Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.?
ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కోసం డైట్‌లో భాగంగా తప్పనిసరిగా పోషకాహారం చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఆకకూరలు, పప్పు ధాన్యాలు, ప్రొటీన్, ఫైబర్‌తో పాటు రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం తప్పనిసరి. బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, వాల్‌నట్స్‌లోని ఫైబర్, మినరల్స్, విటమిన్స్ యాంటీఆక్సిడెంట్లతో పాటు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి. అయితే హెల్తీ కదా అని వీటిని పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. మరి ఏ మోతాదులో వీటిని తీసుకోవాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..

పిడికెడు నట్స్‌లో కేలరీలు
డ్రైఫ్రూట్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో వీటిని రెగ్యులర్‌గా తింటే అధికంగా శక్తిని అందిస్తాయి. ఈ క్రమంలో వీటిని సరైన మోతాదులో సరైన విధానంలో తీసుకుంటే మంచిది. పిడికెండు అంటే దాదాపు 28 గ్రాముల గింజల్లో 160 నుంచి 200 కేలరీలు ఉంటాయి. అందుకే అవసరానికి మించి తీసుకుంటే బాడీలో అదనంగా కేలరీలు పెరిగి హాని చేస్తాయి.
నీటి శాతం తక్కువ
డ్రై ఫ్రూట్స్‌లో నీటి శాతం తక్కువగా ఉంటుంది. సహజ చక్కెర, కేలరీలు మాత్రం అధికంగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకునేటప్పుడు ఎంత తింటున్నారనేదానిపై శ్రద్ధ వహించాలి. అధికంగా కేలరీలు తీసుకుంటే క్రమంగా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఫలితంగా ఒబెసిటీ పెరిగి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయి.

ఉదాహరణకి ఎండు ద్రాక్ష, ఖర్జూరాల్లో ఫైబర్, పొటాషియం, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిలో సహజంగా ఉండే చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. తాజా పండ్లతో పోలిస్తే వీటిని తక్కువగా తీసుకున్నా కూడా కేలరీలు, చక్కెర శాతం శరీరంలో విపరీతంగా పెరుగుతుంది. అందుకే వీటిని తీసుకునేటప్పుడు కేలరీలు, షుగర్ కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు డ్రైఫ్రూట్స్‌ను తమ ఆహారంలో చేర్చుకునేటప్పుడు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
కాగా, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను తీసుకునేముందు వాటిలోని అధిక చక్కెర, కేలరీలను దృష్టిలో ఉంచుకుని వైద్యుల సలహా తీసుకోవడం లేదా రోజూ మితంగా తీసుకోవడం మంచిది. అయితే బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి వాటి విషయానికొస్తే రోజూ గుప్పెడు అంటే 28 గ్రాములు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
డ్రై ఫ్రూట్స్, నట్స్‌ను డైరెక్ట్‌గా తీసుకోవడం కంటే రాత్రంతా వాటిని నానబెట్టి తీసుకోవడం మంచిది. ఎందుకంటే నీళ్లలో ఉబ్బిన తర్వాత వీటిలోని పోషకాలు, మినరల్స్ శరీరానికి సమృద్ధిగా అందుతాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది. చిన్న వయసు నుంచే వీటిని తీసుకోవడం ద్వారా పిల్లల్లో మెదడు ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
