Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
ముఖానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతున్నారా?.. ఈ స్కిన్ టోన్ ఉన్నవారు జాగ్రత్త.!
చర్మ సంరక్షణలో విటమిన్ ఇ క్యాప్సూల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, జలుబు సమస్యతో సతమతమవుతున్నవారు మరుగుతున్న నీళ్లలో ఈ క్యాప్సూల్స్‌ని వేసుకుని ఆవిరి పట్టడం ద్వారా చాలా ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మెరిసే చర్మానికి సైతం ఇవి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. అదెలాగో చూద్దాం..

మహిళలు తమ చర్మ సంరక్షణలో భాగంగా తరచుగా విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగిస్తుంటారు. వీటిని ముఖంపై అప్లై చేసుకుని మర్దన చేసుకోవడం ద్వారా కాంతివంతంగా మారుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు.. చర్మాన్ని కాలుష్యం, ఫ్రీ రాడికల్స్, యూవీ కిరణాల బారి నుంచి కాపాడుతుంది.
మీ చర్మం పొర బలహీనంగా ఉండి, తేమ శాతం తక్కువగా ఉండి పొడిగా ఉన్నట్లయితే విటమని ఇ క్యాప్సూల్స్ దివ్య ఔషధంలా కనిపిస్తాయి. వీటిని ముఖంపై అప్లై చేసుకోవడం ద్వారా మీ చర్మం పొరను బలంగా చేస్తుంది. తేమ బయటకు పోకుండా కాపాడుతుంది. ఫలితంగా స్కిన్ పొడిబారడం, చికాకు వంటి సమస్యలు తొలగి ప్రకాశవంతంగా ఉంటుంది.
ముఖంపై జిడ్డు ఉంటే
అయితే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించాలనుకునేవారు ముందుగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖంపై జిడ్డు, మొటిమలు ఉన్నవారికి ఈ క్యాప్సూల్స్ దుష్ప్రభావం చూపించవచ్చు. వీటిలోని నూనె చిక్కగా ఉండటం వల్ల ఇది చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా చికాకు ఏర్పడుతుంది. అలాంటి వారు తేలికపాటి సీరమ్‌ను ఉపయోగించడం ఉత్తమం. విటమిన్ ఇ సీరమ్‌లు తేలికగా ఉండటంతో చర్మంపై రాసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇక ముఖంపై లోతైన మచ్చలు ఉన్నవారు నిపుణుల సలహాతో ట్రీట్‌మెంట్ తీసుకోవడం అవసరం.
ఎన్నిసార్లు ఉపయోగించాలి
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను రోజుకు రెండుసార్లు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం రాత్రిపూట రాసుకోవడం మంచింది. అయితే పగటిపూట ఈ క్యాప్సూల్స్‌ను రాసుకుంటే తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఎందుకంటే సన్‌స్క్రీన్‌తో కలిపినప్పుడు ఈ విటమిన్ ఇ క్యాప్సూల్స్ బాగా పనిచేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
