Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
షుగర్ వ్యాధి రోగుల ఆహారాలు ఎలా ఉండాలి?

షుగర్ - సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తులైనప్పటికి షుగర్ ను తగు మాత్రంగానే తినాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు పూర్తిగా మానివేయాలి. షుగర్ లోని సర్కోస్ లో గ్లూకోజ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్ ఉంటేనే శరీర కణాలలోకి ప్రవేశించగలదు. షుగర్ వ్యాధి కల వారిలో ఇన్సులిన్ తక్కువగాను లేదంటే, అది ఉన్నప్పటికి పని చేయనిదిగాను ఉంటుంది. కనుక షుగర్ లో మనం తిన్న గ్లూకోజ్ శరీర కణాలకు చేరక రక్తంలోనే ఉండిపోతుంది. ఈ రకంగా షుగర్ రక్తంలో నిల్వ ఉంటే, వ్యాధి తీవ్రమైతే, అవయవాలను సైతం తొలగించవలసి వస్తుంది.
పీచు పదార్ధాలు - పీచు అధికంగా ఉండే ఆహారాలు బ్లడ్ షుగర్, కొలెస్టరాల్ స్ధాయిలను తగ్గిస్తాయి. కనుక షుగర్ వ్యాధి రోగులు, గింజ ఆహారాలు అంటే శనగ, జొన్న, వంటి అధిక పీచుకల ఆహారాలు తినాలి. మైదా, సూజి రవ్వ, నూడుల్స్, పస్తా వంటివి మానాలి. ఇవి తినాలనుకుంటే వాటితోపాటు, తాజా కూరలు, లేదా మొలకెత్తిన విత్తనాలు తినాలి. పీచు అధికంగా ఉండే పండ్లు ఆహారంలో చేర్చండి.మామిడి, ద్రాక్ష, అరటి పండు వంటి వాటిలో షుగర్ అధికం కనుక తగుమాత్రంగానే తినాలి. అంతేకాని వాటిని పూర్తిగా మానాల్సిన పని లేదు.
పాలు - పాలలో సరైన పాళ్ళలో కార్బోహైడ్రేట్లు మరియు ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మీలోని బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రించేందుకు సహకరిస్తాయి. షుగర్ వ్యాధి రోగులు ప్రతిరోజూ రెండు సార్లు పాలు తాగటం మంచిదిగా చెప్పవచ్చు. అయితే, ఇతర పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ, కాటీజ్ ఛీజ్ వంటివి కూడా తగుమాత్రంగా పాలకు బదులుగా తినవచ్చు. అయితే, పాలు పూర్తిగా కొవ్వు తీసిన పాలుగా ఉండాలి. కొవ్వు కల పాలు తాగితే అదనపు కేలరీలు చేరి బరువు ఎక్కే ప్రమాదం ఉంది.
పండ్లు - పీచు అధికంగా ఉండే, బొప్పాయి, యాపిల్, రేగుపండు, ఆరెంజ్, జామపండు వంటివి షుగర్ రోగులు తినవచ్చు. మామిడి పండు, అరటిపండు, ద్రాక్ష వంటివాటిలో షుగర్ అధికం కనుక వాటిని తగుమాత్రంగానే తినాలి. పండ్లలో ఉండే ఫ్రక్టోస్ రక్తంలోని షుగర్ స్ధాయిలను వెంటనే పెంచదు కనుక డయాబెటిక్ రోగులు వీటిని తగుమాత్రంగా తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications