Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శరీరంలో ఈ మార్పులు నోటి,గొంతు క్యాన్సర్ సంకేతమే!
క్యాన్సర్..ఒకప్పుడు దీనిని డబ్బున్నోళ్ల వ్యాధిగా భావిస్తుండేవాళ్లు. అయితే ఈ రోజల్లో చిన్నా పెద్దా, ఆస్తి ఆంతస్థు తేడా లేకుండా ఎవరికి ఎప్పుడు ఎలా క్యాన్సర్ వస్తుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ పేరు వింటేనే కొందరిలో విపరీతమైన టెన్షన్ కూడా వచ్చేస్తుంటది.మనదేశంలో ఏటా లక్షలమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇప్పడు క్యాన్సర్ హాస్పిటల్స్ పెరగడం,అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి రావడం వల్ల మరణాల శాతం గణనీయంగా తగ్గిపోయింది. క్యాన్సర్ లో కూడా అనేక రకాలు ఉంటాయి. లంగ్ క్యాన్సర్, లివిర్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్,మెదడ క్యాన్సర్ ఇలా చాలా రకాలు ఉంటుంటాయి. క్యానర్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్ భారిన పడుతోన్న వారిన సంఖ్య పెరుగుతోంది. మన శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. నోరు, గొంతు లేదా తల చుట్టూ క్యాన్సర్ వ్యాపిస్తే దానిని గొంతు క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్ అని అంటారు. నోరు,గొంతు క్యాన్సర్.. నోరు, గొంతులో కణాలు అసాధారణంగా పెరడం వల్ల వస్తుంది. ఇవి తల, మెడ క్యాన్సర్ల లో ఒక భాగం. ఈ క్యాన్సర్లు నోటి కుహరం (పెదవులు, నాలుక, దవడ ఎముక, చిగుళ్ళు) లేదా గొంతు భాగాలలో ఎక్కడైనా సంభవించవచ్చు. అయితే క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ అందించడం కూడా సులభతరమవుతుంది. అందుకే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా క్యాన్సర్ ను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోటి,గొంతు క్యాన్సర్ లక్షణాలు ఇవే
స్వరంలో మార్పు, గొంతు బొంగురుపోవడం, గొంతులో గడ్డలు అనిపించడం, తినడంలో ఇబ్బంది, శరీర అలసట, ఆహారం నమలడం, నాలుకను కదిలించడంలో నొప్పి, నిరంతరం బరువు తగ్గడం, దుర్వాసన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్ర లేకపోవడం, దగ్గు, నోటి నుండి రక్తస్రావం ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే, రోగికి డైరెక్ట్ లారింగోస్కోపీ (టెలిస్కోప్ ద్వారా టెస్ట్), CT స్కాన్, MR టెస్ట్ ద్వారా క్యాన్సర్ ఎంత దూరం వ్యాపించిందో తెలుసుకుంటారు. తర్వాత రోగి క్యాన్సర్ ముక్కను తీసుకొని పరీక్షకు పంపుతారు. అది ఏ రకమైన క్యాన్సర్, దాని ట్రీట్మెంట్ ఏంటో నిర్ణయిస్తారు. మొదటి దశలోనే రోగికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే లేజర్, రేడియోథెరపీ ట్రీట్మెంట్ జరుగుతుందని, రెండవ, మూడవ దశలలో ఆపరేషన్, రేడియేషన్ జరుగుతుందని, కాబట్టి ప్రజలు తమ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నాలుక రంగు
నాలుక రంగు అకస్మాత్తుగా నల్లగా మారడం ప్రారంభిస్తే అది గొంతు ఇన్ఫెక్షన్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణంగా భావిస్తుంటారు. షుగర్ పేషెంట్ల నాలుక రంగు మారుతుంది. అయితే క్యాన్సర్ తో బాధపడేవారిలో కూడా నాలుక రంగు నల్లగా మారడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
దీని వల్లే వస్తుంది
నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాల్లో మధ్యపానం,ధూమపానం,జన్యుపరమైన అంశాలు, నోటి పరిశుభ్రతను పాటించకపోవడం, తంబాకును ఎక్కువగా నమలడం వంటివి ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications