Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
మహిళలూ.. ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్లతో బీ అలర్ట్
గుండె సంబంధిత వ్యాధుల తర్వాత ప్రాణాంతకమైనది క్యాన్సర్. ఇది కూడా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు 6 నుంచి 7 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా చాలా భయంకరమైనవి కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
READ MORE: సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి
ప్రతి సంవత్సరం 10 వేల మంది మహిళలు లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాంతో పాటు కొలెస్ర్టాల్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయి. ఏషియన్, పసిఫిక్ మహిళల్లో యూట్రస్ క్యాన్సర్ సాధారణంగా కనిపిస్తోంది. క్యాన్సర్ ద్వారా ఏడాదికి 2 వేల మందికి కంటే ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు.
మహిళలు, పురుషులలో వృద్ధి చెందుతున్న ఈ క్యాన్సర్ ను నివారించడానికి చాలా మందులు, రెమిడీస్ ఉన్నాయి. న్యాచురల్ పద్ధతిలో క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని పలు అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి క్యాన్సర్ ఉందని తెలిస్తే ఆందోళన పడకుండా.. తగ్గించుకునే మార్గాలను అన్వేషించడం మంచిది.
ఇండియాలో 17 శాతం మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా 45 నుంచి 55 ఏళ్ల మహిళల్లో కనిపిస్తోంది. లేటు వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి తల్లి పాలు ఇవ్వకపోవడం, లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీ కారణాలు. కాబట్టి మహిళలు అలర్ట్ గా ఉండాలి. మహిళల్లో ఎలాంటి క్యాన్సర్ లకు అవకాశం ఉందో తెలుసుకుంటే మంచిది. అంతేకాదు వాటిని ముందుగానే గుర్తించడం ఎలా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

గర్భాశయ క్యాన్సర్
ఇండియాలో మాత్రమే మూడో వంతు మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో చనిపోతున్నారు. చిన్న వయసులోనే లైంగిక చర్యల్లో పాల్గొనడం, ఎక్కువ మందితో శారీరక సంబంధం ఏర్పరుచుకోవడం, తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటమే గర్భాశయ క్యాన్సర్ కు కారణమవుతున్నాయి. హెచ్ ఐవీ ఇన్ఫెక్షన్ కూడా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కి కారణమవుతోంది.

బ్రెస్ట్ క్యాన్సర్
లేటు వయసులో గర్భధారణ, వారసత్వం, జెనెటిక్ టెండెన్సీస్ తోపాటు మరికొన్ని కారణాల వల్ల మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మొదటి దశలోనే దీన్ని గుర్తించడం ద్వారా ఈ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు.

పెద్ద పేగు క్యాన్సర్
ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద పేగు చివరి భాగంలో పాలిప్స్ ఉన్న వాళ్లకు ఈ క్యాన్సర్ కి అవకాశముంది. ఎక్కువ బరువు ఉండి, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే మహిళలకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

అండాశయ క్యాన్సర్
ఈ అండాశయ క్యాన్సర్ 55 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైతే 30 ఏళ్ల తర్వాత పిల్లలకు జన్మనిచ్చి ఉంటారో వాళ్లకే ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

స్కిన్ క్యాన్సర్
తెల్లగా ఉన్న మహిళలు, చర్మంపై ఎరుపు రంగు హెయిర్, ఎండలో ఎక్కువగా గడిపే మహిళల్లో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా జుట్టు లేని సమస్య ఉంటే ఈ క్యాన్సర్ కి అవకాశముంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్
పొగత్రాగకపోయినా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ధూమపానం చేయకపోయినా ఆ పొగ ఎక్కువగా పీల్చడం వల్ల కూడా మహిళలకు ఈ క్యాన్సర్ వస్తుంది. తమ భాగస్వామి స్మోకింగ్ చేయడం వల్ల 10 మందిలో 8 మంది మహిళలు లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

గర్భాశయ గోడలు క్యాన్సర్
గర్భాశయ గోడలనే ఎండోమెట్రియల్ అంటారు. గర్భసంచిలో ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇది 55 పైబడిన మహిళల్లో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం చిన్న వయసులోనే రుతుక్రమం మొదలవడం, కుటుంబంలో ఎవరికైనా ఇన్ఫెర్టిలిటీ, లేట్ మెనోపాజ్ వంటివాటి వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.



Click it and Unblock the Notifications