Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
బరువు తగ్గాలంటే జిమ్ కే వెళ్ళాల్సిన అవసరంలేదు..ఇలా కూడా చేయవచ్చు..!
సాధారణంగా మీరు మీకార్యాలయంలో పని చేసి వారిని కానీ లేదా అలా బజార్ లో నడుకుంటూ వెళ్ళే వారిని..మీరు ఎందుకు నడుస్తున్నారని అడగండి. వాళ్ళు బరువు తగ్గడానికి అని చాలా సింపుల్ గా సమాధానం చెప్పేస్తారు. ఇతర వ్యాయామాలు చేయడానికి టైమ్ లేదు. కనుక కనీసం నడిచైనా కొంతాని కొంత బరువు తగ్గించుకోవాలని చూస్తారు. కానీ జిమ్ చేయడం వల్ల బరువు అతి సులభంగా తగ్గవచ్చంటారు మరికొంత మంది. అయితే, మనం అందరూ చాలా టఫ్ బిజీ షెడ్యూళ్ళతో ఉండటం చేత..వెయిట్ లాస్ ఎక్సర్ సైజులు చేయడానికి జిమ్ కు వెళ్ళే టైం లేక, మరియు కొన్ని సందర్భాలలో జిమ్ కు వెళ్ళాంటే బద్దకించడం చేతనో అలా ఉండిపోతారు.
అయితే, మీరు ఇంటి దగ్గరే వెయిట్ లాస్ ఎక్సర్ సైజ్ లు చేస్తే ఏమవుతుంది?ఇంటి వద్ద వ్యాయామాలు చేయడం మనేది చాలా తేలికగ్గా ఉండటం వల్ల ..ఇవి బరువు తగ్గడానికి నిజంగా ఉపయోగపడవని చాలా మంది చెబుతుంటారు. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. కొన్ని హోం ఎక్సర్ సైజ్ లు కూడా బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జిమ్ కు వెళితే అక్కడ ట్రైనర్ తో పాటు వ్యాయామ పరికరాలు చాలా ఉంటాయి. అయితే ఇంట్లో చేసే వ్యాయామాలకు ట్రైనర్ మరియు ఎటువంటి అదనపు వస్తువుల యొక్క సహాయం లేకుండానే ఒక మంచి అవగాహణతో ఇంట్లోనే వెయిట్ లాస్ ఎక్సర్ సైజ్ లు చేయవచ్చు.
ఎటువంటి పరికరాలు ఉపయోగించడకుండానే ఇంట్లో వర్క్ ఔట్స్ చేయడం అనేది ఒక గొప్ప మార్గం కావచ్చు. ఎప్పుడైతే మీ వెయిట్ లాస్ ఎక్సర్ సైజ్ ఇంట్లో చేయడం మొదలుపెడుతారో..మీరు రెగ్యులర్ గా చేయాల్సినటువంటివి చాలానే చూడగలిగే అవకాశాలున్నాయి. మరియు మనికి ఇప్పటికే బరువు తగ్గించుకోడానికి కొన్ని ట్రిక్స్ తెలుసు..
అటువంటి ట్రిక్స్ (సింపుల్ వెయిట్ లాస్ ఎక్సర్ సైజులు)మనం ఇంటి వద్దే చేయగలిగినవి మీకోసం కొన్ని....

