Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Mixing Whiskey & Beer: విస్కీ, బీర్ కలిపి తాగుతున్నారా? ఈ సైడ్‌ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త!
విస్కీ.. బీర్.. చాలా ఫేమస్ ఆల్కహాల్స్. రుచిలో, ఆల్కహాల్ శాతంలో చాలా తేడా ఉంటుంది. కొందరు విస్కీ తాగే వారు బీర్‌కు దూరంగా ఉంటారు. ఇంకొందరు బీర్ తాగి విస్కీని ముట్టుకోరు. మరికొందరు మాత్రం బీర్, విస్కీని కలిపి తాగుతుంటారు. మరి ఇలా ఈ రెండింటిని కలిపి తాగడం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉంటే ఎలాంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
విస్కీ, బీర్ మిక్స్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్:
* మత్తు పెరుగుతుంది:
విస్కీ, బీర్ కలిపి తాగడం లేదా ఒకదాని తర్వాత మరొకటి తాగడం వల్ల మత్తు స్థాయి పెరుగుతుంది. రెండింటిలోనూ ఉండే ఆల్కహాల్ శాతం వల్ల మత్తు రెట్టింపుగా వస్తుంది.

* డీహైడ్రేషన్:
విస్కీ, బీర్ కలిపి తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. మాములుగా ఆల్కహాల్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ రెండింటిని కలపడం వల్ల మరింత వేగంగా డీహైడ్రేషన్ బారిన పడతారు. దీని వల్ల తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం, వాంతులు కావడం వంటివి జరుగుతాయి.
* గ్యాస్ట్రోఇంటెస్టినల్ అప్‌సెట్:
విస్కీ బీర్ కలిపి తాగడం లేదా ఒకదాని తర్వాత మరొకటి తాగడం వల్ల గ్యాస్ట్రోఇంటెస్టినల్ అప్‌సెట్ అవుతుంది. దీని వల్ల వాంతులు, వికారం, కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
* హ్యాంగోవర్:
విస్కీ, బీర్ కలపడం వల్ల హ్యాంగోవర్ మరింత తీవ్రంగా ఉంటుంది. డీహైడ్రేషన్, ఇన్ఫ్లమేషన్, ఎలక్ట్రోలైట్ ఇన్‌బ్యాలెన్స్ వంటి అనేక కారణాల వల్ల హ్యాంగోవర్ వస్తుంది. విస్కీ, బీర్ కలిపి తాగితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.
అందరిలో సైడ్‌ఎఫెక్ట్స్ కనిపిస్తాయా?:
బీర్, విస్కీ తాగడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. వారి మద్యం సేవించే అలవాటు, ఆల్కహాల్ టోలెరెన్స్, ఎంత తాగుతున్నారు, లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. విస్కీ, బీర్ కలిపి తాగాలనుకున్నా.. ఒకదాని తర్వాత ఒకటి తాగాలనుకున్నా.. పరిమితికి మించొద్దు అని గుర్తుంచుకోవాలి. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పుష్కలంగా నీరు తాగాలి.
విస్కీ, బీర్ మిక్సింగ్ సేఫ్టీ టిప్స్:
* మితంగా తాగాలి:
విస్కీ, బీర్ మిక్స్ చేసి తాగాలనుకుంటే పరిమితి మించి తాగకూడదు. వీలైనంత తక్కువగా తాగేలా నియంత్రణలో ఉండాలి.
* పుష్కలంగా నీరు తాగాలి:
ఆల్కహాలా తాగేటప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. పుష్కలంగా నీరు తాగాలని గుర్తుంచుకోవాలి.
* తాగే ముందు తినాలి:
తాగే ముందు కొంత ఆహారం తినాలి. దీని వల్ల రక్తంలోకి ఆల్కహాల్ శోషణ మందగిస్తుంది.
Disclaimer: Alcohol Drinking Is Injurious To Health.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications