Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మెడకింద గంగడోలా? సవరించుకోండిలా!

1. తిన్నగా నిలబడండి. తల కొద్దిగా పైకెత్తి సీలింగ్ చూడండి. పెదాలను సాగదీస్తూ గాలిలోకి పైకి ముద్దాడండి. అయిదు నుండి పది సెకండ్లు. అయిదు సార్లు చేయండి. ముఖం లోని ఇతర కండరాలను బిగపట్టకండి.
2. మెడను అటునుండి ఇటుకు ఇటునుండి అటుకు ఛాతీ పైభాగాన్ని టచ్ చేస్తూ తిప్పండి. దీనిని నించుని లేదా కూర్చుని కూడా చేయవచ్చు. మెడను పూర్తిగా కూడా రొటేట్ చేయవచ్చు. పూర్తిగా కష్టమైతే సగం సర్కిల్ మాత్రమే చేయండి. ప్రతి భుజం వైపు మెల్లగా అయిదు లేదా ఆరు సార్లు చేయండి.
3. వజ్రాసనంలో కూర్చోండి. కుడిచేయి తలపై పెట్టండి తలను కుడి భుజంవైపు సాగేటంతవరకు వంచండి. అయిదు వరకు లెక్కించి రిలాక్స్ అవండి. దీనిని ఎడమవైపు కూడా చేయండి. ప్రతి సైడు ఎనిమిది నుండి 10 సార్లు చేయండి.
4. కూర్చుని లేదా నించుని సీలింగ్ వైపుగా చూస్తూ ఉఫ్ మంటూ గాలి వదలండి. పెదాలను లోపలికి బిగపడుతూ కూడా చేయవచ్చు. దీనిని 10 నుండి 15 సార్లు చేయండి.
5. చేతులు లేని ఛైర్ పై కూర్చోండి. తలను మెల్లగా వెనక్కు తీసుకు వెళ్ళండి. నోరు మూయటం తెరవగలిగినంత తెరవటం చేయండి.
6. గడ్డాన్ని పైకి ఎత్తండి ఏదో నములుతూ వున్నట్లుగా నమలండి. దవడలు బాగా కదలాలి.
అతి సామాన్యమైన ఈ గడ్డం వ్యాయామాలు ప్రతిరోజూ చేసి మీ గడ్డం కింద మెడ భాగాన వున్న కొవ్వును కరిగించేయండి. ఆకర్షణీయమైన మెడను సొంతం చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications