Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Liquor Allergy: మందు తాగితే ఈ అలెర్జీ! దేశంలో మొదటి కేసు నమోదు.. లక్షణాలు ఏంటంటే?
మద్యం తాగితే లివర్ చెడిపోతుంది ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే. తాజాగా మందుబాబులకు మరో హెచ్చరిక జారీ చేస్తున్నారు వైద్యులు. మద్యం తాగే వారిలో ఎర్రటి దద్దుర్లు, దురద, ఛాతీ పట్టేసినట్లు కావడం లాంటి సమస్యలూ వస్తున్నట్లు తాజాగా గుర్తించారు. దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో లిక్కర్ అలెర్జీ కేసు నమోదు అయింది. ఆగ్రా నుండి హైదరాబాద్ కు వచ్చిన జాన్(36) అనే వ్యక్తిలో ఈ లిక్కర్ అలెర్జీ గుర్తించారు వైద్యులు.

అరుదైన వ్యాధి:
అలెర్జీలలో చాలా రకాలు ఉంటాయి. కొందరికి డస్ట్ అలెర్జీ, ఫుడ్ అలెర్జీ, స్కిన్ అలెర్జీ ఇలా చాలా రకాల అలెర్జీలు ఉంటాయి. అలాగే కొందరిలో ఆల్కహాల్ లేదా లిక్కర్ అలెర్జీ ఉంటుంది. ఈ అలెర్జీ ఉన్న వారు మద్యం సేవించడం వల్ల శరీరంలో దద్దుర్లు, దురద లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
దద్దుర్లు, దురద, ఛాతీ పట్టేయడం:
ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులో వందల్లోనే ఉంటాయి. భారత్ లో లిక్కర్ అలెర్జీ కేసు ఇదే మొదటిది. తాజాగా లిక్కర్ అలెర్జీకి గురైన జాన్ అనే వ్యక్తి కొన్ని రోజుల ఓ పార్టీలో మద్యం తాగాడు. అప్పటి నుండి అతడి ముఖం ఎర్రబడింది. శరీరంపై చాలా చోట్ల దద్దుర్లు రావడం మొదలైంది. విపరీతమైన దురద పెట్టేవి. ఛాతీ పట్టేసినట్లుగా ఉండటంతో దవాఖానాలో చేరాడు.
చికిత్స తర్వాత జాన్ కోలుకున్నాడు. ఆరోగ్యం సాధారణ స్థితికి రాగానే మరో రెండు నెలల తర్వాత మరో పార్టీలో ఆల్కహాల్ తీసుకున్నాడు. గతంలోలాగే మళ్లీ అవే లక్షణాలు కనిపించాయి. స్థానికంగా వైద్యులకు చూపించగా ఈ లక్షణాలకు కారణాలను గుర్తించలేకపోయారు.
అరుదైన అలెర్జీగా గుర్తింపు:
అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లోని ప్రముఖ అలెర్జీ సెంటర్ ను సంప్రదించాడు. ఇక్కడి వైద్యులు జాన్ ను క్షుణ్ణంగా పరిశీలించి అతడు ఆల్కహాల్ అలెర్జీతో బాధపడుతున్నట్లు తేల్చారు. ప్రపంచంలో కేవలం 100 వరకు మాత్రమే ఇలాంటి లిక్కర్ అలెర్జీ కేసులు ఉండొచ్చని వైద్యులు తెలిపారు. ఇది చాలా అరుదైన అలెర్జీగా తేల్చారు. మద్యం తాగే సమయంలో నూనెలో వేయించిన ఫుడ్స్, మసాలా దట్టించిన పదార్థాలు, సాల్టీ ఫుడ్స్, హై హిస్టమిన్ ఫుడ్ తినడం వల్ల ఈ భయంకరమైన అలెర్జీ వస్తుందని వైద్యులు తెలిపారు.
వాటికి దూరంగా ఉండాలని వైద్యుల సూచన:
అలెర్జీకి కారణమయ్యే ఆల్కహాల్ బ్రాండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు జాన్ కు సూచించారు. ఆల్కహాల్ తీసుకునే ముందు పరీక్షించాలని, ఎలాంటి ఇబ్బంది లేకపోతే తీసుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే మద్యం సేవించప్పుడు హై హిస్టామిన్ ఫుడ్స్, ఫ్రైడ్స్ ఫుడ్స్, సాల్టీ ఫుడ్స్ తీసుకోవద్దని సూచించారు. మద్యం తాగడానికి ముందు యాంటిహిస్టామైన టాబ్లెట్ ను తీసుకోవాలని సలహా ఇచ్చారు. కార్క్ మూతలతే ప్యాక్ సే మద్యం బ్రాండ్ లకు దూరంగా ఉండాలని సూచించారు.
Disclaimer: Alcohol Drinking Is Injurious To Health.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications