Latest Updates
-
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
స్టార్ సిగ్నేచర్ స్టైల్: సంప్రదాయ దుస్తులతో దియా మిర్జా అనుబంధం
మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెల్చుకున్న దియా మిర్జా డిసెంబరు 9,1982 లో జన్మించింది. ఈమె భారతీయ మోడల్, నటి, నిర్మాత కూడా.ఈమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలో నటించింది. దియా సమాజ సేవలో కూడా ముందుంటుంది. తన భర్త సాహిల్ సాగా తో కలిసి స్థాపించిన బార్న్ ఫ్రీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలో ఈమె భాగస్వామి.
ఈ బ్యానర్ ద్వారా తొలి సినిమా అక్టోబరు 7 2011 లో విడుదలయ్యింది.సినిమాల ద్వారా కంటే సమాజ సేవ ద్వారా దియా ఎక్కువ పేరు గడించింది.దియా మిర్జా గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఆమెని వర్ణించాలంటే "సొగసరి" అనే మాట ఆమె కి సరిగ్గా సరిపోతుంది.
దియా లో అందం, హుందాతనం, ఫ్యాషన్ మూర్తీభవిస్తాయి.అవును ఈమె బాలీవుడ్లో ఫ్యాషన్ ప్రియురాలు అనచ్చు.ఈమె అనేక రకాల ఈవెంట్లలో చీరలు, షరారాలు, పంజాబీ డ్రెస్సులు ధరించి ఉండగా అనేకసార్లు ఈమెని ఫొటొల్లో బంధించాము.ఈమె కి సంప్రదాయ దుస్తులంటే మక్కువ కాబోలు.రెడ్ కార్పెట్ ఈవెంటయినా లేక సోషల్ ఈవెంట్లయినా ఈమె భారతీయ సంప్రదాయ దుస్తులలో తళుక్కుమంటుంది.
ఇది ఈమె సిగ్నేచర్ స్టైల్ అనచ్చా??చూస్తుంటే అలాగే ఉంది. కింద దియా మిర్జావి 3 ఫొటోలిచ్చాము. అవి చూస్తే దియా యొక్క సిగ్నేచర్ స్టైల్ సంప్రదాయ దుస్తులు అని ఎందుకన్నామో మీకే తెలుస్తుంది.

1.తమన్నా పంజాబీ కపూర్ డిజైన్ చేసిన సూట్(సల్వార్ సూట్) లో దియా మిర్జా:
ఇండియా కంజ్యూమర్ జ్యువెలరీ షో లో దియా మిర్జా మా కంటికి చిక్కింది. తమన్నా పంజాబీ కపూర్ డిజైన్ చేసిన సూట్(పంజాబీ డ్రెస్స్) లో దియా మిర్జా వెలిగిపోతోంది.అతి తక్కువగా జరీ పనితనంతో ఉన్న ఆ తెలుపు లేత గులాబీ రంగు సూట్ కి పైజమా మడమల దగ్గర వెడల్పుగా ఉండి ఎంబ్రాయిడరీ చేయబడి ఉంది.సల్వార్ మీద మాత్రం మెడ నుండీ కింద వరకూ జరీ పని తనం కనిపిస్తోంది.సల్వార్ కి ఉన్న చైనీస్ కాలర్ ఈమె అందాన్ని మరింత ఇనుమడింపచేసి,దియా ప్రెట్టీ గా ఉంది అనిపించింది.

2.పట్టు దుస్తుల్లో దియా:
దియా మిర్జా సంప్రదాయ దుస్తులెప్పుడు ధరించినా మమ్మల్ని ఆకటుకోకుణ్డా లేదు.నీలం మరియూ పిస్తా ఆకుపచ్చ చీరలో దియా మా మతి పోగొట్టేట్టట్లు ఉంది.ముదురు రంగులో ఉన్న ఈ చీర లో ఈ కుందనపు బొమ్మ మరింత మెరిసిపోతోంది.ఈ లుక్ లో హైలైట్ ఏమిటంటే దియా మిర్జా దానిని క్యారీ చేసిన విధానం.

3.పసుపు రంగు చీరలో దియా:
న్యూ ఢిల్లీ లో సునార్ జ్యువెలరీ లాంచ్ లో దియా పసుపు రంగు చీరలో దర్శనమిచ్చింది. ఆమె చీరె ని ఎంతో సొగసుగా కట్టుకుంది.దియా కి ఉన్న ఫ్యాషన్ సెన్స్ అధ్భుతం అనచ్చు.ఏమి ధరించినా దియా అందంగానే ఉంటుంది.జుట్టు ని పాయలుగా దీసి చిన్న బన్నులా చుట్టి పైన దాని మీద అలంకరించిన గాజ్రా తో తన శిరోజాలంకరణ ని పూర్తి చేసింది.వావ్, దియా సంప్రదాయ దుస్తుల్లో చాలా అందం గా ఉంటుందనడంలో సందేహమే లేదు.
దీనిని బట్టి దియా మిర్జాకి సంప్రదాయ దుస్తులు ధరించడమంటే ఇష్టమనీ, ఈమె వాటిల్లో చాలా అందం గా ఉంటుందనీ చెప్పచ్చు. ఇవి ఆమె సిగ్నేచర్ స్టైల్ కూడా.



Click it and Unblock the Notifications