Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్.. ఇది కేవలం నినాదం కాదు సీఎం నారా చంద్రబాబు నాయుడి దార్శనికత. ఈ లక్ష్య సాధన దిశగా రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఆరోగ్య విప్లవానికి శ్రీకారం చుట్టారు. అదే యోగాంధ్ర. ఒకప్పుడు కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన యోగా సాధన, నేడు కూటమి ప్రభుత్వ కృషితో మారుమూల పల్లెలకు సైతం విస్తరించింది. ఏకంగా 1.07 కోట్ల మందితో ఏకకాలంలో యోగాసనాలు వేయించి ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్రను లిఖించింది.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈ అపూర్వ ఘట్టానికి ప్రధాన వేదికైంది. ఇవాళ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వేదికపై ముప్పావు గంట పాటు చేసిన యోగాసనాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు అత్యంత సంక్లిష్టమైన ఆసనాలను సైతం సునాయాసంగా వేసి యువతకే సవాల్ విసిరారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం రాందేవ్ బాబా సూచనలతో అనులోమ, విలోమ ప్రాణాయామాలు చేశారు. పవిత్రమైన వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామ స్మరణల నేపథ్య గానంతో సాగిన ఈ యోగా సాధన కార్యక్రమానికి ఒక ఆధ్యాత్మిక, ప్రశాంత శోభను అద్దింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం లేదు. ప్రతిరోజూ గంట యోగా, ధ్యానం చేస్తే హాస్పిటల్స్ గడప తొక్కాల్సిన అవసరమే రాదు. నేను 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నాను, ఒత్తిళ్లను జయించడానికి ఇదే నా రహస్యం అని చంద్రబాబు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ పెంచేది యోగానే. జంక్ ఫుడ్ కు దూరంగా ఉందాం, రసాయన రహిత ఆహారాన్ని తీసుకుందాం అంటూ ప్రాంగణంలోని ఔత్సాహికులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.
యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్‌దేవ్ బాబా కృషి అమోఘమని ప్రశంసించారు. సాంకేతికత, ఆధ్యాత్మికత కాంబినేషన్‌తో వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

భవిష్యత్తుకు భరోసా - యోగాంధ్ర 2026
యోగాను జీవనశైలిగా మార్చేందుకు ప్రభుత్వం విశేష ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న స్వర్ణ గ్రామ,వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15న రాబోతున్న సంజీవని ప్రాజెక్టులో యోగాను అంతర్భాగం చేస్తామని, రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను, నిపుణుల బృందాన్ని నియమించనున్నారు.
రికార్డు స్థాయి భాగస్వామ్యం
యోగాంధ్ర- 2026 పేరుతో రెండు వారాల పాటు సాగిన ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఏకంగా 1.07 లక్షల 41 వేల మంది పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.33 లక్షల వేదికలు పాఠశాలలు, పార్కులు, సముద్ర తీరాలు తదితర ప్రదేశాల) యోగా కేంద్రాలుగా మారాయి. మహిళా సంఘాలు, యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మొత్తం మీద, యోగా ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చన్న సందేశం ప్రతి గడపకూ చేరింది. నేడు యోగాసన కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ సగర్వంగా నిలబడింది.



Click it and Unblock the Notifications
