Latest Updates
-
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్!
ఈ రోజుల్లో చాలా మంది రకరకాల వ్యాధులతో బాధపడుతుండటం మనం రోజూ చూస్తుంటాం. రోగాలు మనల్ని పట్టి పీడించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి శారీరక శ్రమ తగ్గిపోడం. గంటల తరబడి స్మార్ట్ ఫోన్లలో మునిగిపోవడం, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చోవడం, ఇంటి పక్కనున్న షాపుకి వెళ్లాలన్నా బైక్ లేదా కారు వేసుకెళ్లడం మన దినచర్యగా మారిపోయింది.
ఇలా నిరంతరం శరీరాన్ని క్రియారహితంగా ఉంచడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులే కాకుండా ప్రాణాంతక సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. అయితే వ్యాయామం చేయడానికి సమయం లేదని సాకులు చెప్పే వారందరికీ ఉత్సాహాన్నిచ్చే ఒక గుడ్ న్యూస్ ని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది.

ప్రముఖ మెడికల్ జర్నల్ BMC మెడిసిన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం మన రోజువారీ కదలికలకు, ఆరోగ్యానికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని బయటపెట్టింది. దాదాపు 60,000 మంది వ్యక్తుల జీవనశైలి, ఆరోగ్య డేటాను నిశితంగా విశ్లేషించిన పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాలను కనుగొన్నారు.
3 నిమిషాల మ్యాజిక్
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ జిమ్ లో గంటల తరబడి భారీ బరువులు ఎత్తుతూ చెమటోడ్చాల్సిన పనిలేదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజువారీ పనుల మధ్యలో కేవలం 3 నిమిషాల పాటు చురుకైన శారీరక శ్రమ చేస్తే చాలు.. ఏకంగా 13 రకాల క్యాన్సర్ల బారిన పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది.
దీనికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించక్కర్లేదు. లిఫ్ట్ కు బదులుగా వేగంగా మెట్లు ఎక్కడం, బస్సు కోసం ఆత్రంగా నడవడం, పిల్లలతో కలిసి కాసేపు పరుగెత్తడం లేదా ఇంట్లో పనులు చురుగ్గా చేయడం లాంటివి చేస్తే సరిపోతుంది.
15 నిమిషాల నడకతో ఎంతో మేలు
రోజుకు కనీసం 15 నిమిషాల పాటు సాధారణ నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనం సూచిస్తోంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం మానుకుని, మధ్యమధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకుంటూ అటూ ఇటూ నడవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
అయితే, ఇక్కడ ఒక వాస్తవాన్ని గ్రహించాలి. కేవలం మూడు నిమిషాలు జాగింగ్ చేస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుందని దీని అర్థం కాదు. కదలికలు లేని జీవనశైలితో పోలిస్తే, ఇలాంటి చిన్నపాటి వ్యాయామాలు క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో ఒక రక్షణ కవచంలా సహాయపడతాయని మాత్రమే ఈ అధ్యయనం వివరిస్తోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
