Latest Updates
-
వంట రాని వారు కూడా చిటికెలో చేసే సూపర్ టేస్టీ స్నాక్.. ఆలూ కట్లీ చేసుకోండిలా.. -
విడిపోయే పరిస్థితి ఉన్నా కలిసుండక తప్పట్లేదా.. ఈ 3 విషయాలపై ఫోకస్ పెడితే చాలు.! -
116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమల కొండకి.. వీఐపీ దర్శనంతో బామ్మకి అరుదైన గౌరవం.! -
కురుల ‘చిక్కుల’తో హెయిర్ స్టైల్‌కి చిక్కులు.. మృదువైన జుట్టు కోసం అద్భుతమైన సలహా.! -
ఇడ్లీ,దోసెల్లోకి దీన్ని మించిన చట్నీ ఉండదేమో!..అన్నంలోకి కూడా సూపరే.. -
కోడలిని కూతురిగా చూడాల్సిన అవసరం లేదు.. ప్రశాంతమైన శేష జీవితానికి బంగారు సూత్రాలు -
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.?
రోజుకు ఎన్ని కప్పుల బ్లాక్ కాఫీ తాగొచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా యాప్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ తెరిస్తే చాలు.. బ్లాక్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో పోస్టులు, వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఫిట్‌నెస్ నిపుణులు దీనిని ప్రమోట్ చేస్తున్న తీరు వల్ల ప్రజల్లో బ్లాక్ కాఫీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

బరువు తగ్గాలనుకునే వారు, రోజంతా మెదడును చురుకుగా ఉంచుకోవాలనుకునే వారు, వ్యాయామానికి ముందు ఎనర్జీ కోసం దీనిని ఒక మ్యాజిక్ డ్రింక్ లాగా భావిస్తున్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఇతరులను చూసి, అసలు అది తమ శరీరానికి సరిపడుతుందా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డిగా బ్లాక్ కాఫీ తాగడం మొదలుపెడుతున్నారు. అయితే నిజంగానే బ్లాక్ కాఫీ ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందా? దీనిని రోజూ తాగడం ఆరోగ్యానికి సురక్షితమేనా?
బ్లాక్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు
నిపుణుల ప్రకారం బ్లాక్ కాఫీ ప్రభావం అనేది అందరిపైనా ఒకేలా ఉండదు. ఇది ముఖ్యంగా వ్యక్తి వయస్సు, వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, వారి శరీరం కెఫిన్‌ను ఎంతవరకు తట్టుకోగలదు అనే పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కాఫీ తాగడం వల్ల మీ శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే, నిరభ్యంతరంగా తాగొచ్చు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బ్లాక్ కాఫీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి కాలేయ ఆరోగ్యం. పరిమిత మోతాదులో బ్లాక్ కాఫీ తాగితే అది లివర్‌కు ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధి అయిన లివర్ ఫైబ్రోసిస్ వచ్చే ప్రమాదాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అందరికీ మంచిది కాదా?
అయితే, ఇది ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందన్న గ్యారెంటీ లేదు. కొంతమందికి బ్లాక్ కాఫీ తాగిన తర్వాత రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె దడ, అజీర్తి లేదా కడుపులో ఉబ్బరం లాంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు గనుక మీలో కనిపిస్తే బ్లాక్ కాఫీకి దూరంగా ఉండటమే ఉత్తమం. ఎవరికైతే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించదో, వారు తమ సామర్థ్యం మేరకు ప్రతిరోజూ మితంగా తాగొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నియమం.. అందులో పాలు, చక్కెర అస్సలు కలపకూడదు. ఒకవేళ చక్కెర, పాలు కలిపితే అందులోని కేలరీలు పెరిగిపోయి బరువు తగ్గే ప్రయోజనం దెబ్బతింటుంది.

ఉదయం పరగడుపున తాగొచ్చా?
చాలామందికి వచ్చే మరో సందేహం.. ఉదయం ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగొచ్చా? నేషనల్ కాఫీ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. కాఫీ తాగే 10 మందిలో 9 మంది తమ రోజును వేడివేడి కాఫీతోనే ప్రారంభిస్తారు. అత్యధిక శాతం ప్రజలకు ఖాళీ కడుపుతో కాఫీ తాగినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, కొందరికి పరగడుపున తాగితే కడుపులో మంట, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు మాత్రం ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరు జాగ్రత్త వహించాలి?
కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు బ్లాక్ కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హై బీపీ (అధిక రక్తపోటు), దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య, ఎసిడిటీ, ఎప్పుడూ గుండె లయ తప్పడం (ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్) లాంటి సమస్యలు ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుగా డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే బ్లాక్ కాఫీ తాగాలి.
రోజుకు ఎన్ని కప్పులు తాగడం సురక్షితం?
చివరిగా, ఒక రోజుకు ఎన్ని కప్పుల బ్లాక్ కాఫీ తాగొచ్చు అనే విషయానికి వస్తే.. దీనికి ఖచ్చితమైన పరిమితి అంటూ ఏమీ లేదు. రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగడం సాధారణం. అయితే ఆ పరిమితి అనేది ప్రతి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, కాఫీ మీకు సెట్ అవుతున్నంత కాలం మాత్రమే మితంగా ఆస్వాదించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications