Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి!
మన దైనందిన జీవితంలో ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఆ నిర్ణయాలన్నీ పూర్తిగా మన ఆలోచనల ప్రకారమే జరుగుతున్నాయా? లేదా మనకు తెలియకుండానే ఇతరుల ప్రభావానికి లోనవుతున్నామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మన చుట్టూ ఉంటూ, మన ఆలోచనా సామర్థ్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే మానిప్యులేటర్లు ఎప్పుడూ ఉంటారని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పైకి ఎంతో మంచివారిలా కనిపించే వీరు, తమ మాటలతో మనల్ని తప్పుదారి పట్టిస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించడం అంత తేలిక కాదు. భవిష్యత్తులో మోసపోకుండా ఉండాలంటే చిన్న వయస్సు నుండే పిల్లలకు కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీ జీవితాన్ని నియంత్రించే ఆ మానిప్యులేటర్లను ఎలా గుర్తించాలో ఇక్కడ చూడండి.
ఎప్పుడూ అనవసరపు హడావుడి చేసేవారు
ఆఫీసులో, కాలేజీలో లేదా ఇరుగుపొరుగున కొందరు ఎప్పుడూ ఏదో కొంప మునిగిపోతున్నట్లు హడావుడి చేస్తుంటారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే ప్రపంచం ఆగిపోతుందన్నట్లుగా ప్రవర్తిస్తారు. మీరు గనక ఇలాంటి వారితో ఎక్కువ సమయం గడిపితే వారి ఆత్రుత మీకూ అంటుకుంటుంది. మీ మనసులో తెలియని భయం, ఒత్తిడి మొదలవుతాయి. ఏ చిన్న పొరపాటు చేసినా జీవితంలో వెనుకబడిపోతామనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలాంటి ఒత్తిడిని పెంచే వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండటమే మీ మానసిక ఆరోగ్యానికి మంచిది.
కారణం లేకుండానే ఆకాశానికి ఎత్తేస్తున్నారా?
కొందరు వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండానే మిమ్మల్ని మితిమీరి పొగుడుతూ ఉంటారు. తీయని మాటలతో మీ మనసు గెలుచుకుంటారు. దీని వల్ల మీకు తెలియకుండానే వారి పట్ల మీకు ఒక గొప్ప అభిప్రాయం ఏర్పడుతుంది. సరిగ్గా అప్పుడే వారు తమ అసలు రంగు బయటపెడతారు. తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకోవడం మొదలుపెడతారు. ఆ సమయంలో మొహమాటం కొద్దీ మీరు వారిని కాదనలేరు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అకారణంగా, మోతాదుకు మించి పొగుడుతుంటే కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం.
నిర్భయంగా నో అని చెప్పడం నేర్చుకోండి
ఎదుటివారు ఎక్కడ బాధపడతారో అన్న మొహమాటంతో చాలాసార్లు మనం కాదు లేదా నో అని చెప్పలేకపోతాం. దీనివల్ల మనల్ని మనమే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటాం. ఒకవేళ ధైర్యం చేసి నో అని చెప్పినా, ఆ తర్వాత పదే పదే క్షమాపణలు అడుగుతాం. సరిగ్గా మీలోని ఈ అపరాధ భావననే మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు వారి అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు వారు మిమ్మల్ని తప్పుబట్టి, మీలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచేలా చేస్తే.. నిస్సందేహంగా మీరు ఒక మానిప్యులేటర్ చేతిలో బందీ అయినట్లే.
మాటలతో కించపరిచే వారు
మోసగాళ్లు కేవలం తీయగానే మాట్లాడరు, అవసరమైతే తమ మాటలతో మనల్ని తీవ్రంగా అవమానిస్తారు. చాలాసార్లు మనం వారిని సంతోషపెట్టడానికి, వారి మెప్పు పొందడానికి మనకు ఇష్టం లేకపోయినా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, మిమ్మల్ని చులకనగా చూసే వ్యక్తి మీకు ఎప్పటికీ సరైన విలువ ఇవ్వలేడని మీరు గ్రహించాలి. అలాంటి వ్యక్తి మీకు నిజమైన ఫ్రెండ్ గా గానీ, శ్రేయోభిలాషిగా గానీ ఎన్నటికీ ఉండలేడు.



Click it and Unblock the Notifications
