నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా?

మనందరికీ తెలిసింది, మనం ప్రతిరోజూ చూసేది తెల్లటి పాలు మాత్రమే. కానీ ఎప్పుడైనా నల్ల పాలు(బ్లాక్ మిల్క్) గురించి విన్నారా?. తన ఫిట్‌ నెస్, గ్లామర్ రహస్యాలతో ఎప్పుడూ ఆకట్టుకునే నటి అదా శర్మ, తాను నల్ల పాలు తాగుతున్న ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.

మీకు రోజూ ఒకేలాంటి పాలు తాగడం ఇష్టం లేకపోయినా లేదా ఆరోగ్యపరంగా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకున్నా ఈ బ్లాక్ మిల్క్ అద్భుతమైన ఆప్షన్. ఎందుకంటే ఈ నల్ల పాలు కేవలం మీ ఆరోగ్యానికే కాదు మీ జుట్టుకు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

Adah Sharma Drinks Black Milk Know Secret Health Benefits Glowing Skin and How to Make It at Home

ఈ పాలు ఎందుకు అంత ప్రత్యేకం?

అదా శర్మ స్వయంగా ఈ నల్ల పాల తయారీ విధానాన్ని, దాని అద్భుతమైన ప్రయోజనాలను కూడా వివరించారు. దీనిని ప్రధానంగా నల్ల నువ్వులు, జీడిపప్పులతో తయారు చేస్తారు. ఈ బ్లాక్ మిల్క్‌లో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు, జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మం నిగనిగలాడేలా చేస్తాయి.

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే!బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే!

బ్లాక్ మిల్క్ తయారీ విధానం

ముందుగా ఒక అరకప్పు నల్ల నువ్వులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఈ నువ్వులను వేసి డ్రై రోస్ట్ (పొడిగా) వేయించాలి. నువ్వులు చిటపటలాడటం ప్రారంభించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు అదే పాన్‌ లో 8 నుంచి 10 జీడిపప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. వేయించిన నువ్వులు కాస్త చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌ లో వేసుకోవాలి. అందులోనే వేయించిన జీడిపప్పులు, గింజలు తీసేసిన రెండు ఖర్జూరాలు, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

ఇప్పుడు ఒక పల్చటి కాటన్ వస్త్రాన్ని తీసుకుని, అందులో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి గట్టిగా పిండాలి. ఇలా చేయడం వల్ల స్వచ్ఛమైన, చిక్కటి పాలలాంటి ద్రవం వస్తుంది. దానిని ఒక గ్లాసులో పోసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన నల్ల పాలు రెడీ

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు - ఫేస్ ప్యాక్

పాలు తీయగా మిగిలిన నువ్వులు, జీడిపప్పుల పిప్పిని పడేయకండి. అదా శర్మ ఈ మిశ్రమాన్ని ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్‌ గా ఉపయోగిస్తారు. ఈ పేస్ట్‌ ను ముఖానికి రాసుకుని, పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతులతో సున్నితంగా స్క్రబ్ చేస్తూ కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా, అత్యంత కాంతివంతంగా మెరిసిపోతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion