Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం.!
పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వచ్చాయంటే అమ్మాయిలకు ముందుగా గుర్తొచ్చేది మెహందీ. ఎంత రెడీ అయినా చేతులకి మెహందీ, గోరింటాకు లేకపోతే కళ పోయినట్లే. అతివలకి సహజ అందం ఇచ్చే వాటిలో గోరింటాకు ఒకటి. అంతేకాకుండా భారతీయ సంప్రదాయంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మెహందీ పెట్టుకున్న చేతులతో భోజనం చేస్తే ఆరోగ్యానికి హానికరమని, పొట్ట ఇన్‌ఫెక్షన్లకి దారితీస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇది నిజమేనా.. నిపుణుల సలహాలు చూద్దాం..

మెహందీ లేదా గోరింటాకు పెట్టుకున్న తర్వాత, అది ఎండిన తర్వాత ఆహార పరంగా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. గోరింటాకు పెట్టుకోవడం మాత్రమే కాదు.. పరిశుభ్రత విషయంలోనూ జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. చేతులకి మెహందీ తడిగా ఉన్నప్పుడు, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు.. అవి ఆహారాన్ని తాకితే అప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది.
ఇన్‌ఫెక్షన్ ముప్పు..
చేతులు సరిగా శుభ్రం చేసుకోకుండా మెహందీ పెట్టుకున్నప్పుడు చేతులపై ఉండే బ్యాక్టీరియా లేదా ఇతర క్రిములు ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. దీని వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఇది పొట్ట సంబంధిత సమస్యలకి దారితీయవచ్చు.
కెమికల్ హెన్నా..
మార్కెట్‌లో దొరికే హెన్నా సహజంగా ఉండదు. అందులో రసాయనాలు కలుపుతారు. అవి చర్మానికి పడకపోతే ఎలర్జీలు, చికాకు, దద్దుర్లు, బొబ్బలు కలగవచ్చు. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది. తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తే తినే ఆహారానికి, నోటికి తగలకుండా చూసుకోండి.

హెన్నా తింటున్నారా..
మెహందీ పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయే వరకు వెయిట్ చేయండి. గోరింటాకు ఆరకుండానే ఆ చేతులతోనే తిన్నట్లయితే హెన్నా పేస్ట్ ఆహారం ద్వారా కడుపులోకి చేరుతుంది. దీంతో వాటిలోని రసాయనాల కారణంగా పొట్ట ఇన్‌ఫెక్షన్లకి దారితీయవచ్చు.
చేతులు కడుక్కోవడం ముఖ్యం..
గోరింటాకు ఆరిపోయిన తర్వాత చేతులు, వేళ్లు, గోళ్ల చుట్టూ శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే భోజనం చేసేటప్పుడు అంటుకుపోయిన హెన్నా కడుపులోకి చేరవచ్చు. పొట్ట ఇన్‌ఫెక్షన్లని నివారించాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.

అలెర్జీ అలర్ట్..
మెహందీ పెట్టుకున్న తర్వాత చర్మంపై దురద, మంట, ఎర్రబడటం, వాపు, బొబ్బలు వంటివి వస్తే నిర్లక్ష్యం చేయకండి. ఈ లక్షణాలు ప్రమాదకరం కావచ్చు. వెంటనే హెన్నా వాడటం మానేయండి. లక్షణాలు తీవ్రమైతే చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించండి. పండుగలు, శుభకార్యాల సమయంలో గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయమే. కానీ పరిశుభ్రత, కెమికల్ ఫ్రీ వంటి వాటిని పాటించడం ద్వారా పొట్ట ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ సంప్రదాయాన్ని పాటిస్తూ చేతులను ఆకట్టుకునే మెహందీ డిజెన్లతో అలంకరించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
