Latest Updates
-
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా..
Alia Bhatt:RRR హీరోయిన్ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా...
ఆలియా భట్ చర్మ సౌందర్యాన్ని పెంచే రహస్యాలేంటో తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కేయండి.
బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్ అంటేనే పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లోనూ అడుగుపెట్టేసింది. ఏకంగా జక్కన్న తీసే RRR సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా సినిమా బ్యూటీలందరూ అందంగా కనబడేందుకు ఎక్కువగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఆలియా భట్ మాత్రం మేకప్ లేకుండానే మెరిసిపోతూ ఉంటుంది. అంతే కాదు తన చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు.. చర్మ సంరక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట. తను నటిగా తెరంగేట్రం చేసిన నాటి నుండే తనదైన శైలిలో అందంతో.. అభినయంతో ఎంతో మంది అభిమానుల దోచుకుంది ఆలియా. ఆలియా భట్ చాలా చిత్రాల్లో మేకప్ లేకుండా కూడా నటించింది. ఎందుకంటే తను మేకప్ చేయడాన్ని పెద్దగా ఇష్టపడదు. అందుకే మనకు ఎక్కువగా ఎయిర్ పోర్టుల్లో మేకప్ లేకుండా మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ఆలియా భట్ తన స్కిన్ గ్లో కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది.. తను సహజంగా అందంగా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు పాటిస్తుందనే సీక్రెట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

మెరిసె చర్మం కోసం..
అందరు అమ్మాయిలు, సినీ తారల మాదిరిగా ఆలియా భట్ తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు తనదైన ప్రత్యేకమైన ఫేస్ ప్యాక్ వాడుతుందట. సౌందర్యంగా కనిపించేందుకు.. ఇది బాగా సహాయపడుతుందట. తన ఫేస్ ప్యాక్ లో వాడేవన్నీ మనకూ లభిస్తాయి. వాటిని మనం కూడా సహజంగా సిద్ధం చేసుకోవచ్చు.

బాగా కలపాలి..
ముందుగా ఒక టేబుల్ స్పూన్ తేనే, ఒక టేబుల్ స్పూన్ పొప్పడి పండు గుజ్జు. పొప్పడి పండు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ గుజ్జు తీసుకోవాలి. ఇవి లేకపోతే మంచి పౌడర్ కూడా తీసుకోవచ్చు. వీటన్నింటిని ఒక గిన్నెలో వేసుకుని బాగా కలపాలి

15 నిమిషాల పాటు..
అలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ ఫేసుకు అప్లై చేసుకోవాలి. మీ ఫేసుపై 15 నిమిషాల వరకు వదిలేయాలి. అది పొడిగా మారిన తర్వాత మీరు దాన్ని కడుక్కోవాలి. అంతే ఆలియా భట్ వంటి అందమైన చర్మం మీరు సొంతం చేసుకోవచ్చు. అందుకే ఆలియా భట్ అందాన్ని అనుసరించడానికి అందరూ ఇష్టపడతారు.

రాత్రి వేళలో మేకప్ లేకుండా..
ఆలియా భట్ తన అందంతో పాటు తన ఫిగర్ ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ యోగా మరియు జిమ్ చేస్తుంది. అలాగే తను రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేస్తుంది. ఎక్కువగా కెమికల్స్ ప్రాడక్ట్స్ ను వాడదు.

ఎక్కువగా నీరు..
ఆలియా భట్ తరచుగా తన మెరిసే చర్మానికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో పంచుకుంటుంది. తన మెరిసే చర్మ రహస్యం ఏంటంటే.. తను ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగుతుంది. తను రోజు కచ్చితగా ఎనిమిది గ్లాసుల నీరు తాగుతుందట. అందుకే ఆమె ముఖం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీని వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం..
ఆలియా భట్ తన చర్మ సౌందర్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి పచ్చని కూరగాయలు మరియు పండ్లు తింటుంది. తను జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట. యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ కార్యాలయాలలో కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.



Click it and Unblock the Notifications
