Latest Updates
-
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
మధుమేహానికి బ్రహ్మాస్త్రం, వడదెబ్బకు చెక్..వేసవిలో కాకరకాయ చేసే అద్భుతాలు ఇవే..
మండుతున్న ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత..సమ్మర్ రాకతోనే మన శరీరంలోని సత్తువ మొత్తం ఆవిరైపోతుంది. నీరసం, అలసట, జీర్ణ సమస్యలు, బ్లడ్ లో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగడం వంటి అనేక ఇబ్బందులు చుట్టుముడతాయి. బయట తీవ్రమైన సూర్యరశ్మి మన శక్తిని హరించివేస్తూ, నిస్సత్తువకు గురిచేస్తుంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అత్యంత ఆవశ్యకం. వేసవి తాపాన్ని జయించి, రోగాల బారి నుండి మనల్ని రక్షించే ఒక అద్భుతమైన సహజసిద్ధమైన వరం మనకు ప్రకృతి ప్రసాదించింది.. అదే కాకరకాయ.

పోషకాల గని.. ఈ కాకరకాయ
ఆయుర్వేదంతో పాటు ఆధునిక వైద్య శాస్త్రం కూడా కాకరకాయను ఒక సంజీవనిలా పరిగణిస్తుంది. భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..కాకరకాయలో విటమిన్-A విటమిన్-B, విటమిన్-C లతో పాటు బీటా కెరోటిన్, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఎన్నో కీలకమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ వేసవిలో శరీరాన్ని లోపలి నుండి దృఢంగా మార్చి, ఎండల వల్ల వచ్చే అసౌకర్యాలను మాయం చేస్తాయి.
ఎండాకాలంలో కాకరకాయ చేసే అద్భుతాలు ఇవే
శరీరానికి ఏసీ లాంటి చల్లదనం: వేసవిలో కాకరకాయ అందించే అతిపెద్ద వరం చల్లదనం. ఇది శరీరంలోని అధిక వేడిని లాగేసి, వడదెబ్బ తగలకుండా ఉపశమనం ఇస్తుంది.
డీహైడ్రేషన్ కు చెక్: ఎండల వల్ల వచ్చే డీహైడ్రేషన్ ను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచి, రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.
షుగర్ కి బ్రహ్మాస్త్రం: వేసవిలో ఆహార నియమాలు తప్పినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. కాకరకాయలోని చారంటిన్, పాలిపెప్టైడ్-పి అనే అద్భుత సమ్మేళనాలు రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కచ్చితంగా అదుపులో ఉంచుతాయి. షుగర్ పేషెంట్లకు కాకరకాయ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే గొప్ప ప్రయోజనం ఉంటుంది.
మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో తరచుగా వేధించే అజీర్తి, గ్యాస్, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలను తరిమికొట్టడంలో కాకరకాయ దిట్ట. ఇది కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, జీర్ణ వ్యవస్థను గాడిలో పెడుతుంది.
కాకరకాయలోని విటమిన్-సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఇమ్యూనిటీని అమాంతం పెంచుతాయి. వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.
-రక్తాన్ని శుభ్రపరచడంలోనూ, మెటబాలిజం రేటును పెంచి శరీర బరువును నియంత్రించడంలోనూ కాకరకాయ అమోఘంగా పనిచేస్తుంది.
కాకరకాయను ఎలా తీసుకోవాలి?
ఉదయాన్నే పరగడుపున చిన్న గ్లాసు కాకరకాయ రసం తాగితే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. పచ్చి జ్యూస్ తాగలేము అనుకునేవారు రుచికరమైన కూరగానో, లేదా కొద్దిగా నూనెలో ఫ్రై గానో వండుకుని తినవచ్చు. మీకు ఏదైనా నిర్దిష్ట అలర్జీలు ఉన్నా, లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా దీనిని రోజూ తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
