For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగాళాదుంప మరియు గ్రీన్ టీలను ఉపయోగించి తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన మాస్కును గురించి తెలుసుకుందాం!

బంగాళాదుంప మరియు గ్రీన్ టీలను ఉపయోగించి తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన మాస్కును గురించి తెలుసుకుందాం!

|

మీరు మచ్చలేని, స్పష్టమైన చర్మం పొందటం కోసం, మార్కెట్ లో అందుబాటులో వివిధ ఉత్పత్తులను ప్రయోగించి అలసిపోయారా? అయితే ఈ వ్యాసం ఖచ్చితంగా మీ కోసమే. ఈ వ్యాసంలో, స్పష్టమైన చర్మం పొందడం కోసం ఇంట్లో తయారు చేసుకోగలిగే నివారణ గురించి చర్చించబోతున్నాము. ఈ అద్భుతమైన పరిష్కారం ఉపయోగించి ఒక్క రాత్రిలోనే ఉత్తమ ఫలితాలను పొందుతారు.

సూర్యప్రతాపం, కాలుష్యం, వృద్ధాప్యం, అధిక ధూమపానం మరియు మద్యపానం, జీవనశైలిలో మార్పు, హార్మోన్ల అసమతౌల్యం మొదలగు అనేక కారణాల మూలంగా, చర్మం దాని ప్రకాశాన్ని కోల్పోతుంది. ఫలితంగా, వివిధ చర్మ సమస్యలు, నల్ల మచ్చలు, గాయాలు, అసమాన మేనిఛాయ, హైపర్ పిగ్మెంటేషన్ మరియు మొటిమలు వంటి సమస్యలు తలెత్తుతాయి. చర్మం కాంతివిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యలు మరీంత ఎక్కువ కాకుండా నిరోధించడానికి, చర్మానికి సరైన సమయంలో చికిత్సను అందించాలి. అయితే, ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలనేది పెద్ద ప్రశ్నగా మారింది?

 Green Tea And Potato Mask For Clear Skin

బాగా, గృహనివారణలను మించి ప్రభావవంతంగా ఉండే నివారణలు అవి ఉండవు. వీటిని పాటిస్తే డబ్బు ఆదా అవుతుంది. మార్కెట్ ఉత్పత్తులలోని వివిధ రసాయనాల దుష్ప్రభావాలకు కూడా చర్మం లోనుకాదు

కేవలం రెండే రెండు పదార్ధాలను ఉపయోగించి తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన పరిష్కారం గురించి ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాము. ఆ పదార్థాలు ఇంకేమి కాదు, బంగాళాదుంప మరియు గ్రీన్ టీ. ఈ రెండు పదార్థాలు కలిగించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ రెండు పదార్ధాలతో తయారు చేసిన మాస్కును రాత్రిపూట వాడితే మంచి ఫలితాలను ఇస్తుంది.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

1 గ్రీన్ టీ బ్యాగ్

1 చిన్న బంగాళాదుంప

తయారీ విధానం:

తయారీ విధానం:

1. ముందుగా, గ్రీన్ టీని తయారు చేసి కనీసం 10 నిముషాల పాటు చల్లబరచండి.

2. ఇప్పుడు బంగాళాదుంపపై తొక్క తీసి, తురమండి.

3. తురిమిన బంగాళాదుంప నుండి రసంను పిండండి.

4. ఇప్పుడు బంగాళాదుంప రసంలో, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ కలపండి.

5. ముఖం మరియు మెడను శుభ్రపరచుకుని మరియు మీ ముఖానికి రాసుకోండి.

6. పడుకోవడానికి ముందు ఇలా రాసుకుని, రాత్రంతా అలా వదిలేసి, మరుసటి రోజు ఉదయం సాధారణ నీటిలో కడుక్కోవాలి.

గ్రీన్ టీ వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు:

గ్రీన్ టీ వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు:

రోజూ గ్రీన్ టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికి తెలిసినవే. అలాగే, గ్రీన్ టీ పైపూతగా రాసుకుంటే, అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. గ్రీన్ టీ చర్మంను బిగుతుగా మరియు ప్రకాశవంతంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. ఆకుపచ్చ టీలోని యాంటీఆక్సిడెంట్లు, ముడుతలతో, సున్నితమైన గీతలు, వంటి వృద్ధాప్య సంకేతాలతో పోరాటం చేయడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ పిగ్మెంటేషన్, అసమాన మేనిఛాయ, మచ్చలు, ఎండ వలన కమలడం, మొదలైన సమస్యలను నివారిస్తుంది.

బంగాళదుంప వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు:

బంగాళదుంప వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు:

బంగాళదుంప అనేది ప్రతి వంటింట్లో కనిపించే ఒక సాధారణ పదార్ధం. కానీ ఇది చర్మానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో మీకు తెలుసా! బంగాళాదుంపలోని విటమిన్ సి, చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం వలన, వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది. దీనిలోని కేటోకొలేజ్ ఎంజైమ్,చర్మంను కాంతివంతంగా మార్చి, నల్లని మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించి, మచ్చలేని, స్పష్టమైన చర్మాన్ని అందిస్తుంది.

English summary

Green Tea And Potato Mask For Clear Skin

Our skin tends to lose its glow due to several factors like overexposure to sun, pollution, ageing, excess smoking and alcohol consumption, change in lifestyle, hormonal imbalances, etc. As a result, various skin problems like dark spots, blemishes, etc. You can solve this problem using a simple DIY remedy with green tea and potato.
Desktop Bottom Promotion