Latest Updates
-
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే?
కురుల ‘చిక్కుల’తో హెయిర్ స్టైల్‌కి చిక్కులు.. మృదువైన జుట్టు కోసం అద్భుతమైన సలహా.!
అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు సాధారణంగా చాలా రకాల హెయిర్‌స్టైల్స్ ట్రై చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఎంత బాగా జుట్టు స్టైలింగ్ చేసుకున్నా.. వానలో తడిస్తే కాసేపటికే ఆ లుక్ అంతా పోతుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో మరుసటి రోజు స్టైలింగ్ చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఇక చిక్కులు కూడా పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలా.?

వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యం త్వరగా ప్రభావితమవుతుంది. గాలిలో దుుమ్ము, ధూళి, తేమ కారణంగా కురులు దెబ్బతింటాయి. అంతేకాకుండా చిక్కులు పడుతుంది. ఇక తల చర్మంపై దురద కూడా పడుతుంది. దీంతో జుట్టు రాలిపోవడమే కాకుండా హెయిర్ స్టైలింగ్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో చిక్కుల నుంచి బయటపడి జుట్టు అందంగా స్టైలిష్‌గా చేసుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.
షాంపూ ఎంపిక
వర్షంలో తడిసి ఇంటికి వచ్చినట్లయితే వెంటనే తలస్నానం చేయాలి. లేదంటే చెమట, నూనె కారణంగా జుట్టు జిగటగా మారుతుంది. ఇంకా చిక్కులు పడి చిరాకు తెప్పిస్తాయి. అయితే తలస్నానం చేసేటప్పుడు తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. కఠినమైన షాంపూలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా భారీ హెయిర్ స్టైలింగ్ జోలికి పోకుండా సింపుల్‌గా స్టైల్ చేసుకోవడం ఉత్తమం.
నూనె ఎక్కువగా వద్దు..
జుట్టు ఆరోగ్యానికి నాణ్యమైన హెయిర్ ఆయిల్ దోహదపడుతుంది. ఇదే కురులను మృదువుగా చేస్తుంది. అయితే ఈకాలంలో తలకు నూనె పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కువగా నూనె పెట్టకండి. ఎందుకంటే తేమ కారణంగా జిగట పొర ఏర్పడుతుంది. తక్కువ మొత్తంలో నూనె ఉపయోగిస్తూ కురుల చివర్లను సున్నితంగా మర్దన చేసుకోవాలి.

జుట్టు కత్తిరించండి
మీ కురులు బారుగా ఉండి రకరకాల హెయిర్‌స్టైల్స్ ప్రయత్నించడం సాధ్యం కాకపోతే మంచి హెయిర్‌కట్ ద్వారా పరిష్కారం ఉంటుంది. దీని ద్వారా వర్షాలకు జుట్టు చిక్కులు పడకుండా ఉండి కాపాడుతుంది. మెరిసేలా చేస్తుంది. ఈ కాలంలో హెయిర్ స్టైలింగ్ సమయంలో బ్లీచ్‌ను ఎక్కువగా వాడొద్దని.. దీనిద్వారా మీ జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుందని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు.
హెయిర్ సీరమ్
వర్షాకాలంలో జుట్టు సంరక్షణకి హెయిర్ సీరమ్ ఉత్తమంగా పనిచేస్తుంది. లీవ్ ఇన్ కండిషనర్ లేదా సీరమ్‌ను మీ కురులు తడిగా ఉన్నప్పుడు అప్లై చేయండి. దీని వల్ల జుట్టుపై రక్షణ పొర ఏర్పడి సంరక్షిస్తుంది. తేమ నుంచి కలిగే జిడ్డు నుంచి కాపాడుతుంది. వారానికి మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేయవచ్చు.
హెయిర్ మాస్క్
జుట్టు చిక్కులకు హెయిర్ మాస్క్ మంచి పరిష్కారం. వారానికి ఒకసారి దీనిని అప్లై చేయడం ద్వారా చిక్కులను తొలగిస్తుంది. పండిన అరటిపండులో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇదే హెయిర్ మాస్క్. దీనిని జుట్టుకి పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. దీని ద్వారా జుట్టు లోతు వరకు తేమ అందుతుంది. చిక్కులు విడిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
