Latest Updates
-
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే..
సర్వరోగాలకు పరిష్కారం.. సూర్య నమస్కారం
సర్వరోగాలకు సూర్య నమస్కారం ఒక్కటి చాలు. జీవితం ఆరోగ్యంగా సాగిపోతుంది. భారతీయుల జీవనశైలిలో యోగాకు ప్రత్యేక స్థానముంది. అందులో సూర్యనమస్కారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. శరీర ఆరోగ్యానికి, మేధస్సుకు సూర్య నమస్కారం సహకరిస్తుందని భారతీయుల నమ్మకం. అంతేకాదు సూర్యుడిని శక్తివంతమైన దేవుడిగా భావిస్తూ.. పూజించడం భారతీయులకు పురాతన కాలం నుంచే అలవాటుగా ఉంది.
READ MORE: ఇంటర్నేషనల్ యోగా డే 2015: మంచి ఆరోగ్యం కోసం యోగసనాలు
ప్రాణాయామం, యోగా, ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలుసు. వీటి వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నిత్యం సూర్య నమస్కారం చేయడం వల్ల.. అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటూ.. ఫిట్ అండ్ హెల్తీగా ఉండటానికి సూర్య నమస్కారం చక్కటి పరిష్కారం. శరీరాకృతి సక్రమంగా ఉండాలంటే.. సూర్య నమస్కార ఆసనాలు నిత్యం కంపల్సరీ చేయాలి.
READ MORE: బిజీ లైఫ్ లో సూర్య నమస్కారం ఒక్కటి చాలు మీ ఆరోగ్యానికి...
బరువు తగ్గాలనుకునే వాళ్లకు సూర్య నమస్కారం సరైన వ్యాయామం. రోజూ ఉదయాన్నే లేచి ఏమీ తినకుండా సూర్యనమస్కారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సూర్య కిరణాలు డైరెక్ట్ గా మనపై పడే ప్రదేశంలో సూర్య నమస్కారం చేయడం మంచిది. ఖాళీ నేలపై కాకుండా.. ఏదైనా మ్యాట్ వేసుకుని దానిపై సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలలో 12 ఆసనాలున్నాయి. సూర్య నమస్కారం చేయడం వల్ల చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా, ఫ్రెష్ మైండెడ్ ఫీలింగ్ రోజంతా ఉంటుంది. రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే.. ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...

నిద్రకు
నిత్యం సూర్య నమస్కారం చేయడం కలిగే ప్రయోజనాల్లో ప్రశాంత నిద్ర ఒకటి. రోజూ ఈ వ్యాయామం చేస్తే.. మెదడు ప్రశాతంతంగా ఉండటంతో పాటు.. కంటినిండా నిద్రపడుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి.

ఫ్లెక్సిబుల్ బాడీ
రోజూ సూర్య నమస్కారం చేస్తే.. శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. అవయవాలు, వెన్నెముక చాలా స్ట్రాంగ్ గా, ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.

ఫ్యాట్ తగ్గించడానికి
మీకు సరైన శరీరాకృతి కావాలంటే.. నిత్యం సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఎక్స్ ట్రా ఫ్యాట్ కరిగి.. ఆరోగ్యంగా, స్లిమ్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది.

బెల్లీ ఫ్యాట్
బాన పొట్టతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే.. సూర్య నమస్కారం డైలీ చేయడానికి ప్లాన్ చేసుకోండి. బెల్లీ ఫ్యాట్ కరగడమే కాదు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

శక్తి పెరగడానికి
సూర్య నమస్కారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒకటి. రెగ్యులర్ గా ఈ వ్యాయామం చేస్తే.. శక్తితో పాటు, ఓర్పు పెరుగుతుంది. అలసట, ఆందోళనను కూడా తగ్గిస్తుంది సూర్య నమస్కారం.

రుతుక్రమ సమస్యలు
రుతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే నిత్యం సూర్య నమస్కారం చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఈ ఆసనం ద్వారా..రుతు క్రమ సమస్యలు తొలగిపోతాయి.

ప్రసవం
సూర్య నమస్కారం వల్ల డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఈజీగా ప్రసవం జరగడానికి సూర్య నమస్కారం వల్ల సాధ్యమవుతుంది.

జుట్టు ఆరోగ్యానికి
నిత్యం సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు రాలుటను, చుండ్రును, జుట్టు నెరవడం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జుట్టు పెరుగుదలకు కూడా సహకరిస్తుంది.

మెరిసే చర్మం
సూర్య నమస్కారం వల్ల పొందే ప్రయోజనాల్లో ఇది ప్రధానమైనది. నిత్యం సూర్యనమస్కారం చేయడం వల్ల మెరిసే చర్మంతో పాటు.. ముడతలు రాకుండా.. యంగ్ లుక్ సొంతం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న సూర్య నమస్కారం చేయడం మరవరు కదా.. రేపట్నుంచే మీ షెడ్యూల్ లో సూర్య నమస్కారాన్ని చేర్చుకోండి.



Click it and Unblock the Notifications











