Latest Updates
-
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే..
పొయ్యి మీద పెడితే పోషకాలన్నీ వేస్ట్!..కోసిన వెంటనే వండకూడని 3 కూరగాయలు ఇవే..
మన శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కూరగాయలు తప్పనిసరి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు మన రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అయితే కూరగాయలను కోసిన వెంటనే వండటం మంచిదని మనందరికీ తెలుసు. కానీ కొన్ని కూరగాయల విషయంలో ఇది పూర్తిగా తప్పని నిపుణులు చెబుతున్నారు. కొన్ని కూరగాయలను కోసిన తర్వాత కాసేపు ఆగి వండటం వల్ల వాటిలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయని మీకు తెలుసా? కోసిన వెంటనే వండకూడని ఆ 3 రకాల కూరగాయలు ఏవో ఇక్కడ చూడండి.

వెల్లుల్లి
మన వంటగదిలో వెల్లుల్లి లేని పోపు ఉండదు. వెల్లుల్లిని పొట్టు తీసి, ముక్కలుగా తరిగి లేదా దంచి వాడుతుంటాం. కానీ మీరు చేసే ఒక చిన్న మార్పు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిని తరిగిన లేదా దంచిన వెంటనే కాకుండా..ఒక 10-15 నిమిషాల పాటు గాలికి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లిలో ఒక అద్భుతమైన మాయ జరిగి అల్లిసిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటమే కాకుండా, ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ
ఈ మూడు కూరగాయలు ఒకే కుటుంబానికి చెందినవి (క్రూసిఫెరస్). వీటిని వండే ముందు శుభ్రంగా కడిగి ముక్కలుగా కోస్తాం.. అయితే కోసిన వెంటనే వేడి చేయకుండా, కనీసం 30-40 నిమిషాల పాటు గాలి తగిలేలా ఆరుబయట ఉంచాలి. ఇలా ఎందుకు చేయాలంటే.. ముక్కలు కోసి కాసేపు పక్కన పెట్టినప్పుడు వీటిలో సల్ఫోరాఫేన్ అనే రసాయన స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఇది క్యాన్సర్ కణాలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులోని ఐసోథయోసయనేట్ అనే మూలకం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇకపై వీటిని వండేటప్పుడు కాస్త ఓపిక పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉల్లిపాయ
ఉల్లిపాయలు తరిగేటప్పుడు కన్నీళ్లు రావడం సహజం. ఇందులోని సల్ఫర్ గాలిలో కలిసి మన కళ్ళకు తగలడం వల్లే ఇలా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ మన కళ్ళలోని క్రిములను నాశనం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఉల్లిపాయలను కోసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆగి వంటలో వాడటం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఉల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు చురుకుగా మారి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని చెబుతున్నారు.

ముఖ్యవిషయం ఏంటంటే..
ఈ కూరగాయలను నూనెలో వండినప్పుడే మనకు పూర్తి ప్రయోజనాలు అందుతాయి. ఎందుకంటే ఈ కూరగాయల్లో ఉండే విటమిన్లు A, D, E, K లు కొవ్వులో మాత్రమే కరుగుతాయి. వంటకు నువ్వుల నూనె వాడటం మరింత ఉత్తమం. ఈ కూరగాయలను వండేటప్పుడు ఉప్పును సాధ్యమైనంత వరకు తగ్గించాలి. మరో ముఖ్యమైన విషయం.. ఈ కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మానుకోండి. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వీటిలోని సహజమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు నశించిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
