Latest Updates
-
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.!
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్!
షకీలా..ఇప్పుడున్న జెన్ జీకి ఈ పేరు గురించి పెద్దగా తెలిసి ఉండదు కానీ, 80, 90ల్లో పుట్టినవాళ్లకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. కొన్ని దశాబ్దాల పాటు సౌతిండియా మూవీ ఇండస్ట్రీలో తిరుగులైని స్టార్ డమ్ సంపాదించుకుంది. రోడ్డు సైడ్ ఆమె పోస్టర్ కనబడినా చాలు పిచ్చెక్కిపోయేవాళ్లు అప్పట్లో. అంత క్రేజ్ ఆమెది.
అడల్ట్ సినిమాల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి షకీలాకు తాజాగా ఎదురైన ఓ చేదు అనుభవం.. ఇప్పుడు మొబైల్ గేమింగ్, అధిక స్క్రీన్ టైమ్ వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

కేవలం టైంపాస్ కోసం షకీలా ఆడిన మొబైల్ గేమ్స్ ఏకంగా ఆమె మెడ, వెన్నెముక భాగాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆమె ఏకంగా రూ. 3 లక్షలు ఖర్చు చేసి మెడకు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చండి. ఈ సంఘటన మొబైల్ ఫోన్లకు బానిసలైన ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద హెచ్చరిక. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక ఆమె దీని గురించి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఒక పక్కకు పడుకొని గంటల పాటు
షకీలా చెప్పిన ప్రకారం ఆమె ఒకవైపుకి తిరిగి పడుకొని కంటిన్యూగా 4 గంటల పాటు ఫోన్ లో గేమ్స్ ఆడేది. గేమ్ అయ్యాక మళ్లీ అదే ఫోన్ లో రీల్స్, ఇన్ స్టాగ్రామ్ వాడుతుండేది. అతిగా ఫోన్ వాడితే తనలాంటి పరిస్థితి వస్తుందని, ఇప్పుడు డబ్బులు పోవడంతో పాటు నరకం అనుభవిస్తున్నట్లు ఆమె చెప్పారు. పిల్లల చేతికి ఫోన్లు ఇవ్వొద్దని పేరెంట్స్ కు షకీలా విజ్ణప్తి చేశారు.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. అందరిదీ అదే తీరు
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం అనేది పిల్లల నుంచి పెద్దవారి వరకు అనేకమంది దినచర్యలో విడదీయరాని భాగంగా మారిపోయింది. కాసేపు రిలాక్స్ అవ్వడానికో, లేదా బోర్ కొట్టకుండా ఉండటానికో మొదలుపెట్టిన గేమ్.. తెలియకుండానే గంటల తరబడి ఆడేలా చేస్తుంది.
మరోవైపు పిల్లలు అల్లరి ఆపడానికో, అన్నం తినిపించడానికో తల్లిదండ్రులే స్వయంగా వాళ్ల చేతికి ఫోన్లు ఇస్తున్నారు. దీనివల్ల నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు మొబైల్ చేతిలో ఉండాల్సిందే అన్నంతగా వారు దానికి బానిసలవుతున్నారు. బస్సు, రైలు ప్రయాణాల్లోనూ, ఇంట్లో ఖాళీ సమయాల్లోనూ పెద్దలు సైతం ఈ గేమింగ్ మాయలో పడిపోయి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.

టెక్స్ట్ నెక్ సిండ్రోమ్.. మెడ, వెన్నెముకకు తీవ్ర ముప్పు
గంటల తరబడి తల కిందకు వంచుకుని మొబైల్ స్క్రీన్ వంక చూడటం ఎంత ప్రమాదకరమో వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తల కిందకు వంచినప్పుడు మెడ మీద, వెన్నెముక మీద ఊహించని స్థాయిలో అదనపు భారం పడుతుంది. దీర్ఘకాలం పాటు ఒకే భంగిమలో ఇలా కూర్చోవడం వల్ల మెడ కండరాలు బిగుసుకుపోతాయి. ముందుగా సాధారణ మెడనొప్పి, భుజాల నొప్పితో మొదలయ్యే ఈ సమస్య.. రానురాను వెన్నెముకలోని డిస్క్ జారిపోవడం (స్లిప్ డిస్క్), ఎముకలు అరిగిపోవడం లాంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది.

నరాలు, కళ్ళపై పెను ప్రభావం
గేమ్స్ ఆడే మత్తులో చాలామంది బెడ్ మీద లేదా సోఫాలో గంటల తరబడి వంగి కూర్చుంటారు. దీనివల్ల వెన్నెముక ఆకృతి దెబ్బతిని, వీపు కింది భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఇక మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్‌పై పదే పదే ట్యాప్ చేయడం, వేగంగా స్వైప్ చేయడం వల్ల వేళ్లు, మణికట్టు నరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా చేతులు తిమ్మిర్లు ఎక్కడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, చేతుల్లో బలం తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి తోడు కన్నార్పకుండా స్క్రీన్ ను చూస్తుండటం వల్ల కళ్లలో సహజంగా ఉండే తేమ తగ్గిపోయి, కళ్లు పొడిబారడం (డ్రై ఐస్), ఎర్రబడటం, కళ్ల మంటలు, తీవ్రమైన తలనొప్పి వంటివి బాధిస్తాయి.
శారీరక, మానసిక సమస్యలు సైతం..
గేమ్స్ ఆడుతూ కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శారీరక శ్రమ తగ్గిపోయి ఊబకాయం బారిన పడటమే కాకుండా, జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. అంతేకాకుండా, మొబైల్ పక్కనపెట్టగానే విపరీతమైన చిరాకు రావడం, నిద్రలేమి ఏ పనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి మానసిక సమస్యలు కూడా వేధిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications