Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పైపెదవిపై అవాంఛిత రోమాలు తొలగించే హోంరెమిడీస్
అమ్మాయిల్లో ఎక్కువగా వేధించే సమస్య అవాంఛిత రోమాలు. చేతులు, పెదాలు, ముక్కు, గడ్డం, కొంతమందికి ముఖమంతా అవాంఛిత రోమాలు ఇబ్బందిపెడుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు అమ్మాయిల్లో నీరసాన్నిస్తాయి. ఎంత తొలగించుకున్నా తాత్కాలిక ఫలితాన్నిస్తాయి కానీ.. పూర్తీగా క్లియర్ చేయలేవు.
అయితే పైపెదవిపై ఇబ్బందిపెట్టే అన్ వాంటెడ్ హెయిర్ తొలగించుకోవడానికి రకరకాల క్రీములు అందుబాటులో ఉంటాయి. కానీ.. పైపెదవిపై అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అయితే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి అన్ వాంటెడ్ హెయిర్ తొలగించే సింపుల్ హోం మేడ్ టిప్స్ ఇప్పుడు చూద్దాం..

గుడ్డు తెల్లసొన
గుడ్డు తెల్లసొనలో కొంచెం మొక్కజొన్న పిండి, పంచదార కలిపి పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే నెలరోజుల్లో పెదవి మీద రోమాల పెరుగుదల తగ్గిపోతుంది.

పసుపు
పసుపులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

నిమ్మరసం
నిమ్మరసంలో కొద్దిగా పంచదార కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత దూదితో అవాంఛిత రోమాలపై రాసుకుని గుండ్రంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రంగా కడగాలి. లేదా పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించి వాక్సింగ్ లా కూడా వాడుకోవచ్చు.

పాల
ఒక స్పూన్ పాలలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పైపెదవిపై రాసి ఆరిన తర్వాత నెమ్మదిగా రుద్ది చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.

శెనగపిండి
శెనగపిండిలో కొంచెం నీళ్లు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చేతి వేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తుండడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

పెరుగు
ఒక గిన్నెలో పెరుగు, శెనగపిండి, పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను పై పెదవి మీద రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గోధుమపిండి
గోధుమపిండిలో కొద్దిగా పసుపు, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను పైపెదవి మీద రాసి పావుగంట తర్వాత నెమ్మదిగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తుంటే సహజంగానే అవాంఛితరోమాలను తొలగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
