ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించే 12 గ్రేట్ ఫ్రూట్స్

క్యాన్సర్ మానవులు మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రాణాలు పోవడం ఖాయమనే భావన చాలామందిలో ఉంది. అయితే వ్యాధిని ముందుగా గుర్తిస్తే దాని నుంచి బయటపడటం సాధ్యమేనని అంటున్నారు వైద్యులు. క్యాన్సర్ అంటే ఒకప్పుడు చికిత్సే లేని రాచపుండు. కానీ ఇప్పుడు క్యాన్సర్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. చిన్నపాటి జాగ్రత్తలతో అసలు రాకుండా కూడా నివారించడం సాధ్యమే అవుతుంది. సిగట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, మద్యం తీసుకోవడం మానేయడం, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ రిస్కు ఎంత ఉన్నా దాన్ని చాలావరకు జయించినట్టే.

క్యాన్సర్ ఇప్పుడు గతంతో పోలిస్తే అంత ప్రమాదకరమైన వ్యాధి కానేకాదు. అయినప్పటికీ ఏ వ్యాధికైనా చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. పైగా క్యాన్సర్ విషయంలో నివారించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నివారించుకోవడం చాలావరకు సాధ్యమే.

పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే క్యాన్సర్లను నివారించుకోవడం సాధ్యమా? చాలా సులభంగా సాధ్యమనే అంటున్నారు ఆహారనిపుణులు. ఫలానా ఆహారంలోని నిర్దిష్టమైన పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చెందిన క్యాన్సర్ల నివారణకు ఎలా పనిచేస్తాయన్న అంశంపై ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్' ఆధ్వర్యంలో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన పరిశోధనల్లో కూడా రెగ్యులర్ డైట్ లో పండ్లు మరియు తాజా కూరగాయలు చేర్చుకోవడం వల్ల 5-12శాంతం అన్ని రకాల క్యాన్సర్ల నుండి విముక్తి పొందవచ్చని వెల్లడి చేశారు.

పండ్లు మరియు తాజా కూరగాలయు నేచురల్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉండటం వల్ల ఇవి హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. పండ్లలో మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, ఫైటోకెమికల్స్ ఉండటం వల్ల ఇవి మన శరీరంను ఫిట్ గా హెల్తీగా ఉంచడం మాత్రమే కాదు, వ్యాధుల నుండి నేచురల్ గా మనల్ని కాపాడుతాయి. మనం రోజూ తినే ఆహారాలతోనే క్యాన్సర్లను సులభంగా, ఆరోగ్యకరంగా ఎలా నివారించగలమో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం.

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కు కారణం అయ్యే న్యూట్రోజెన్ కాంపౌండ్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి, మీరు ప్రతి రోజూ ఒక గ్రేప్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కోలన్, బ్లాడర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

ఆపిల్స్

ఆపిల్స్

రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు!రెడ్ ఆపిల్స్ ను వారానికి ఒక సారి తిన్నా క్యాన్సర్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు . ఆపిల్స్ యొక్క రెడ్ స్కిన్ లో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. మహిళల్లో ట్యూమర్స్ ఏర్పడకుండా ఎదుర్కోవాలంటే రెడ్ ఆపిల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

మామిడి పండ్లు

మామిడి పండ్లు

కింగ్ ఆఫ్ ఫ్రూట్ గా పిలుచుకొనే మామిడి పండ్లను మాత్రం తినకుండా ఉండకూడదు. మామిడిపండ్ల సీజన్ లో వీటిని తప్పని సరిగా తీసుకోవాలి . క్యాన్సర్ ను నేచురల్ గా తగ్గించడంలో మామిడిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో బయో యాక్టివ్ అంశాలు కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు శరీరం అంతటా వ్యాప్తి చెందకుండా నివారిస్తాయి.

కివి ఫ్రూట్స్

కివి ఫ్రూట్స్

క్యాన్సర్ ను నేచురల్ గా నివారించుకోవడానికి కివి ఫ్రూట్ ఒక బెస్ట్ ఫ్రూట్ . కివి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్ తో పోల్చితే కివిపండ్లలో విటమిన్ సి అధికం. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

లెమన్

లెమన్

నిమ్మకాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, రోజు తీసుకొనే సలాడ్స్, వంటల్లో నిమ్మరసం చేర్చుకోవడం వల్ల నేచురల్ గా క్యాన్సర్ ను ఎదుర్కోవచ్చు .

అవొకాడో

అవొకాడో

అవొకాడోలో ఫ్యాట్ ఉంటాయని, ఇవి మరింత బరువును పెంచుతుందని, చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయితే, ఈ పండ్లలో క్యాన్సర్ ను నివారించే లుటిన్ ఉండటం వల్ల, ఇది మౌత్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

జుజుబే

జుజుబే

టేస్టీ జుజుబే ఫ్రూట్ లో బీటా కెరోటిన్ మరియు బి విటమిన్స్ అధికంగా ఉంటాయి.యాంటీ క్యాన్సర్ పదార్థాల మీద ట్రైటెటర్పినాయిడ్స్ యాక్టివ్ గా పనిచేస్తాయి.

ఆరెంజ్

ఆరెంజ్

ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి క్యాన్సర్ ను నేచురల్ గా నివారిస్తుంది .

బెర్రీస్

బెర్రీస్

రాస్బెర్రీ, బ్లూ బెర్రీస్, మరియు క్రాన్ బెర్రీస్ మరియు మరికొన్ని బెర్రీ ఫ్రూట్ క్యాన్సర్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి క్యాన్సర్ సెల్స్ ను విచ్చిన్నం చేయడంలో సహాయపడుతాయి.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మల్లో ఎలాజిక్ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ యాసిడ్స్ ఫైటోన్యూట్రీయంట్స్ అంటారు. ఇవి క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో సహాయపడుతాయి.

టమోటో

టమోటో

లైకోపిన్ అనే పోషకం ఎక్కువగా ఉండే టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. అలాగే పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ, దానిమ్మ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అదుపు చేస్తాయి. ఇక క్రూసిఫెరస్ జాతి శాకాహారాలైన బ్రొకోలీ, కాలీఫ్లవర్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చుని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ద్రాక్ష

ద్రాక్ష

రెడ్ గ్రేప్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, వీటిని రెస్వర్టోల్ అని పిలుస్తారు. ఈ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గ్రేప్ జ్యూస్ మరియు రెడ్ వైన్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు గ్రేట్ గా సహాయపడుతుంది.

Story first published: Thursday, January 29, 2015, 18:03 [IST]
Desktop Bottom Promotion