Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కండోమ్స్ వాడకపోతేనే కాదు..ఇలా కూడా HIV సోకుతుంది!
హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ ఈ పదాలు వింటేనే చాలామందికి భయం వేస్తుంది. ఒక్కసారి ఎయిడ్స్ లేదా హెచ్ ఐవీ వస్తే ఇక ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అని డిసైడ్ అయిపోతారు. దీనికి కారణం హెచ్ఐవీని 100 శాతం నాశనం చేసే వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడమే. హెచ్ ఐవీ (HIV) అంటే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్. ఈ వైరస్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు, శరీరం ఇతర వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటం కష్టమవుతుంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే, హెచ్‌ఐవీ కాలక్రమేణా ఎయిడ్స్ (AIDS)గా మారవచ్చు.
హెచ్‌ఐవీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎయిడ్స్ ఉండదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, హెచ్‌ఐవీ ఉన్నవారు కూడా సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. సాధారణంగా చాలామంది కండోమ్ లు వాడకుండా, అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని అనుకుంటారు. ఇది నిజమే అయినప్పటికీ వేరే ఇతర కారణాల వల్ల కూడా ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తెలిసోతెలియకో మనం చేసే కొన్ని పనుల కొన్ని తెలియని పద్ధతుల వల్ల మనకు హెచ్ఐవీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. HIV అసురక్షిత శారీరక సంబంధం ద్వారా మాత్రమే కాకుండా..సోకిన రక్తం, సోకిన ఇంజెక్షన్లు, వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం ద్వారా కూడా సంక్రమిస్తుంది. కాబట్టి దాని ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడం, సంక్రమణ నుండి సురక్షితంగా ఉండటానికి పూర్తిగా అవగాహన కలిగి ఉండటం అవసరం.

HIV సంక్రమణకు ఇతర కారణాలు
-రక్త మార్పిడికి ముందు HIV పరీక్ష చేయకపోతే వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
-మెడిసిన్స్ వాడేవాళ్లు లేదా ఒక వ్యాధికి తరచుగా మెడిసిన్ ఇంజెక్ట్ చేసే వ్యక్తులు ఒకే సూదులను పంచుకుంటే HIV వేగంగా వ్యాపిస్తుంది. ఒకే సూదిని చాలా మంది ఉపయోగించడం ద్వారా హెచ్ ఐవీ వచ్చే ఛాన్స్ ఉంటుంది
-రేజర్లు, టూత్ బ్రష్ లు లేదా బ్లేడ్ లు వంటి వస్తువులను ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఉపయోగిస్తే, వాటిపై రక్తం ఉంటే..ఇతరులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
-హెచ్‌ఐవీ ఉన్న తల్లి నుండి గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో లేదా తల్లిపాలు ఇచ్చేటప్పుడు శిశువుకు వ్యాపించవచ్చు.
HIV లక్షణాలు
హెచ్ ఐవీ సోకిన తర్వాత, ప్రారంభ దశలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అందుకే చాలామంది వీటిని గుర్తించలేరు.
-జ్వరం
-తలనొప్పి
-గొంతు నొప్పి
-శరీర నొప్పులు
-లింఫ్ నోడ్స్ వాపు (మెడ, చంకలు లేదా గజ్జలలో)
-బరువు తగ్గడం
-అలసట
HIV పాజిటివ్ ఉన్నోళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-రేజర్లు, బ్లేడ్లు, టూత్ బ్రష్లు మొదలైన వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు.
-వ్యాధి సోకిన వ్యక్తి ఎప్పుడూ రక్తదానం చేయకూడదు.
-ఎల్లప్పుడూ సురక్షితమైన శృంగారాన్ని ఆచరించండి, కండోమ్స్ వాడండి.
-మీ డాక్టర్ సూచించిన విధంగా క్రమం తప్పకుండా యాంటీరెట్రోవైరల్ థెరపీ తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications