Latest Updates
-
చంద్రుడి సంచారం: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, డబ్బు, ప్రేమ దక్కుతాయి! -
మే 30న అరుదైన శివ, సిద్ధ యోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగేలేదు, జాక్ పాట్ ఖాయం! -
నవగ్రహ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ప్రత్యేక పీఠాలు -
జూన్ 1న కర్కాటకంలోకి గురు ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, సంపదతో పాటు అదృష్టం మీ సొంతం! -
వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. భారీ లాభాలు! - శనివారం, 30 మే 2026 -
ఆఫీసు స్నేహాలు ఎలా హద్దులు దాటి దగ్గరవుతున్నాయి -
Doctors Recommend This: ప్రోటీన్లతో నిండిన క్రీమీ హమ్మస్..ఇంట్లోనే ఇలా చేస్తే బయట కొనడం మానేస్తారు! -
ఒకే ఇంట్లో ఉంటూ.. ఒంటరిగా అనిపించడం అంటే ఏమిటి? ఇది మీకూ అనిపిస్తోందా? -
దృష్టి దోషం వెంటాడుతోందా? పూర్వీకులు పాటించిన ఈ మంత్రాలు, నియమాలు మీకు రక్షణ ఇస్తాయట! -
మీరు ఈసారి ముంబైకి వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని చూడాల్సిందే.!
ఫ్రిజ్ లో పెట్టిన అన్నం తింటే డేంజరా? అసలు నిజం చెప్పిన క్యాన్సర్ డాక్టర్!
ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ప్రతి పూటా వంట చేయడానికి సమయం కేటాయించడం, ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకుని తినడం అందరికీ సాధ్యపడే పని కాదు. సమయం ఆదా చేసుకోవడం కోసమో లేదా రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందనో.. చాలా మంది ఆ అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టి, మరుసటి రోజు ఆకలి వేసినప్పుడు మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. అయితే ఇలా ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా? ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా? అనే సందేహాలు చాలా మందిని వేధిస్తుంటాయి.

కొందరు ఇది అత్యంత ప్రమాదకరం అని భయపెడితే, మరికొందరు ఎప్పటినుంచో తింటున్నాం మాకేమీ కాలేదు అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ జయేష్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రకారం... ఫ్రిజ్ లో పెట్టిన అన్నం మళ్లీ వేడి చేసుకుని తినడం నూటికి నూరు శాతం సురక్షితమే. కానీ, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మీరు ఆ అన్నాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా సురక్షితంగా తినాలంటే తప్పనిసరిగా 4 ముఖ్యమైన నియమాలను పాటించి తీరాలి.
వండిన వెంటనే త్వరగా చల్లబరచాలి
చాలా మంది అన్నం వండిన తర్వాత లేదా భోజనం ముగిసిన తర్వాత మిగిలిన అన్నాన్ని గంటల తరబడి బయటే ఉంచేస్తుంటారు. ఇది చాలా తప్పు. అన్నం రూమ్ టెంపరేచర్ దగ్గర ఎక్కువ సమయం ఉన్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది విషపదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి అన్నం వండిన తర్వాత గది ఉష్ణోగ్రతకు రాగానే.. అంటే వండిన రెండు గంటలలోపు తప్పనిసరిగా ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఎంత త్వరగా ఫ్రిజ్ లో పెడితే బ్యాక్టీరియా పెరగకుండా అంతలా అడ్డుకోవచ్చు.
ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4°C కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి
అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టేసాం కదా అని నిశ్చింతగా ఉండకూడదు. మీ ఫ్రిజ్ టెంపరేచర్ సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అన్నం నిల్వ ఉంచే ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎప్పుడూ 4°C (డిగ్రీల సెల్సియస్) లేదా అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇంతటి చల్లటి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందలేదు. అలాగే అన్నాన్ని గాలి చొరబడని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్ (మూత గట్టిగా ఉండే డబ్బా)లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేయడం చాలా ముఖ్యం.

పొగలు వచ్చేలా బాగా వేడి చేయాలి
ఫ్రిజ్ లో నుంచి అన్నం బయటకు తీశాక, చాలా మంది హడావిడిగా కేవలం గోరువెచ్చగా అయ్యేలా కాస్త వేడి చేసుకుని లాగించేస్తుంటారు. ఇది పొట్టకు చాలా ప్రమాదకరం. ఫ్రిజ్ నుంచి తీసిన అన్నాన్ని మళ్లీ వేడి చేసేటప్పుడు, దానిలో నుంచి ఆవిరి లేదా పొగలు వచ్చేంతలా, పూర్తిగా లోపలి వరకు వేడి చేయాలి. మైక్రోవేవ్ లేదా స్టవ్ మీద ఎలా వేడి చేసినా, అన్నం అంతా ఒకేలా బాగా వేడి ఎక్కిందని నిర్ధారించుకున్న తర్వాతే తినాలి. ఇలా పూర్తిగా వేడి చేయడం వల్ల అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా వెంటనే చనిపోతుంది.
అన్నాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే వేడి చేయాలి
ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నియమం. ఫ్రిజ్ లో నుంచి అన్నం గిన్నె మొత్తం బయటకు తీసి, వేడి చేసి, కొంచెం తిని.. మిగిలింది మళ్లీ ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా పదే పదే వేడి చేయడం, మళ్లీ ఫ్రిజ్ లో పెట్టి చల్లార్చడం వల్ల అన్నంలో విషపూరితమైన బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మీకు తినడానికి ఎంత అన్నం కావాలో అంతవరకే ఫ్రిజ్ నుంచి బయటకు తీసుకుని వేడి చేసుకోవాలి. ఒకసారి వేడి చేసిన అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
ఈ నియమాలు పాటించకపోతే ఏమవుతుంది?
ఒకవేళ పైన చెప్పిన 4 నియమాలను నిర్లక్ష్యం చేస్తే.. కడుపులో భయంకరమైన ఇన్ఫెక్షన్, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి లాంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications