Latest Updates
-
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.?
ఇంట్లోకి మురికి రాకుండా చేసే 5 బెస్ట్ డోర్ మ్యాట్‌లు.. వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్స్.!
వర్షాకాలంలో ఇల్లు తరచుగా మురికిగా, తడిగా మారుతుంటుంది. పరిశుభ్రత ఎంతగా పాటించినా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ మురికి ఇంట్లోకి వ్యాపిస్తుంది. అయితే ఇందుకు పరిష్కారంగా ప్రవేశ ద్వారం, బాత్‌రూమ్ డోర్ ఇలా తడి తగిలే చోట్ల తప్పనిసరిగా డోర్ మ్యాట్‌లు ఉపయోగిస్తాం. కానీ వర్షాకాలంలో డోర్‌మ్యాట్‌ల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే తడి, మురికి సరిగా పీల్చుకోకుండా ఇంట్లోకి వ్యాపించేలా చేస్తుంది.

వర్షాకాలంలో ఇంట్లో దుమ్ము, బురద, తేమ సమస్య ఎక్కువగానే ఉంటుంది. ఈ కారణంగా దుర్వాసనతో పాటు రోగాలకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఇంటి పరిశుభ్రత కోసం, కుటుంబీకుల ఆరోగ్యం కోసం సరైన డోర్ మ్యాట్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి మురికి, బురద, చెప్పులు, బూట్ల నుంచి నీటిని బయటే ఆపేస్తాయి. దీని వల్ల ఇల్లు శుభ్రంగా, పొడిగా ఉండటంతో పాటు ఫ్లోర్ కూడా ఎలాంటి మరకలు లేకుండా మెరుస్తూ ఉంటుంది. మరి అలాంటి 5 అత్యంత శుభ్రతను అందించే డోర్ మ్యాట్ ఆప్షన్‌ల వివరాలు తెలుసుకుందాం..
కొబ్బరి పీచు డోర్‌మ్యాట్
వర్షాకాలంలో అత్యంత అనువైన, ఉత్తమమైన డోర్ మ్యాట్ కొబ్బరి పీచుతో చేసినది. ఈ డోర్ మ్యాట్‌లు మురికిని శుభ్రంగా తొలగిస్తాయి. పిల్లలు బూట్లు, పెద్దల షూస్‌కి అంటిన మురికి, దుుమ్ము, గులకరాళ్లను సైతం సులభంగా తొలగించి అవి ఇంట్లోకి రాకుండా నివారిస్తాయి. వీటిని సహజంగా తయారుచేయడం వల్ల ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. వీటిని మెయిన్ గేట్ దగ్గర ఉంచడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
రబ్బరు బేస్ ఫుట్‌రెస్ట్
ఈ కాలంలో ఇంటా బయట తడి కారణంగా నేల ఎక్కువగా జారే స్వభావంతో ఉంటుంది. ఇందుకు పరిష్కారంగా రబ్బర్ బేస్ ఫుట్ రెస్ట్‌లు మేలు. వీటిపైన కాలు పెట్టినప్పుడు జారకుండా ఉంటుంది. పట్టు కోల్పోకుండా కాపాడుతుంది. వీటిని ఉతకడం సులభం, నీరు ఉన్నప్పుడు వీటిని బయట దులపడం ద్వారా తడి సులభంగా తొలగిపోయి ఇంట్లో తేమ లేకుండా చూస్తుంది.

మైక్రోఫైబర్ డోర్ మ్యాట్
బాగా వర్షాలు పడినప్పుడు కొన్ని ఇళ్లలోకి ప్రవేశద్వారం ద్వారా నీరు ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి సమస్యకు మైక్రోఫైబర్ డోర్ మ్యాట్ బెస్ట్ ఆప్షన్. ఇది వర్షపు నీటిని త్వరగా పీల్చుకుంటుంది. బయట నుంచి వచ్చే తడిని కూడా సులభంగా పీల్చుకుని ఇంటిని పొడిగా ఉంచుతుంది.

లైన్స్ డోర్ మ్యాట్
ఆఫీసులు, షాపులు వంటి ప్లేస్‌లకు గీతలు, బ్రష్ ఆకృతిలో ఉన్న డోర్ మ్యాట్‌లు ఉత్తమంగా పనిచేస్తాయి. వర్షాకాలంలో ఉద్యోగులు, యజమానులు రోడ్లపై బురద తొక్కుతూ లోపలికి రావడం సహజం. అలాంటి పరిస్థితుల్లో ఈ డోర్‌మ్యాట్‌లు బెస్ట్ ఆప్షన్. ఇవి బురదను, తడిని, మురికి చెప్పులు, బూట్ల నుంచి సమర్థవంతంగా తొలగిస్తాయి. ఇక, ఇంట్లో అయితే వీటిని ప్రవేశ ద్వారం లోపల కంటే బయట ఉంచడం మంచిది.
డబుల్ లేయర్ డోర్ మ్యాట్
వర్షాకాలంలో మురికి, బురద ఎక్కువగా చేరే అవకాశం ఉందనే చోట రెండు పొరల డోర్ మ్యాట్ బాగా పనిచేస్తుంది. వీటి పై పొర మురికిని పీల్చుకుంటుంది. కింది పొర నీటిని, తేమను సమర్థవంతంగా పీల్చుకుని ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుతుంది. అంతేకాకుండా మురికి నీరు నేలమీదకు చిందకుండా డోర్ మ్యాట్ లోపలే ఉండటం ద్వారా తేమ రాకుండా ఉంటుంది. ఎక్కువ మంది ఉన్న ఇళ్లలో డబుల్ లేయర్ వాటర్ ట్రాపింగ్ నాచ్ డోర్ మ్యాట్ మంచి ఎంపిక.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
