గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్‌.. మీ భోజనంలో తప్పనిసరి.!

హెల్తీ లైఫ్‌ స్టైల్‌ కోసం ప్రతిరోజూ ఆహారంలో పండ్లు చేర్చుకోవడం చాలా అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా సీజనల్‌ పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవడం ముఖ్యం. ఎందుకంటే వీటిలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతిరోజూ దొరికే పండ్లు ఉంటాయి. అందులో ఒక పండును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ పండు ఏంటి.? నిపుణుల సలహాలు చూద్దాం..

Bananas protect heart health and maintain digestive health

సీజన్‌ ఏదైనా మార్కెట్‌లో ప్రతిరోజూ దొరికే ఫ్రూట్‌ అరటిపండు. ఈ పండు ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. ఎందుకంటే అరటిపండ్లలో సహజ చక్కెర, ఫైబర్‌, పొటాషియం, ఇంకా అనేక ముఖ్యమైన విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంతో పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు.

మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!

అరటిపండ్లు ఎందుకు తినాలి..

ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు అరటిపండ్లు తినడం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగించడంతో పాటు ఆకలి కోరికలను అదుపులో ఉంచి బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి కూడా దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్‌, యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్‌ను బలపరుస్తాయి.

సులభంగా జీర్ణం..

Bananas protect heart health and maintain digestive health

అరటిపండు ద్వారా ఫైబర్‌ పుష్కలంగా లభించడంతో మెరుగైన జీర్ణక్రియకు సహకరిస్తుంది. శరీరానికి తగినంత మోతాదులో పీచు పదార్థం లభించడం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అరటిపండ్లు సులభంగా జీర్ణం కావడంతో పొట్టకి తేలికగా ఉంటుంది.

అయితే అరటిపండ్లు తినడం ద్వారా ప్రతి వ్యక్తి శరీరం ఒకేలా స్పందించాలని ఉండదు. పండ్లు తిన్న తర్వాత మీకు గ్యాస్‌, కడుపు ఉబ్బరం, ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటే ఆహారంలో చేర్చుకునే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

అరటితో గుండె ఆరోగ్యం..

గుండె క్రమబద్ధంగా హెల్తీగా పనిచేసేందుకు పొటాషియం అవసరం. అరటిపండ్లు పొటాషియం సరైన మోతాదులో లభిస్తుంది. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వైద్యుల సలహా మేరకు భోజనంలో బ్యాలెన్స్‌డ్‌గా అరటిపండ్లను తీసుకోవాలి.

కొత్తగా తల్లయిన వారికి అలర్ట్‌.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!కొత్తగా తల్లయిన వారికి అలర్ట్‌.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!

అయితే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు దీర్ఘకాలం పాటు నియంత్రణలో లేకుండా ఉంటే గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీపీ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవడానికి సరైన, సమతుల్య ఆహారం, రెగ్యులర్‌గా వ్యాయామం, డాక్టర్ల సలహాను పాటించాలి.

మెంటల్‌ హెల్త్‌

అరటిపండ్లలోని ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం జీవక్రియను మెరుగుపరిచి మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్లు, ఇతర పోషకాలు ఎనర్జీ లెవెల్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తాయి. అయితే ఈ పండ్లు నేరుగా ఒత్తిడి, నిరాశను తగ్గిస్తాయని అనుకోవద్దు. మానసిక సమస్యకి నిద్ర, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, విశ్రాంతి లేకపోవడం కారణాలు కావచ్చు. వీటిని సమతుల్యం చేసుకుంటూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, September 5, 2026, 10:53 [IST]
Desktop Bottom Promotion