రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

యాలకలు..ప్రతి వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం. స్వీట్లు, వంటలు, టీ తయారీలో కూడా సువాసన కోసం యాలకలను మనం సాధారణంగా ఉపయోగిస్తుంటాం. కొంతమంది అయితే భోజనం తర్వాత నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి మౌత్ ఫ్రెషనర్‌ గా కూడా యాలకలను వాడుతుంటారు.

అయితే, చూడటానికి ఎంతో చిన్నగా, ముద్దుగా కనిపించే ఈ ఆకుపచ్చని యాలకుల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాల గురించి, వాటిని రోజుకు ఎంత తినాలో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ సలీం జైదీ తన యూట్యూబ్ ఛానెల్‌ లో వివరంగా చెప్పారు.

Chewing 2 Cardamoms After Meals Here is What Happens to Your Body in Just 15 Days

పోషకాల గని..
యాలకులను కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, వాటిలో పుష్కలంగా ఉండే పోషకాల కోసం తప్పక తినాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు మన శరీరానికి అత్యంత అవసరమైన క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి కీలక మినరల్స్ నిండి ఉన్నాయి. అంతేకాదు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, బి కాంప్లెక్స్ కూడా ఇందులో మెండుగా లభిస్తాయి.

యాలకులు ప్రతిరోజూ తింటే ఏమవుతుంది

జీర్ణ సమస్యలకు చెక్

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గ్యాస్, ఎసిడిటీ అనేది సర్వసాధారణం. ప్రతిరోజూ రెండు పచ్చి యాలకులను నమిలి తినడం వల్ల జీర్ణశయాశయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన నూనెలు కడుపులో జీర్ణ ఎంజైమ్‌ ల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. తద్వారా అజీర్తి, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నోటి దుర్వాసనకు చెక్

యాలకుల్లో అద్భుతమైన యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేస్తాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటమే కాకుండా దంత క్షయాన్ని కూడా నివారిస్తాయి. ఇదొక న్యాచురల్ మౌత్ వాష్ లాగా పనిచేస్తుంది.

డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్? డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్?

తక్షణ శక్తి

మధ్యాహ్నం కడుపునిండా భోజనం చేశాక నిద్రమత్తుగా, బద్ధకంగా అనిపించడం సహజం. అలాంటి సమయంలో యాలకులు నమలడం వల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఉత్తేజపరిచి, ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. దీనివల్ల శరీరం అలసిపోకుండా రోజంతా ఎనర్జిటిక్ గా, యాక్టివ్‌ గా ఉంటారు.

గుండె ఆరోగ్యానికి దివ్యౌషధం

యాలకల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మూత్రవిసర్జన లక్షణాలు రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరిగి, అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

ఎలా తినాలి? రోజుకు ఎంత తినాలి?

డాక్టర్ సలీం చెబుతున్న ప్రకారం.. అద్భుతమైన ఫలితాల కోసం కనీసం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజూ రెండు యాలకులను తీసుకోవాలి. భోజనం చేసిన పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత వీటిని బాగా నమిలి మింగాలి. అలా కుదరని వారు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవచ్చు. ఇలా రాత్రి పూట తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది, అలాగే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, August 21, 2026, 6:36 [IST]
q
Desktop Bottom Promotion