Latest Updates
-
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా..
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే?
ఉద్యోగాలు చేసే చాలామంది ప్రస్తుతం మెడ నొప్పి, వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. సాధారణం కొంచెం వయసు పైబడిన తర్వాతనే ఎముకలు బలహీనపడటం, క్షీణించడం జరిగేది. కానీ ఇప్పుడు మగ, ఆడా తేడా లేకుండా టీనేజర్లు, ఇరవైలలోని యువత చాలామంది ఈ సమస్యలతో నరకం చూస్తున్నారు.
అయితే దీనికి ప్రధాన కారణం..గంటల తరబడి కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్ టాప్ ను తప్పు కోణంలో వాడుతూ, వంకరగా కూర్చోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతోందట.

సమస్య ఎక్కడ వస్తోంది?
మన మెడకు ప్రకృతి సిద్ధంగా ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. తలను బ్యాలెన్స్ చేస్తూ, వివిధ దిశల్లో తిప్పడం దాని ప్రధాన పని. కానీ మనం గంటల తరబడి ఒకే భంగిమలో, తల వంచి కూర్చుంటే మెడ కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా తలనొప్పి, మెడ పట్టేయడం, భుజాల నొప్పులకు దారితీస్తుంది. అంతేకాకుండా ఈ చెడు అలవాటు వల్ల వెన్నెముక సహజ ఆకారమే దెబ్బతింటుంది.
ఈ నొప్పుల నుండి బయటపడటానికి చిట్కాలు
స్క్రీన్ ఎత్తు: కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ సరిగ్గా మీ కంటి చూపు లెవల్ కి ఉండాలి. దీనివల్ల స్క్రీన్ చూసేందుకు మెడను కిందికి వంచాల్సిన అవసరం ఉండదు.
కూర్చునే భంగిమ: మీ వీపు భాగాన్ని, వెన్నెముకను నిటారుగా ఉంచి కుర్చీకి ఆనుకుని కూర్చోండి. భంగిమ సౌకర్యవంతంగా ఉండాలి కానీ మరీ వంగిపోకూడదు.
పాదాల అమరిక: మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు మీ పాదాలు నేరుగా నేలకు ఆనుకుని సమాంతరంగా ఉండాలి.
విరామాలు ఇవ్వండి: గంటల తరబడి ఒకే భంగిమలో కదలకుండా కూర్చోకండి. ప్రతి 40-45 నిమిషాలకు ఒకసారి కుర్చీలో నుంచి లేవండి. రెండు నిమిషాలు గదిలో నడవండి. మెడను నెమ్మదిగా ఎడమకు, కుడికి, పైకి, కిందకు తిప్పే తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
డాక్టర్లను ఎప్పుడు కలవాలి
-మీకు తరచూ తీవ్రమైన మెడ,భుజాల నొప్పి వేధిస్తుంటే.
-మెడను సాధారణ రీతిలో తిప్పడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తే.
-నొప్పుల తీవ్రత పెరిగి మెడ, భుజాలు లేదా చేతులు మొద్దుబారినట్లు అనిపిస్తే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications

