Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
అసలే వర్షాకాలం.. లొట్టలేసుకుని పానీపూరి తింటే రోగాలు తప్పవు!
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పానీపూరి అంటే లొట్టలేసుకుంటారు. సాయంత్రం అలా బయటకు వెళ్లి ఇంటిల్లిపాది వెళ్లి మరీ గప్‌చుప్‌ను ఆస్వాదిస్తుంటారు. పానీపూరికి సీజన్ తో సంబంధం లేదు. ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అనే సంబంధం లేకుండా పానీపూరి కోసం ఎగబడతారు. చల్లని చినుకులు పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తినాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే వానాకాలంలో ఆహార పదార్థాలు కలుషితం అయ్యే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

స్ట్రీట్ ఫుడ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం కలుషితానికి గురైన ఆహారం తిన్నా రోగాలు చుట్టు ముడతాయి. ముఖ్యంగా పానీపూరిల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు.
పానీపూరి బండ్ల చుట్టూ అపరిశుభ్రత:
వర్షాకాలంలో చాలా చోట్ల నీరు నిండిపోతుంది. ఇది బ్యాక్టీరియా, దోమలు, ఇతర క్రిమికీటకాలు అభివృద్ధి చెందడానికి ఆవాసంలా మారతాయి. ఇవి చాలా రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. విష జ్వరాలు, జలుబు, దగ్గు, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలను తీసుకువస్తాయి. పానీపూరి బండ్ల నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ. చాలా వరకు పానీపూరి బండ్లు రోడ్లు, మురికి కాల్వల పక్కన అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంటాయి. అలాంటి చోట్ల పరిసరాలు కలుషితమై.. ఆహారంపై బ్యాక్టీరియా, క్రిములు చేరే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి:
మురికి, అపరిశుభ్రత, కలుషితమైన ప్రాంతాల్లో పానీపూరి తినడం వల్ల టైఫాయిడ్, లూజ్ మోషన్, డయేరియా వంటి పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. అలాగే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది కేవలం పానీపూరిలకు మాత్రమే వర్తించదు. అన్ని రకాల వీధి ఆహారాలు, పరిశుభ్రత పాటించని హోటళ్లలోని ఆహారాల వల్ల కూడా ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే వర్షాకాలంలో వీలైనంత మేరకు బయటి ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
ఇంటి ఆహారమే శ్రేష్టమైనది:
అపరిశుభ్ర వాతావరణం, ముఖ్యంగా వర్షాకాలంలో శుభ్రంగా ఉన్న పానీపూరి స్టాల్స్ వద్దకే వెళ్లాలి. అక్కడ ఏమాత్రం కలుషితం కాలేదని నిర్ధారించుకున్నాకే తినాలి. పరిశుభ్రత పాటించని చోట్ల ఆహారం తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బయటి ఆహారంతో పోలిస్తే ఇంట్లో చేసిన ఆహారం అంతగా రుచిగా అనిపించకపోవచ్చు. బయట తిన్నంత మజా కూడా రాకపోవచ్చు. కానీ రుచి కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ మెరుగుపరచుకోవడానికి మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
