Latest Updates
-
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.!
మొటిమల నివారణకు ఇంటిలో చికిత్స
సాదారణంగా ఆయిలీ చర్మం ఉన్న వారికీ మొటిమలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్,చర్మ రోగాల వంటివి చర్మ రంధ్రాలకు అడ్డు వస్తాయి.
మొటిమలకు బ్రేక్ అవుట్స్ కలిగించే అన్ని కారకాలను నియంత్రించడానికి అసాధ్యం అయితే,అప్పుడు మీరు సమస్యను తగ్గించడానికి చర్యలు చేపట్టాలి.
మీరు చర్మవ్యాధి నిపుణుల వద్దకు వెళ్ళితే వారు యాంటీబయాటిక్స్ లేదా క్రీమ్లు ఇస్తారు. అయితే మీరు వాటిని తగ్గించుకోవటానికి సహజంగా ఇంట్లో తయారుచేసుకొనే మాస్క్ లు కొన్ని ఉన్నాయి.

బేకింగ్ సోడా
ఇది మొటిమల నివారణకు ఉత్తమ ఇంటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఇది మొటిమ చుట్టూ దురద మరియు నొప్పిని తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ లను కూడా తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా ఒక భాగం మరియు రెండు భాగాల గోరువెచ్చని నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి,10 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. అంతేకాక ఈ మిశ్రమానికి కొంచెం తేనెను కలిపితే మీ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మీ ముఖం ప్రక్షాళన తరువాత పొడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. తర్వాత నూనె లేని మాయిశ్చరైజర్ ని రాయాలి.

టీ ట్రీ ఆయిల్
ఒక అద్భుతమైన క్రిమినాశక మరియు సూక్ష్మజీవుల నిరోధకంగా ఉంటుంది. అందువల్ల ఇది చర్మానికి చాలా బాగుంటుంది.
రెండు స్పూన్స్ డిస్టిల్ వాటర్, ఒక స్పూన్ బేకింగ్ సోడా,ఒక స్పూన్ తేనే,ఐదు,ఆరు చుక్కల టీ ట్రీ ఆయిల్ లను బాగా కలిపి ముఖానికి మాస్క్ వేయాలి.
మీరు తీవ్రమైన మొటిమల సమస్యతో ఉంటే కనుక రోజుకోసారి ఈ మాస్క్ ను వేయాలి.

కొత్తిమీర, పుదీనా రసం
ఇది వేసవిలో చాలా చల్లగా ఉంటుంది. ఒక స్పూన్ కొత్తిమీర లేదా పుదీనా రసం మీ చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఈ రసంలో చిటికెడు పసుపు వేసి చర్మానికి అప్లై చేస్తే మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ తొలగించడానికి మరింత ప్రభావవంతముగా పనిచేస్తుంది. ప్రతి రాత్రి పడుకోవటానికి ముందు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయండి.

తేనె మరియు దాల్చిన చెక్క
తేనె మరియు దాల్చిన చెక్క పొడిని పేస్ట్ గా చేయండి. రాత్రి నిద్రకు ముందు మొటిమల మీద రాయండి. మరుసటి రోజు వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

క్యాబేజీ ఆకులు
క్యాబేజీ ఆకుల రసంను మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఈ వగరుగా ఉన్న రసం రాస్తే వచ్చే తేడాను మీరు కొన్ని రోజులలోనే చూడవచ్చు.

ఉప్పు మరియు నిమ్మరసం
నిమ్మకాయ డ్రై అయినప్పుడు మీరు దానిని వదిలివేయనవసరం లేదు. ఎందుకంటే ఆ నిమ్మరసంతో మొటిమలను తగ్గించుకోవచ్చు. రెండు స్పూన్స్ నిమ్మరసంలో అరస్పూన్ ఉప్పు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి 20 నుంచి 30 నిముషాలు అలా ఉంచి ఆ తర్వాత శుభ్రం చేయాలి. మీరు నిమ్మరసం రాసిన తర్వాత బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే నిమ్మరసంలో ఉన్న బ్లీచింగ్ ప్రభావం మరియు సూర్యుని సున్నితత్వం కారణంగా వెళ్ళకుండా ఉంటే మంచిది.



Click it and Unblock the Notifications