Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
బేబీ సాప్ట్ స్కిన్ పొందడానికి సింపుల్ హోం రెమెడీస్ ..
సహజంగా మనుష్యులు చూడటానికి తెల్లగా ఉంటే సరిపోదు. చర్మంలో ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా, సాప్ట్ గా మరియు కాంతివంతంగా ఉన్నప్పుడే నిజమైన అందం తెలుస్తుంది . బేబీ సాప్ట్ స్కిన్ పొందడానికి వివిధ రకాల ట్రిక్స్ ఉన్నాయి.
ప్రస్తుత మోడ్రన్ యుగంలో అమ్మాయిలు అందంగా కనబడుటకోసమనం వెంటే ఫలితాలనిచ్చే ఇన్ స్టాంట్ కెమికల్ బేస్డ్ క్రీములను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు .క్రీమ్స్ తయారుచేసే కంపెనీలు చాలా ఫాస్ట్ రిజల్ట్ అందిస్తాయని ప్యాక్స్ మీద నోట్ చేసుండచ్చు, కానీ వీటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో మాత్రం తెలపరు.

సహజంగా మార్కెట్లో అందుబాటులో ఉండే క్రీములన్నీ అనుకున్న ఫలితాలను అందివ్వవు . కొన్ని ప్రత్యేకమైన హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఫేవ్ లెస్ బేబీ సాప్ట్ స్కిన్ పొందవచ్చు. అలాంటి స్కిన్ పొందడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది.
క్లియర్ స్కిన్ కలిగి ఉండటం మొటిమలను నివారిస్తుంది, ఏజింగ్ లక్షణాలను మరియు ముడుతలను నివారిస్తుంది. బేబీ సాప్ట్ స్కిన్ పొందడానికి వివిధ రకాల బ్యూటీ రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు . అందులో కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ బేబీసాప్ట్ స్కిన్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. . వీటి గురించి తెలుసుకుని రెగ్యులర్ గా వీటిని ఉపయోగిస్తుంటే బేబీ సాప్ట్ స్కిన్ పొందవచ్చు. అదెలాగో చూద్దాం..

తేనె + రోజ్ వాటర్:
బేబీ సాప్ట్ స్కిన్ పొందడానికి ఇది ఒక సులభమైన హోం రెమెడీ. అందుకు మీరు చేయాల్సిందల్లా తేనె మరియు రోజ్ వాటర్ ను ఈక్వెల్ గా (ఒక టీస్పూన్ )తీసుకోవాలి. దీన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే బేబీ సాప్ట్ స్కిన్ పొందవచ్చు.

పెరుగు + అవొకాడో:
స్కిన్ ఎక్సఫ్లోయేట్ కు అవొకాడో మరియు పెరుగు కాంబినేషన్ గ్రేట్ గా సహాయపడుతుంది, . అవొకాడో చర్మానికి మంచి మాయిశ్చరైజర్. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అవొకాడో మరియు పెరుగును సమంగా (1tbsp)తీసుకోవాలి. బాగా మిక్స్ చేసి ముఖానికి మరియు మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటి + పెరుగు + తేనె:
ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది చర్మంను సాప్ట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు పోషణను అందిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా బాగా పండిన అరటి పండును పెరుగు, తేనె వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. లేదా మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. దీన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటి + పాలు:
అరిటికాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో 2 టీస్పూన్ల పాలు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇది మీ చర్మాన్ని స్మూత్ గా చేస్తుంది. . దీన్నిముఖానికి అప్లై చేయడం వల్ల డీప్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఇది బేబీ సాప్ట్ స్కిన్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బొప్పాయి పేస్ట్ : బొప్పాయి పేస్ట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటీన్, విటమిన్ సి మరియు ఇతర ఫైటోన్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. . ఈ న్యూట్రీషియన్స్ స్కిన్ డ్యామేజ్ కలిగించే ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో..ఏజింగ్ ప్రొసెస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . బొప్పాయిని మెత్తగా చేసి దీన్ని నేరుగా ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications