Latest Updates
-
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.!
ఆరోగ్యానికి అసలైన ఆమ్లెట్..డాక్టర్ సూచిస్తున్న పర్ఫెక్ట్ ఎగ్ రెసిపీ ఇదే!
ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్, లేదా బుర్జీ.. ఇలా ఏ రూపంలో తిన్నా గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. అయితే ఒక ఆహార పదార్థం ఎంత ఆరోగ్యకరమైనదైనా, మనం దాన్ని వండే పద్ధతిని బట్టే దాని పూర్తి ప్రయోజనాలు మనకు అందుతాయి.
ఉరుకుల పరుగుల జీవితంలో సమయం లేక కేవలం గుడ్డును పగలగొట్టి, కాస్త ఉప్పు, కారం చల్లి వండేస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీరు గుడ్డులోని పోషకాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవడమే కాకుండా, ఒక ముఖ్యమైన పోషకాన్ని మిస్ అవుతున్నట్లే.

మీరు గుడ్డు వండే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని న్యూజెర్సీకి చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ అలెస్సియా రోహ్నెల్ట్ చెబుతున్నారు. ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చాలామంది వంటగదిలో చేసే ఒక సాధారణ పొరపాటును ఎత్తిచూపారు.
సాధారణంగా ప్రొటీన్ కోసం అందరూ గుడ్లను తింటారు. ప్రొటీన్ కడుపును నిండుగా ఉంచి, జీవక్రియను (Metabolism) మెరుగుపరుస్తుంది. కానీ డాక్టర్ అలెస్సియా ప్రకారం.. కేవలం గుడ్డును మాత్రమే వండుకుని తినడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఎందుకంటే గుడ్లలో ప్రొటీన్లు, ఐరన్, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ మన జీర్ణవ్యవస్థకు ఎంతో అవసరమైన ఫైబర్(పీచుపదార్థం) మాత్రం ఉండదు.
చాలామంది తమ రోజువారీ డైట్‌లో ప్రొటీన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టి, ఫైబర్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ లోపాన్ని సరిదిద్దాలంటే మీ ఆమ్లెట్ లేదా స్క్రాంబుల్డ్ ఎగ్ లో(గిలకొట్టిన గుడ్డు) కచ్చితంగా కూరగాయలను చేర్చాలి. మీ అల్పాహారాన్ని మరింత ఆరోగ్యకరంగా, రుచికరంగా మార్చుకోవడానికి గుడ్డుతో పాటు పాలకూర, టమోటాలు, పుట్టగొడుగులు, రంగురంగుల క్యాప్సికమ్, ఆకుకూరలు కలిపి వండుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు.
ఇలా కూరగాయలు ఎందుకు కలపాలి?
గుడ్డుకు కూరగాయలను జోడించడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా, మీ గట్ మైక్రోబయోమ్ (పేగుల్లోని మంచి బ్యాక్టీరియా) వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ప్రొటీన్, ఫైబర్... ఈ రెండింటి కలయిక వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. తద్వారా పదే పదే అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది, రోజంతా మీ శరీరంలో శక్తి స్థాయిలు ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా ఉంటాయి.
కేవలం కూరగాయలు కలపడమే కాకుండా మీరు వాడే వంట నూనె కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. గుడ్డు, కూరగాయలలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా వంటబట్టాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అందుకోసం వంటలో ఆలివ్ నూనెను ఉపయోగించడం ఉత్తమమని డాక్టర్ సిఫార్సు చేస్తున్నారు. ఇది పోషకాలు శరీరంలో సులభంగా శోషించబడటానికి ఎంతగానో సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