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
మొట్లు ఎక్కడం: ఈ వ్యాయామం చేయడానికి మీకు స్టెప్పర్ అవసరం లేదు. మనందరికి తెలుసు ఇంట్లో లేదా బయట ప్రదేశాల్లో స్టెప్స్ ఉన్న ఇల్లు ఉంటాయని. అలాగే పనిచేసే కార్యాలయారలు కూడా...కాబట్టి లిప్ట్ లు ఉపయోగించకుండా స్టెప్స్ ఎక్కడం మరియు దిగడం వంటివి రెగ్యులర్ గా చేయడం బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
చతికిలబడటం(squats):sqauts చేయడానికి ఎటువంటి పరికాల సహాయం లేకుండా చేయవచ్చు. మీచేతులను పూర్తిగా ముందుకు చాపి అలాగే స్లోగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఇలా కూర్చొని తర్వాత ఎటువంటి సపోర్ట్ లేకుండా వెంటనే లేవడానికి ప్రయత్నించాలి.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
క్రంచెస్: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి క్రంచెస్ చేయడం చాలా బెస్ట్ ఎక్సర్ సైజ్. అందుకు ఫ్లోర్ మాట్ మీద నిటారుగా వెల్లకిలా పడుకోవాలి. తర్వాత మీ తల వెనుక బాగంలో మీ చేతులను ఉంచాలి. చేతులను గట్టిగా పట్టుకొని అలాగే నెమ్మదిగా పైకి లేవాలి. మీ భుజాలను కూడా అలా నెమ్మదిగా పైకిలేపాలి. మిమ్మల్ని మీరు ఎటువంటి సపోర్ట్ లేకుండా (మీ శరీరాన్ని)పైకి ఎత్తాలి.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
పుష్ అప్స్: ఫ్లోర్ మాట్ మీద బోర్లాపడుకోవాలి. తర్వాత మీ భుజాలు మరియు కాలి వేళ్ళు సహాయంతో పైకి లేవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మీ ముక్కను ఫ్లోర్ ను తాకడానికి ప్రయత్నించాలి. తర్వాత అలాగే తిరిగి యథాస్థితికి చేరుకోవాలి. ఇది మీ ఆరోగ్యకరమైన భుజాలకు మరియు మీ చెస్ట్ కు చాలా మంచిది.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
జాగింగ్: బరువు తగ్గడానికి కార్డియో ఎక్సర్ సైజ్ చాలా ముఖ్యం. ఒక వేళ మీ ఇంట్లో ట్రెడ్మీల్ లేకున్నా కూడా, మీరు కార్డియో చేయవచ్చు. మీ హాల్ లో ఒక మంచి ప్లేస్ ను ఎంచుకోండి తర్వాత అక్కడిక్కడే జాగింగ్ మొదలు పెట్టండి. మీరు ఆప్రదేశాన్ని వదకుండా అక్కడే జాగింగ్ చేస్తున్నా కూడా మీరు ఆ ప్రదేశం వదిలి వేరే ప్రదేశాని వెళుతున్నట్లు అనుకోవాలి.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
డ్యాన్సింగ్: మొత్తం శరీర బరువును తగ్గించుకోవడానికి..శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి డ్యాన్సింగ్ బెస్ట్ ఎక్సర్ సైజ్. మీ చేర్స్ ను మీ డ్రాయింగ్ రూమ్ లో చేర్చేసి ఒక మంచి పెప్పీ మ్యూజిక్ ను లౌడ్ గా పెట్టి మీకు నచ్చిన విధంగా డ్యాన్స్ చేయడమే. ఇంతకంటే బెస్ట్ ఎక్సర్ సైజ్ మరోటి ఉండదు.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
జంపింగ్ జాక్: చిన్నతనంలో మనం చేసిన జంపిగ్ జాక్ గేమ్స్ ఇప్పుడు మనం బరువు తగ్గించుకోవడానికి బాగా సహాయపడుతాయి. ఎగుడుదిగుడులు లేని ఒక మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత అక్కడ ఎగరడానికి ప్రయత్నించాలి. మీరు జంప్ చేసే సమయంలో మీ కాళ్ళను హారిజాంటల్ గా పైకి లేపాలి అలాగే మీచేతులు మీ తల మీదకు ఎత్త చప్పట్లు కొట్టాలి.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
స్కిప్పింగ్: స్కిప్పింగ్ అంటే మళ్ళీ చిన్ననాటి ఆటలే గుర్తుకు వస్తాయి. అప్పుడు సరదాగా ఆడిన ఆటలు ఇప్పుడు మన శరీర బరువును అతి సులభంగా తగ్గిస్తాయి. స్కిప్పింగ్ ను మీ బాల్కనీలో లేదా గార్డెన్ లేదా టెర్రాస్ మీద చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
డిప్స్: సపోర్ట్ కు ఒక చిన్న స్టూల్ ఉంటే చాలు డిప్స్ చేయడం చాలా సులభం. ఎత్తుగా ఉండే సోఫా లేదా స్టూల్ )మీద చేతులను సపోర్ట్ గా ఆన్చి నేలమీద కాళ్ళను దూరంగా చాపాల. ఇప్పుడు భూమి మీదకు వంగినట్లు చేసి తిరిగి యాథా స్థానికి రావాలి. ఇలా పది పదిహేను సార్లు చేయవచ్చు.

అతి వేగంగా బరువు తగ్గించే తేలికపాటి వ్యాయామాలు..!
బర్పీస్: ఇది చూడటానికి చాలా తేలికగా కనిపిస్తుంది. కానీ బరువు తగ్గడానికి ఉత్తమమైన వ్యాయామాల్లో ఇది ఒకటి. మీ కడుపును భూమికి ఆన్చి పడుకోవాలి. నిదానంగా మీకు చేతుల మరియు కాలి వేళ్ళ సహాయంతో పైకి లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలంగా ఉండటానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications











