పౌడర్ మరియు ఒక చెంచా పాలు మిక్స్ చేసి, ముఖానికి పట్టించి ఫేస్ స్ర్కబ్ గా ఉపయోగించాలి.

పసుపు మరియు ముల్తానీ మట్టి: ఆయిల్ స్కిన్ మరియు మొటిమల నివారణకు ఫుల్లర్స్ ఎర్త్ లేదా ముల్తానీ మట్టి ఏవిధంగా సహాయపడుతుందో అందరికీ తెలిసిన విషయమే. పసుపు పేస్ట్, పాలు మరియు ముల్తానీ మట్టి సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టించి మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి.

పసుపు మరియు శెనగపిండి: పసుపు ఇండియన్ బ్యూటీ ప్రొడక్ట్. కాబట్టి పసుపు పేస్ట్ కు శెనగపిండి, పాలు కలిపి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద రుద్దాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్ మరియు మురికిని తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications