Latest Updates
-
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్‌లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్‌లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
సన్ స్క్రీన్ ఎంత రాయాలో తెలుసా? చర్మ నిపుణులు చెబుతున్న సీక్రెట్ ఇదే!
ఎండలు మండుతున్నాయి. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి. ఈ ఎండల వల్ల వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు మన చర్మ రక్షణ పొరను దారుణంగా దెబ్బతీస్తాయి. అయితే ఎండను తట్టుకోవడానికి చాలామంది సన్ స్క్రీన్ వాడుతుంటారు. కానీ ముఖానికి ఏదో నామమాత్రంగా కాస్త క్రీమ్ రాసేసి సరిపెట్టుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. అతినీలలోహిత (UV) కిరణాల వల్ల చర్మానికి జరిగే తీవ్రమైన, దీర్ఘకాలిక నష్టాలను అరికట్టడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా సన్ స్క్రీన్ వాడాలని ప్రఖ్యాత ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్ తన తాజా పరిశోధనలో స్పష్టం చేసింది.

అంతర్జాతీయ చర్మ సౌందర్య నిపుణుల పరిశోధనల ప్రకారం.. చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ ను సరైన మోతాదులో, ప్రతిరోజూ వాడటం అత్యంత ఆవశ్యకం. మరి సన్ స్క్రీన్ ను ఎంత వాడాలి? ఎలా వాడాలి? ఇక్కడే రెండు వేళ్ల నియమం(Two Finger Rule) తెరపైకి వస్తుంది.
రెండు వేళ్ల నియమం అంటే ఏమిటి?
ఇది చాలా సులభమైన పద్ధతి. మీ చూపుడు వేలు, మధ్య వేలు పొడవునా సన్ స్క్రీన్ ను పిండి తీసుకోండి. ఈ మోతాదు మీ ముఖం, మెడకు సరిగ్గా సరిపోతుంది. చాలామంది ముఖానికి రాసుకుని మెడను మర్చిపోతారు. దీనివల్ల చర్మంపై మచ్చలు రావడం, ఎండకు ముఖం ఒక రంగులో, మెడ మరొక రంగులో (సన్ టాన్) మారిపోవడం జరుగుతుంది. అందుకే ముఖంతో పాటు మెడకు కూడా రాయడం తప్పనిసరి. క్రీమ్, లోషన్ లేదా జెల్.. మీరు ఏది వాడినా ఈ నియమం వర్తిస్తుంది.
ఈ రూల్ ఎందుకు అంత ముఖ్యం?
భారతీయుల చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉన్నప్పటికీ, సూర్యకిరణాల వల్ల జరిగే డీఎన్ఏ, కణాల నష్టాన్ని అరికట్టాలంటే సరైన మోతాదులో సన్ స్క్రీన్ వాడాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత క్రీమ్ రాయకపోతే.. వడదెబ్బ, టానింగ్, చిన్న వయసులోనే ముడతలు రావడం, చర్మ క్యాన్సర్ వంటి ముప్పు పొంచి ఉంటుంది.

సరైన విధానంలో ఎలా అప్లై చేయాలి?
ఎండలోకి వెళ్లడానికి 15-20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ రాసుకోవాలి.
చర్మం శుభ్రంగా, పొడిగా ఉన్నప్పుడు మాత్రమే దీనిని రాయాలి. అప్పుడే చర్మ రంధ్రాలు క్రీమ్ ను పీల్చుకుంటాయి.
ముఖం, మెడ, చెవుల ముందు, వెనుక భాగాలను కూడా కవర్ చేయాలి.
ఎండలో తిరిగే పనైతే.. ప్రతి 2-3 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ ను మళ్లీ రాసుకోవాలి.
డెర్మటాలజిస్ట్ లు చెబుతున్న దాని ప్రకారం..ప్రతి చదరపు సెంటీమీటరు చర్మానికి 1.6 నుండి 1.8 మిల్లీగ్రాముల సన్ స్క్రీన్ కరెక్ట్ మోతాదు. అంటే ముఖానికి కచ్చితంగా రెండు వేళ్ల నిండా క్రీమ్ తీసుకోవాలి.
మనం చేసే సాధారణ తప్పులు ఇవే
-నామమాత్రంగా చాలా తక్కువ క్రీమ్ వాడటం.
-ఒకసారి రాసేసి, రోజంతా మళ్లీ రాసుకోకపోవడం.
-ఎండకు నేరుగా కనిపించే చెవులు, మెడ, చేతులను వదిలేయడం.
-సన్ స్క్రీన్ ను, మాయిశ్చరైజర్ ను కలిపి రాయడం (దీనివల్ల సన్‌స్క్రీన్ ప్రభావం తగ్గుతుంది. ముందు మాయిశ్చరైజర్ రాశాకే, సన్ స్క్రీన్ వాడాలి).
-మేకప్ ఉత్పత్తుల్లో ఉండే SPF సరిపోతుందని భ్రమపడటం. (ముఖంపై ఉండే నూనెల వల్ల మేకప్ కవరేజ్ కొంతసేపటికి కరిగిపోతుంది).
ఎవరు మరింత జాగ్రత్తగా ఉండాలి? ఏ SPF ఎంచుకోవాలి?
-సున్నితమైన చర్మం, మొటిమలు, మచ్చలు ఉన్నవారు, అలాగే రోజంతా బయట పనిచేసేవారు లేదా ప్రయాణించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
-భారతీయ వాతావరణానికి కనీసం SPF 30 నుండి 50 ఉండే బ్రాడ్ స్పెక్ట్రమ్ (UVA, UVB రక్షణ ఇచ్చే) సన్ స్క్రీన్ సరైనది. ఎక్కువసేపు ఇంట్లో ఉండేవారు కూడా దీనిని వాడటం మంచిది, ఎందుకంటే కిటికీల గుండా కూడా కిరణాలు చొచ్చుకువస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications