Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
ఐస్ క్రీం తిన్న తరువాత ఇవే తింటే చాలా ప్రమాదం.. చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి!
ఎండాకాలంలో అందరూ ఎంతో ఇష్టపడే ఫుడ్ ఐటెమ్ ఐస్ క్రీమ్. ఎండల వేడిలో మండిపోయి ఉన్నప్పుడు నీళ్లు తాగడం కంటే ఒక కప్పు ఐస్ క్రీం తినడం సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. పుట్టగొడుగుల మాదిరిగా చల్లగా, టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీములు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తాయి. వివాహాలు, ఫంక్షన్లు, బర్త్‌డే పార్టీలలో ఐస్ క్రీమ్ వుండకపోతే అది నిండుతనంగా అనిపించదు. అయితే, ఐస్ క్రీం తినడం అనేది ఒక మంచి అనుభవం కావచ్చు, కానీ దాన్ని తినిన తర్వాత కొన్ని తప్పులు చేస్తే, ఆ తప్పులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనేది మనం తెలుసుకోవాలి. ఐస్ క్రీం తిన్న తరువాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. నీళ్ల వల్లనే!
చాలా మంది ఐస్ క్రీం తిన్న తర్వాత జలుబు, దగ్గు, కఫం మొదలయిన సమస్యలతో బాధపడతారు. కొంతమంది దీన్ని ఐస్ క్రీం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అని అనుకుంటారు. కానీ అసలు కారణం ఐస్ క్రీం కాదు. దీన్ని తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్లే ఇలా జరుగుతుంది. చల్లటి ఐస్ క్రీమ్ తిన్న తరువాత నీళ్లు తాగడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు మొదలవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

2. వేడి ఆహారాలను ఐస్ క్రీం తిన్న వెంటనే తినకండి
ఐస్ క్రీం తిన్న తర్వాత, వేడి ఆహారం తినడం వలన జీర్ణ సమస్యలు మరియు వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది పేగులకు హానికరంగా మారుతుంది. అలాగే పేగు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల వరకు వేడి ఆహారం తినకండి.
3. సిట్రస్ పండ్లు మరియు పాల ఉత్పత్తులు..
ఐస్ క్రీమ్ తినిన తర్వాత, సిట్రస్ పండ్లు మరియు పాలు లేదా పెరుగు తినడం అనేది జీర్ణ సంబంధిత సమస్యలను కారణమవుతుంది. పాల ఉత్పత్తులు, సిట్రస్ ఫలాలలోని ఆమ్లతతో కలిసినప్పుడు జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది, ఇది మంట, వాంతులు, అసౌకర్యం కారణం అవుతుంది.
4. పెరుగు తినడం:
ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పెరుగు తినడం కూడా జీర్ణ సమస్యలు కలిగించవచ్చు. ఐస్ క్రీమ్‌లోని పాలు మరియు పెరుగు కలిసినప్పుడు, అవి పేగులలో డిజెస్టివ్ ఇష్యూలను కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు నివారించడానికి, ఐస్ క్రీం తినిన తర్వాత కొన్ని గంటలు పాటు పెరుగు లేదా పాల ఉత్పత్తులు తీసుకోకండి.
5. టీ/కాఫీ తాగడం:
ఐస్ క్రీమ్ తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగడం మంచిది కాదు. టీ లేదా కాఫీలో ఉండే కెఫిన్ ఐస్ క్రీమ్‌లోని పాలు, పెరుగు పదార్థాలతో కలిసి జీర్ణ సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి, ఐస్ క్రీం తినిన తరువాత కనీసం 30 నిమిషాల వరకు ఈ పానీయాలను నిరోధించండి.
6. వేడి సూప్ తాగడం:
ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేడి సూప్ తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం. చల్లని ఐస్ క్రీమ్ మరియు వేడి సూప్ ఒకేసారి తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అందుకే అలాంటి వస్తువులను తీసుకోకపోవడమే మంచిది.
ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఐస్ క్రీం తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు వేడి ఆహారం, సిట్రస్ పండ్లు, పెరుగు, టీ/కాఫీ, వేడి సూప్ వంటివి తీసుకోకూడదు.
ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగండి. దీనివల్ల, శరీరంలో ఏ ఆమ్లత స్థాయిలు సమానంగా ఉండి.. ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.
ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త వహించండి. ఎండనుండి వచ్చే వేడి శరీరంలో చల్లదనాన్ని తగ్గిస్తుంది.
ఈ సులభమైన జాగ్రత్తలు పాటించడంవల్ల, మీరు ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications