Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
చాక్లెట్స్ అంటే ఇష్టపడని పిల్లలుండరు. ప్రతి రోజూ ఎన్ని ఇచ్చినా తింటూనే ఉంటారు. కానీ అన్నం విషయంలో మారాం చేస్తుంటారు. పిల్లలు ఏడ్చినా, పుట్టినరోజు వేడుకలున్నా, వారిని సంతోషపెట్టడానికి చాక్లెట్లు ఇస్తుంటారు. కానీ ఇది వారికి ఎంతటి హాని కలిగిస్తుందో మీకు తెలుసా.? వీటిని తింటే వారికి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పీడియాట్రిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, దంతక్షయంతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పిల్లలకు చిన్న వయసులో అధిక చక్కెర ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వొద్దని ప్రపంచ ఆరోగ్య సైతం- WHO హెచ్చరిస్తోంది. ముఖ్యంగా పిల్లల దంతాలపై ఎనామిల్ పొరను దెబ్బను తీసి పళ్లు పుచ్చిపోవడానికి దారితీస్తుంది.
మీ పిల్లలు రోజులో 3 నుంచి 4 చాక్లెట్స్‌కి మించి తినడం ద్వారా అది వారి ఆకలిపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. చాక్లెట్స్‌తో ఆకలి లేమి కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలను తక్కువగా తీసుకుంటారు. దీంతో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ శాతం వారి శరీరంలో తగ్గిపోతుంది.
చిన్న వయసులోనే కెఫీన్ ప్రభావం
చాలా వరకు కొన్ని చాక్లెట్లలో కెఫీన్, థియోబ్రోమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పిల్లలు రోజులో పరిమితికి మించి తీసుకోవడం ద్వారా వారిలో హైపర్ యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. ఇంకా నిద్ర లేమికి దారితీస్తుంది. అతి ఉత్సాహంతో ఇంట్లో వారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. వీటిలో అధిక కేలరీలు ఉన్న కారణంగా అకారణంగా బరువు పెరుగుతారు. జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక ఊబకాయం సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దంతాలు పుచ్చిపోయే ప్రమాదం
చాక్లెట్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా దంతాలపై ఉండే మంచి బ్యాక్టీరియా.. చక్కెరను ఆమ్లంగా మారుస్తుంది. దీంతో క్రమంగా ఎనామెల్ పొర అరిగిపోయి పురుగులు ఏర్పడి పళ్లు పుచ్చిపోవడానికి దారితీస్తుంది. అందుకే చాక్లెట్ తిన్న వెంటనే నోరు పుక్కిలించాలి. బ్రష్ చేసుకోవాలి. లేదంటే దంతక్షయం ఏర్పడుతుంది. పళ్లపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వేడి, చల్లగా ఉండే ఆహార పదార్థాలను తినలేరు. పళ్ల నొప్పి ఏర్పడుతుంది.

ఊబకాయం, నిద్ర లేమి
మిల్క్ చాక్లెట్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉండే కారణంగా శారీరకంగా చురుకుదనం కోల్పోతారు. అదనపు కేలరీలు శరీరంలో ఎక్కువై బరుగు పెరుగుతారు. దీంతో చిన్న వయసులోనే ఊబకాయం ఏర్పడి.. టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఫ్యాటీ లివర్ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడవచ్చు.
అయితే ఈ ప్రమాదాల బారి నుంచి కాపాడుకునేందుకు పూర్తిగా చాల్కెట్లు మానేయడం అవసరం లేదని పీడియాట్రిక్ నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవచ్చు. అప్పుడప్పుడూ మితంగా తీసుకోవడం సురక్షితమే అని చెబుతున్నారు.
ప్యాక్‌డ్ ఫుడ్
చాక్లెట్లతో పాటు ప్యాక్‌డ్ ఫుడ్ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి ప్యాక్‌డ్ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అది వారి పళ్లకు అంటుకుంటుంది. చాలా వరకు పిల్లలు జంక్ ఫుడ్ తిన్న తర్వాత నీళ్లు తాగడం కాగనీ పుక్కిలించడం కానీ చేయరు. దీని వల్ల అది వారి పళ్లకి అంటుకుని పళ్ల సమస్యలకు దారితీస్తుంది. వీటికి బదులుగా పిల్లలకు పోషకాలు పుష్కలంగా ఉండే అన్నం, పప్పు, చపాతీ, కూరగాయలు, పెరుగు వంటి ఆహార పదార్థాలను భోజనంలో చేర్చాలని సూచిస్తున్నారు. దంత సమస్యల బారి నుంచి కాపాడుకునేందుకు ఉదయం, రాత్రి పళ్లు తోముకునే అలవాటు చేయాలని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
